ఉప్పల ఫౌండేషన్ భోజన వితరణ మలక్ పెట్, అల్కపురి, చైతన్య పురి, కొత్తపేట, సీతాఫల్ మండిల లో
ఉప్పల ఫౌండేషన్ భోజన వితరణ మాలక్ పెట్, అల్కపురి, చైతన్య పురి, కొత్తపేట, సీతాఫల్ మండిల లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ఉప్పల ఫౌండేషన్ తరపున లాక్ డౌన్ విధించిన నాటినుండి ప్రతీరోజూ ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ మలక్ పేట గంజ్ హైదరాబాద్ మార్కెట్ లో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చీదర రాధగారి కోరిక మేరకు హమాలీలకు, డ్రైవర్లు, క్లీనర్లు శానిటర సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి భోజనం ఏర్పాటు చేసారు. అలాగే అల్కపురి, చైతన్య పురి, కొత్తపేట, సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి ప్రాంతాల్లో గల వలస కార్మికులకు, జీహెచ్ఎంసీ పరిధిలోని కూలీలకు, విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, జీహెచ్ఎంసీ సిబ్బందికి, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భోజనాన్ని అందించారు. ముఖ్యంగా నా అనేవారు లేని అభాగ్యులకు, తల్లితండ్రిలేక అనాధాశ్రమాల్లో ఉంటున్న చిన్న బిడ్డలకు వయసు పైబడి ఓల్డేజ్ హోంలలో ఉంటున్న పెద్దవారికి ఉప్పల ఫౌండేషన్ తరపున ఆకలి తీర్చుతున్నారు. లాక్ డౌన్ ముగిసేవరకూ వనస్థలిపురంలోని కరుణ జ్యోతి ట్రస్ట్ కు, నాగ...