Posts

**గురుకుల పాఠశాల విద్యార్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించండి- నల్గొండ ఇంఛార్జి జిల్లా కలెక్టర్ వి.చంద్ర శేఖర్**

Image
నల్గొండ,జనవరి 30.జ్వరంతో జిల్లా కేంద్ర ఆసుపత్రి లో చేరిన నకిరేకల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఇంఛార్జి జిల్లా కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. జ్వరం తో బాధపడుతూ గురువారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో19 మంది విద్యార్థులు ఆసుపత్రి లో చేరి చికిత్స పొందుతున్నారు.గురువారం ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా 19 మంది విద్యార్థుల్లో 4 గురు జ్వరం,దగ్గుతో బాధపడుతున్నారని,మిగతా విద్యార్థులు సాధారణ స్థితి లో వున్నారని,వారి రక్త శాంపిల్స్ సేకరించి పరీక్ష కు పంపి రాత్రి చికిత్స అందిస్తున్నారు. విద్యార్తులు కొలుకునెలా మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఇంఛార్జి కలెక్టర్ ఆదేశించారు.విద్యా ర్థులు కు అవసరమైన రాత్రి వైద్య సేవలు అందేలా ఇద్దరు డాక్టర్ లు,ఎస్.సి.గురుకుల జిల్లా కో ఆర్డినేటర్ కుర్షిద్ ను, రీజియనల్ కో ఆర్డినేటర్ హెచ్ అరుణ కుమారి ని దగ్గరుండి పర్యవ...

**పోలీస్ శాఖ గౌరవం పెంచేలా సమజాభివృద్ధిలో బాగస్వామ్యులు కావాలి  : ఎస్పీ రంగనాధ్**

*పోలీస్ శాఖ గౌరవం పెంచేలా సమజాభివృద్ధిలో బాగస్వామ్యులు కావాలి  : ఎస్పీ రంగనాధ్* నల్గొండ : పోలీస్ శాఖ ప్రతిష్ట, గౌరవం మరింత పెరిగే విధంగా పదవీ విరమణ పొందిన తర్వాత సమజాభివృద్ది కార్యక్రమాలలో బాగస్వాములవుతూ మంచి పేరు సంపాదించుకోవాలని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు. గురువారం పోలీస్ శాఖలో పదవీ విరమణ పొందిన ఎస్.ఐ.లు ఏ.మధుసూధన్ రెడ్డి, జె. పెద్దులు, ఏ.ఎస్.ఐ. విజయపాల్ రెడ్డి, ఏ.ఆర్. ఎస్.ఐ. డి. వెంకట కిషన్ లను జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి వారి సేవలను ఎస్పీ అభినందించారు. సమాజంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తూ శాంతియుత వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా సేవలందించే అవకాశం పోలీస్ ఉద్యోగం ద్వారా లభిస్తుందని, పోలీస్ ఉద్యోగం ఎంతో ఉన్నతమైనదని పదవీ విరమణ తర్వాత ప్రజలలో పోలీసుల గౌరవం పెరిగే విధంగా వారితో మమేకం కావాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదురైనా నిత్యం ప్రజల కోసం పని చేయడంలో కలిగే సంతృప్తి అలాంటి వాటన్నింటిని మర్చిపోయేలా చేస్తుందని, పోలీస్ ఉద్యోగం లభించడం గర్వకారణమని అన్నారు. *పదోన్నతి ద్వారా బాధ్యత పెరుగుతుంది* - - విధి నిర్వహణలో రాజీ ...

**రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఎల్.ఇ.డి. స్క్రీన్ తో అవగాహన కార్యక్రమాలు : ఎస్పీ రంగనాధ్**

*రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఎల్.ఇ.డి. స్క్రీన్ తో అవగాహన కార్యక్రమాలు : ఎస్పీ రంగనాధ్* - - జాతీయ రహదారుల వెంబడి ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి - - రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు - - రోడ్డు ప్రమాదాల వీడియోలు, అవగాహనా కోసం ఎల్.ఇ.డి.తో కూడిన వాహనం ద్వారా ప్రచారం నల్గొండ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్.ఇ.డి. స్క్రీన్ కలిగిన వాహనాన్ని ఆయన గురువారం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లే రహదారుల వెంట ఉన్న కంప చెట్లు, పొదలను తొలగించడం ద్వారా వాహనదారులకు సరిగా కనపడే విధంగా, రోడ్డు మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాలలో జరిగిన ప్రాణనష్టం, కుటుంబాల పరిస్థితులను అందరికి అర్ధం అయ్యే...

**స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి అజరామరం : అదనపు ఎస్పీ నర్మద**

*స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి అజరామరం : అదనపు ఎస్పీ నర్మద* - - స్వాతంత్ర సమరంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను గుర్తు చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన పోలీసులు నల్గొండ : దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలర్పించిన సమరయోధుల స్ఫూర్తి అజరామరమని జిల్లా అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరయిపాలనలో అవస్థలు పడుతున్న దేశ ప్రజల బానిస సంకెళ్ల నుండి విముక్తి కల్పించడం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని విధి నిర్వహణలో మరింత సమర్ధవంతంగా పని చేస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. అనేక రకాల సమస్యలు, బాధలతో వచ్చే ప్రజలకు న్యాయం చేసే విధంగా పని చేయాలన్నారు. స్వాతంత్ర సమరంలో దేశం కోసం, దేశ ప్రజల కోసం త్యాగాలు చేసిన సమరయోధులను ప్రేరణగా తీసుకొని ప్రజలకు సేవలందించడంలో అగ్ర భాగంలో ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ వైభవ్ గైక్వాడ్, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణా రెడ్డి, డిపిఓ ఏ.ఓ. మ...

**వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్ **

అమరావతి  వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్  తన తండ్రి హత్య కేసును సిబిఐ కి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్  వేసిన వివేకా కుమార్తె సునీతమ్మ  ఇప్పటికే వివేకా హత్య కేసు సిబిఐ కి ఇవ్వాలని హైకోర్టు లో పిటిషన్లు వేసిన వైఎస్ జగన్ , వివేకా భార్య సౌభాగ్యమ్మ , ఎమ్మెల్సీ బీటెక్ రవి , మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి  కొత్తగా నాలుగో పిటిషన్ వేసిన వివేకా కుమార్తె సునీతమ్మ  విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సిబిఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే కోర్టుకి తెలిపిన ప్రభుత్వం  నేడు ఇప్పటికే వేసిన పిటిషన్ల పై విచారణ ఉండగానే వివేకా కుమార్తె మరో పిటిషన్ అన్ని పిటిషన్లపై నేడు విచారించనున్న ధర్మాసనం ప్రతివదులుగా సీబీఐ, ఏపీ హోం శాఖను చేర్చిన పిటీషినర్ సునీత

**కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకొన్న పశ్చిమగోదావరి జిల్లా మహిళలు **

Imp breaking విజయవాడ  కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకొన్న పశ్చిమగోదావరి జిల్లా మహిళలు  తమ దీనావస్థపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన బాధిత మహిళలు  వీడియో పై స్పందించిన సీఎం కార్యాలయాలయం  సీఎంఓ ఆదేశాలతో రంగంలోకి దిగిన దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్  పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్  బాధితుల కుటుంబసభ్యుల నుంచి వివరాల సేకరణ  కువైట్ ఎంబసీతో సంప్రదింపులు  నలుగురు బాధిత మహిళలకు విముక్తి  కువైట్ నుంచి స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు చర్యలు  సీఎంఓ స్పందనపై హర్షం వ్యక్తం చేస్తున్న బాధిత మహిళల కుంబసభ్యులు

**నేటి నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు**

*నేటి నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు* .  *మోపిదేవి*   *ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆలయ కమిషనర్  జి.వి.డి.ఎన్ లీలా కుమార్*  *కృష్ణాజిల్లా*   రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి...  ప్రతి సంవత్సరం లానే జరుపుకునే వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ శనివారం వరకు నిర్వహిస్తారు...  బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ పరిసరాలు ఆలయాన్ని రంగులు ,తోరణాలు, విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతోంది..  బ్రహ్మోత్సవాల్లో భాగంగా *29వ తేదీ బుధవారం శ్రీ స్వామివారి, శ్రీ అమ్మవార్ల కళ్యాణం జరుగుతుంది..*   *30వ తేదీ గురువారం రథోత్సవం రాత్రి 8 గంటలకు జరుగుతుంది .*  బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రల వ్యాప్తంగా భక్తులు విశేషంగా హాజరవుతారని, బ్రహ్మోత్సవం నిర్వహించే రోజులు భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని సహాయ కమిషనర్ జి .వి.డి.ఎన్   లీలాకుమార్ తెలిపారు..  బ్రహ్...