*నల్గొండ జిల్లా కేంద్ర ప్రభత్వ ఆసుపత్రి ఎం.సి.హెచ్ కు జాతీయ ఆరోగ్య మిషన్ ""లక్ష్య"" సర్టిఫికెట్*
*నల్గొండ జిల్లా కేంద్ర ప్రభత్వ ఆసుపత్రి ఎం.సి.హెచ్ కు జాతీయ ఆరోగ్య మిషన్ ""లక్ష్య"" సర్టిఫికెట్* * *జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు,సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్ డా.గౌరవ్ ఉప్పల్* **జాతీయ స్థాయిలో నల్గొండ జిల్లా ఆసుపత్రికి ఎం.సి.హెచ్ కు గుర్తింపు* నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానా ఎం.సి.హెచ్ కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా కేంద్ర ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎం.సి.హెచ్ )కి "లక్ష్య" సర్టిఫికెట్ ను అందచేయనున్నది.లక్ష్య ప్రకారం ఆసుపత్రి ఎం.సి.హెచ్ లోని లేబర్ రూమ్,ఆపరేషన్ ధియేటర్ నిర్వహణ,చిన్న పిల్ల ల వార్డుల పరిశుభ్రత లను పరిగణలోకి తీసుకుని లక్ష్య సర్టిఫికెట్ లను అందచేస్తారు.ఈ సర్టిఫికెట్ కొసం రాష్ట్రంలో ని పలు దవాఖానాలు పోటీ పడగా,ఇటీవల కేంద్ర,వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు పరిశీలించి మార్కులు వేశారు. మే 16,17 తేదీల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ఇద్దరు డాక్టర్లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎం.సి.హెచ్ ని పరిశీలించారు.జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రం లోని లేబర్ రూం 89 శాతం,ఆపరేషన్ థియేటర్ 86 శాత...