అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు-భారీగా చోరీ సొత్తు స్వాధీనం తాళం వేసివున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను గురువారం సి.సి.ఎస్ మరియు ఖాజీపేట పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. పోలీసులు అరెస్టు చేసిన దొంగ నుండి సూమారు 30లక్షల విలువగల 475 గ్రాముల బంగారు, 3 కి.లోల వెండి అభరణాలతో పాటు, 2లక్షల 50వేల నగదు, 5ఎల్.ఈ.డీ టివిలు, 4ల్యాప్ ట్యా న్లు , ఒక ప్రింటర్, 2 సెల్ ఫోన్లు, 6కెమెరాలు, ఒక ట్యాబ్, ఒక డిజిటల్ వాచ్ ఖరీదైన చలువ అద్దాలతో పాటు ఒక గ్యాస్ సిలెండర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి పూర్తి వివరాలు: సయ్యద్ ఆలాఫ్ ఆలియాస్ అఫ్రోజ్, తండ్రి పేరు భక్షి, వయస్సు 37, నివాసం నవపేట గ్రామం, మండలం చీరాల, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు సయ్యద్ అల్తాఫ్ బాల్యం నుండే చిల్లర చోరీలకు పాల్పడటంతో నిందితుడి తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన నిందితుడు విజయవాడలో కారు డ్రైవింగ్ నేర్చుకోని కోద్ది రోజులు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఇదే సమ...