ఉపాధ్యాయులకు నిష్ట శిక్షణా కార్యాక్రమం నల్లగొండ లోని గోకుల్ బి.ఎడ్ కళాశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు జరుగుచున్న నిష్ట శిక్షణా కార్యాక్రమంలొ భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి.వేణు ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయులకు జువనైల్ జస్టిస్, బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నిషేధం, పోక్సో యాక్ట్, విధ్యా హక్కు చట్టం పై విశదీకరించి గురువు దైవంతొ సమానమని, గురుతర బాధ్యత ఎంతో ఉందని, బాల, బాలికలపై ఎన్నో అకృత్యాలు జరుగుచున్నవని నేటి రోజులలొ సాంకేతిక విజ్ఞానం పెరిగినా కొద్ది మంచి చెడు నిర్ణయించటం పెను సవాలుగా మారుతుందని, చట్టాలున్నా, విజ్ఞానమున్నా మనుషులలొ మార్పు లేకుంటె నాగరిక సమాజం పొందలేమన్నారు, దేశ భవితను పెంపొందించే రాజ్యాంగ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఎంతో ఉందని తెలుపుతూ న్యాయ సేవ అధికార చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అందరికి అందుబాటులొ న్యాయం అనే సిద్దాంతం ద్వారా న్యాయ సేవలు న్యాయ సేవ సంస్థ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఇంచార్జి చంద్రశేఖర్, రిసోర్స్ పర్సన్స్ యోగీంద్రనాథ్, రాములు...