Posts

**తప్పిన ఘోర ప్రమాదం**

తప్పిన ఘోర ప్రమాదం పది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి.... కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం శివారులో  పొలం పనులకు వెళ్తున్న  ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి ...  మృతి చెందిన మహిళ తమ్మిశెట్టి ధనలక్ష్మి (32 )జుజ్జూరు గ్రామం గా గుర్తించిన పోలీసులు ..... ట్రాక్టర్ పై సుమారు పది మంది కూలీలు ఉన్నట్లు సమాచారం....  మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను ప్రైవేటు వాహనంలో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది..... ఈ ప్రమాదానికి మూల కారణం అతివేగమే అంటున్నారు స్థానికులు

**పోలీసుల అదుపులో బడాబాబులు**

పోలీసుల అదుపులో బడాబాబులు కంచికచర్ల పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించిన పోలీస్ అధికారులు నందిగామ రూరల్ సీఐ సతీష్ కంచికచర్ల ఎస్సై శ్రీ హరి బాబు వారి సిబ్బందితో కలిసి కంచికచర్ల పట్టణంలోని   ఒక ఇంట్లో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించగా వారి వద్ద నుంచి 65,870  రూపాయల నగదు 11 సెల్ ఫోన్లు రెండు కార్లు రెండు బైకులు స్వాధీనం చేసుకొని 11 మంది వ్యక్తులను,  అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

**ఏలూరు టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే బడేటి‌ బుజ్జి మృతి* *

ప.గో.జిల్లా  *ఏలూరు టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే బడేటి‌ బుజ్జి మృతి*  తెల్లవారుఝమున గుండెపోటు రావడంతో ఆంద్ర ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించిన వైద్యులు 2014 నుండి 2019 వరకు ఏలూరు ఎమ్మెల్యే గా పనిచేసిన బడేటి బుజ్జి గతంలోనూ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గా పనిచేసిన బడేటి కోట రామారావు (బుజ్జి) సినీ నటుడు ఎస్వీ రంగారావు మేనల్లుడు బడేటి బుజ్జి

**ఉన్న కంటి చూపు కూడా తీసేసిన డాక్టర్లు.**

దూరపు చూపు కనిపించట్లేదు అని హబ్సిగూడా లోని ఆనంద్ హాస్పిటల్ కి వెళ్తే ఉన్న కంటి చూపు కూడా తీసేసిన డాక్టర్లు. హైద్రాబాద్ ఉప్పల్ లో కూలి పనులు చేసుకుంటూ బతికిన కట్టా చెన్నమ్మ పరిస్థితి ఇది. 2013 లో అప్పుల బాధ, అనారోగ్యం తో వాళ్ళ ఆయనను కోల్పోయిన చెన్నమ్మ ఇపుడు ఇద్దరు పిల్లలను చదివించుకోలేక దిక్కుతోచని పరిస్థితిలో లో ఉంది. 

**అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కీచక పర్వం**

కుత్బుల్లాపూర్‌: నగర శివారులోని ఇంజనీరింగ్‌ కాలేజీలో పనిచేస్తున్న ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కీచక పర్వానికి తెరలేపాడు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన సదరు ప్రొఫెసర్‌ ఓ విద్యార్థినిని ల్యాబ్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వెంకటయ్య ల్యాబ్‌కు పిలిపించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు కరీంనగర్‌లో ఉన్న తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

**నలుగురు దుర్మరణం**

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను శంకర్‌, నరేశ్‌, మేఘవర్షిణి, జ్యోతిగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

**సచిన్‌ టెండూల్కర్‌కు భద్రత కుదింపు**

ముంబై : క్రికెట్‌ దేవుడు, భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌కు ముంబై : క్రికెట్‌ దేవుడు, భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌కు ఉన్న ఎక్స్‌ కేటగిరీ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం కుదించింది. అంటే ఇప్పటి నుంచి సచిన్‌కు 24 గంటల సెక్యూరిటీ ఉండదు. కానీ ఎస్కార్ట్‌ సదుపాయం ఉంటుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య థాక్రేకు మాత్రం భద్రతను పెంచారు. ఆదిత్యకు ఇప్పుడున్న వై ప్లస్‌ సెక్యూరిటీ నుంచి జెడ్‌ ప్లస్‌కు పెంచారు. ఇంటెలిజెన్స్‌ సమాచారం ప్రకారం ఆయా వ్యక్తులకున్న ముప్పును పరినణనలోకి తీసుకొన్న తర్వాత ఈ విషయంపై ఏర్పాటైన కమిటీ బుధవారం సమావేశమై ఈ నిర్ణయాలను తీసుకొంది. బీజేపీ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సేకు ఉన్న వై సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. ఇకపై ఆయనకు ఎలాంటి భద్రత ఉండదు. మరో బీజేపీ నేత, ఉత్తర ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ రామ్‌ నాయక్‌కు జెడ్‌ ప్లస్‌ నుంచి ఎక్స్‌ కేటగిరీకి మార్చారు. కాగా మహారాష్ట్రలో 97 మందికి ఇలాంటి భద్రతా సదుపాయాలు ఉండగా, 29 మందికి భద్రతా కేటగిరీలో మార్పులు చేశారు.ఉన్న ఎక్స్‌ కేటగిరీ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం కుదించింది. అంటే ఇప్పటి నుంచి సచిన్‌కు 24 గంటల సెక్యూరిటీ ఉండదు. కానీ ఎస్...