కరోనా కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు
కరోనా కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్న క్రమంలో ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అప్రమత్తం చేశారు. ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో కేసులు పెరుగకుండా చూడాలని ఆదేశించారు. సిఎం గారి ఆదేశాలమేరకు చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, ముఖ్యమంత్రి గారి ముఖ్యకార్యదర్శి నర్సింగా రావు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంత కుమారి, మున్సిపల్ , వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. సిఎం సూచనల మేరకు కంటైన్మెంట్ ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ,మున్సిపల్ శాఖల సమన్వయంతో పని చేస్తున్నాయని సిఎం నివేదించినట్లు మంత్రి తెలియజేశారు. ఈ రోజు 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 1038 కి చేరుకున్నాయి. మలకపెట్ గంజ్ లో పనిచేస్తున్నపహాడీ షరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్ల...