Posts

విశాఖలో భారీ ప్రమాదం కంపెనీ నుంచి లీకైన కెమికల్ వాయువు

Image
విశాఖలో భారీ ప్రమాదం కంపెనీ నుంచి లీకైన కెమికల్ వాయువు రోడ్డుపైనే పడిపోతున్న జనం ఎల్జీ పాలిమర్స్‌లో ఘటన ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసుల హెచ్చరిక భయంతో మేఘాద్రి గడ్డవైపు ప్రజల పరుగులు   విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం జరిగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఆ వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.మరికొందరు రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడిపోయారు. 200 మంది అస్వస్థతకు గురైనారని తెలిసింది.అసవస్థతకు గురైన వారిలో ఆరుగురు మృతి చెందినట్లు తెలిసింది. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీయగా మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. అప్రమత్తమైన పోలీసులు సైరన్‌ మోగిస్తూ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు. ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులు, మహిళలను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ

Image
కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ ఇవాళ రాష్ట్రంలో 11   పాజిటివ్ కేసులు నమోదు ఇప్పటి వరకు రాష్ట్రం లో మొత్తం. 1107  కేసులు నమోదు తెలంగాణా లో 430 అక్టీవ్ కేసులు ఇవాళ 20 మంది డిశ్చార్జి ఇప్పటి వరకు 648 మంది డిశ్చార్జి ఇప్పటి వరకు మొత్తం 29 మంది మృతి  

సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా, ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు:

సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా, ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు: జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్.పి. ఏ.వి.రంగనాథ్* నల్లగొండ,మే6. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగిస్తూ   అనేక సదలింపులు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసినందున నిర్మాణ రంగంలో పనులకు ఇబ్బంది లేకుండా సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా కు వినియోగ దారులు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,ఎస్.పి. ఏ.వి.రంగ నాథ్ లు తెలిపారు.ప్రభుత్వ పనులకు,నిర్మాణ పనులకు సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, కర్మాగారాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరిచేందుకు అవకాశం కల్పించిందని, ఈ దశలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లాలనే నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించి ఇక్కడ పని చేసేలా వారికి నచ్చ చెప్పి వివరించాలని,పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఎస్పీ  ఏ.వి.రంగనాథ్ లు కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మండల తహశీల్దార్ లు,పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వలస కార్మికులు,సాండ్ టాక్సీ,స్మశాన వాటికలు,ఇంకుడు గుంతల నిర్మాణం

మే5-  ఆంధ్రప్రదేశ్ కరోనా బులిటెన్

Image
మే5-  ఆంధ్రప్రదేశ్ కరోనా బులిటెన్  మే5 - ఆంద్రప్రదేశ్  కరోనా బులిటీన్ ను   ఆరోగ్య శాఖ అధికారి విడుదల చేశారు. ఈ బులిటీన్లో  ఈ రోజు  67 కరోనా పాజిటివ్ కేసులు  నమోదు అయ్యాయని పేర్కొన్నారు. మొత్తం కేసులు 1717. ఆక్టివ్ కేసులు 1094,    ఇప్పటి వరకు 589 డిశ్చార్జ్ లు అయ్యారు. 34 మంది మృతి  చెందారు.

మద్యం దుకాణాలు ఖాళీ

దాదాపు 40 రోజుల లాక్ డౌన్ తరువాత మళ్ళీ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రజలు మద్యం కొనుగోలుకు విపరీతంగా ఎగబడ్డారు. ఇక తిరుపతి పట్టణంలో మద్యం దుకాణాల్లో మద్యం స్టాక్ మొత్తం ఖాళీ అయింది. ఒక్కో షాపులో పది నుంచి పదిహేను లక్షల వరకూ మద్యం అమ్మకాలు జరిగాయి. ఇప్పటికీ వైన్ షాపుల ముందు మందుబాబులు క్యూలైన్లలోనే ఉన్నారు. కాగా.. కొన్ని చోట్ల మద్యం సిబ్బంది మద్యం దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. రేపు డిపో నుంచి మద్యం స్టాక్ వచ్చాకే అమ్మకాలు జరుపుతామని దుకాణదారులు తెలిపారు. నేడు గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి.

దూసుకొస్తున్న భారీ తుపాన్.. ఎంఫాన్ గా నామకరణం

ఏపీ వైపు దూసుకొస్తున్న భారీ తుపాన్.. ఎంఫాన్ గా నామకరణం తెలుగు రాష్ట్రాలకు భారీ తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడం వల్ల వచ్చే మూడు రోజుల ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తుపాను ముప్పు పొంచి ఉందని ఆంధ్ర ప్రదేశ్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. ఇది మరింత బలపడి సుమారుగా మే 7 వ తేదీన ఆగ్నేయబంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా..ఇది మే 7 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దక్షిణ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తదుపరి 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈ

తెలంగాణలో మందు బాబులకు షాక్‌

తెలంగాణలో మందు బాబులకు షాక్‌ మందుబాబులకు తెలంగాణ సర్కార్‌ షాక్ ఇచ్చింది. సోమవారం నుంచి గ్రీన్‌ జోన్లలో మద్యం అమ్మకాలు చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ మందుబాబులకు తెలంగాణ సర్కార్‌ షాక్ ఇచ్చింది. సోమవారం నుంచి గ్రీన్‌ జోన్లలో మద్యం అమ్మకాలు చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. ఎక్సైజ్‌ అధికారులు మాత్రం నో చెప్పేశారు. రేపటి నుంచి తెలంగాణలోని గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు లేవని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో మందు బాబులకు షాక్ తగిలినట్లైంది