*ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన రెవెన్యూ సంఘాలు*
*మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి ముఖ్యమంత్రి గారూ..? *- అబాండాలు వేస్తూ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు* *- ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన రెవెన్యూ సంఘాలు* విధి నిర్వహణలో అసువులుబాసిన రెవెన్యూ ఉద్యోగుల సంతాప సభ ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. చనిపోయిన రెవెన్యూ ఉద్యోగులకు అన్ని రెవెన్యూ సంఘాల నేతలు సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి, టీజీటీఏ అధ్యక్షులు ఎస్.రాములు, టి.వి.ఆర్.ఒ.డబ్య్లూఏ రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు, టి.వి.ఆర్.ఒ.ఏ అధ్యక్షులు ఎన్.లక్ష్మినారాయణ, టీడీఆర్‌వీఆర్వోఏ అధ్యక్షులు రవినాయక్, టీఎస్‌వీఆర్ఏ అధ్యక్షులు వంగూరు రాములు హాజరయ్యారు. *58 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇవ్వలేదా..?* ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడిన తర్వాత రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిందని, దీంతో అనేక మంది ఉద్యోగులు పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ప్రమాదాల కారణంగా మరణించారని పేర్కొన్నారు....