Posts

మే 31 తెలంగాణ కరోనా బులిటెన్

Image
తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు ఇప్పటి వరకు మొత్తం 2698 కేసులు నమోదు

జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్‌ 30 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. రేపటితో లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్‌ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. ఫేజ్‌-1 జూన్‌ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతి ఫేజ్‌-2 పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుంది. వీటికి అనుమతి లేదు.. మెట్రో రైలు సేవలకు అనుమతి లేదు. అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు. సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు,...

మే 29 తెలంగాణ కరోనా బులిటెన్

Image
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఈరోజు 169 కరోనా కేసులు

ఆ డాక్టర్‌పై నమ్మకం లేదు: సుధాకర్ తల్లి కావేరి భాయ్

ఆ డాక్టర్‌పై నమ్మకం లేదు: సుధాకర్ తల్లి కావేరి భాయ్ విశాఖ: తన కుమారుడు సుధాకర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ రామిరెడ్డిపై తనకు, తన కుమారుడికి నమ్మకం లేదని సుధాకర్ తల్లి కావేరి భాయ్ అన్నారు. అదే విషయం తన కొడుకు కూడా డాక్టర్‌తో చెప్పాడన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మెంటల్ లేని తన కొడుకును పిచ్చాసుపత్రిలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ అందరితో చాలా చక్కగా మాట్లాడుతున్నాడని.. అలాంటి వ్యక్తిని తీసుకువెళ్లి మెంటల్ ఆస్పత్రిలో ఎలా ఉంచుతారని ఆమె ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదని, ప్రభుత్వంపై కూడా తమకు నమ్మకం లేదని ఆమె అన్నారు. ఇవన్నీ చూస్తుంటే తన కొడుక్కు ప్రాణహాని ఉందనిపిస్తోందని కావేరి భాయ్ అనుమానం వ్యక్తం చేశారు. నిన్న నాలుగు పేజీల లెటర్ రాశారని, అలాంటి వ్యక్తిని మెంటల్ ఆస్పత్రిలో ఎందుకు ఉంచారో అర్థంకావడంలేదన్నారు. సరైన చికిత్స ఇవ్వడంలేదని ఆమె ఆరోపించారు. సరైన చికిత్స చేయపోవడంతో తన కొడుక్కి కొత్త సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరుగుతుందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామన్నారు. తీర్పు వచ్...

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారం పై హైకోర్టు తీర్పు

  అమరావతి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారం పై హైకోర్టు తీర్పు ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కొట్టి పారేసిన హైకోర్టు ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ కొట్టిపారేసిన హైకోర్టు  రమేశ్ కుమార్ ని  కమిషనర్ గా కొనసాగించాలని ఆదేశాలు

మే 28 తెలంగాణ కరోనా బులిటెన్

Image
తెలంగాణ లో  మే 28 117 కరోనా పాజిటివ్ కేసులు.. తెలంగాణ లో 66 ఇతర రాష్ట్రాలు 2, సౌదీ నుంచి వచ్చిన వాళ్లలో 49  

నల్గొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడుగా మొరిశెట్టి

Image
నల్గొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడుగా మొరిశెట్టి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గా మొరిశెట్టి నాగేశ్వర్ రావును    నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి  నియమించారు. ఈ సందర్బంగా మొరిశెట్టి మాట్లాడుతూ నా పై నమ్మకంతో నియమించిన జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి కి  మరియు  రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులకు కార్యకర్తలకు బిజెపి తన అభిమానులకు  అందరికి   ధన్యవాదాలు తెలిపారు.