Posts

కరోనా కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి  కె  చంద్రశేఖర్ రావు

Image
కరోనా కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి  కె  చంద్రశేఖర్ రావు గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్న క్రమంలో ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను ముఖ్యమంత్రి  కె  చంద్రశేఖర్ రావు అప్రమత్తం చేశారు.  ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో కేసులు పెరుగకుండా చూడాలని ఆదేశించారు.  సిఎం గారి ఆదేశాలమేరకు చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్,  ముఖ్యమంత్రి గారి ముఖ్యకార్యదర్శి నర్సింగా రావు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంత కుమారి, మున్సిపల్ , వ్యవసాయ శాఖ ముఖ్య  కార్యదర్శులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. సిఎం  సూచనల మేరకు కంటైన్మెంట్ ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ,మున్సిపల్ శాఖల సమన్వయంతో పని చేస్తున్నాయని సిఎం  నివేదించినట్లు మంత్రి తెలియజేశారు.  ఈ రోజు 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 1038 కి చేరుకున్నాయి.  మలకపెట్ గంజ్ లో పనిచేస్తున్నపహాడీ షరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్ల...

ఆరు కిలోల కోత ఎలా -జీవన్‌రెడ్డి

తెలంగాణధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యటించిన జీవన్‌రెడ్డి జగిత్యాల: కొనుగోలు కేంద్రాల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పర్యటించారు. కొనుగోళ్లు పూర్తయ్యాక రైతుకు ఏం సంబంధమని వారిని మిల్లర్ల దగ్గరకి ఎందుకు పంపుతున్నారని ప్రశ్నించారు. క్వింటాకు ఆరు కిలోల కోత ఎలా చేస్తారని నిలదీశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని.. మిల్లర్లతో అధికారులు కుమ్మక్కయ్యారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.

తెలంగాణలో కరోనా కేసుల తాజా సమాచారం

తెలంగాణలో కరోనా కేసుల తాజా సమాచారం తేది : 29-04-2020 ఈరోజు 7  పాజిటివ్ కేసులు నమోదు  ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు* : 1016 కరోనాతో మరణించిన వారు 25. ఇప్పటి వరకు వ్యాధి తగ్గి డిశ్చార్జ్ అయిన వారు 406 ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్న వారు585

హరీస్, హాలిమ్ విక్రయాలు సాగిస్తు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి

హరీస్, హాలిమ్ విక్రయాలు సాగిస్తు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి హాలిమ్, హారీస్ కౌంటర్లకు ఎక్కడా అనుమతి ఇవ్వలేదు బేకరీలు, పాన్, కిరాణా షాపులు  కౌంటర్లు ఏర్పాటు చేయడం నిషేధం వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ ఆధ్వర్యంలో కేసుల నమోదు నల్లగొండ : లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి హరీస్, హాలీమ్ కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్న అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ పట్టణంలో వన్ తౌన్ పరిధిలో రాయల్ సి కేఫ్, స్పైసి హోటల్, గ్రాండ్ హోటల్స్ నిర్వాహకులు, సిబ్బంది లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ నేతృత్వంలో కేసులు నమోదు చేశామని చెప్పారు. హరీస్, హాలిమ్ విక్రయాలు సాగిస్తున్న స్పైసి హోటల్ నిర్వాహకుడు యం.డి.ఫరీదుద్దీన్, అందులో పని చేసే ముస్తాక్, రాయల్ సి కేఫ్ నిర్వాహకుడు ఇమ్రాన్, అందులో వంట మాస్టర్ గా పని చేసే మహ్మద్ లతీఫ్, గ్రాండ్ హోటల్ నిర్వాహకుడు షేక్ అరిఫ్ లను అదుపులోకి తీసుకొని ఏపీడమిక్ డిసిస్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టుల కింద ...

బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ భాద్యతలు స్వీకరణ

Image
బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ భాద్యతలు స్వీకరణ బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్  బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించే ముందు పూజాధికార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యరద్శి పి.మురళీధర్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, వివేక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్-29-ఆంధ్రప్రదేశ్-కరోనా-బులిటీన్

Image
ఏపి లో 1332 కి చేరుకున్న కరోన పాజిటివ్ కేసులు. గడిచిన 24 గంటల్లో73 కేసులు నమోదు అయ్యాయి. అత్యందికంగా గుంటూరు లో 29 కేసులు నమెదు  అయ్యాయి. ఆక్టివ్ కేసులు 1014, ఇప్పటివరకు 287 డిశ్చార్జ్ అయ్యారు, 31 మంది  మృతి చెందారు.    

ఏప్రిల్ 28-తెలంగాణ-కరోనా-సమాచారం

ఏప్రిల్ 28-తెలంగాణ-కరోనా-సమాచారం ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే 6 పాజిటివ్ కేసులు రాష్ట్రలో 1009 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో 25 మంది చనిపోయారు ఇవాళ 42 మంది డిశ్చార్జి మొత్తం 374 మంది డిశ్చార్జి అక్టీవ్ కేసుల 610