మోతే లో ఘనంగా పండిత్ దిన్ దయల్ ఉపాధ్యాయ్ జయంతి
మోతే మండలం లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పండిత్ దిన్ దయల్ ఉపాధ్యాయ్ జయంతి వేడుకలను నాయకులు నిర్వహించారు ఇట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఇంఛార్జి నకిరికంటి జగన్ మోహన్ రావు పాల్గొని ఇట్టి ఈ జయంతి వేడుకలను ప్రారంభించారు అనంతరం దిన్ దయాళ్ చిత్ర పటానికి ఆయన నాయకులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అమర్ హై నినాదాలు చేసారు కాగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అతని జీవితమే ఈనాటి యువతకు ఒక ప్రేరణ, ఆదర్శం అన్నారు ఉత్తరపరదేశ్ లోని కుగ్రామంలో జన్మించి, చిన్నపుడే తల్లిదండ్రులను కోల్పోవడం జరిగిందని తెలిపారు ఆయన ముక్కవంచని దీక్షతో పై చదువులు చదివాడని చెప్పారు దయాల్ చిన్నప్పటి నుండి దేశం కోసం సేవ చేయాలనే తపనతో, తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సహితం వదిలేసి, ప్రజా సేవకు అకింతం అయ్యాడని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్ర సత్యనారయణ రెడ్డి,నాయకులు ఉప్పల రామచంద్రయ్య,బొంత వెంకటేశ్వర్లు అంగోతు శంకర్ నాయక్, బొమ్మనపల్లి వెంకన్న, ధారవత్ నీలమ్మ , అంగోత్ రమేష్ కార్యకర్తలు అభిమానులు గ్రామస్థు...