ఆన్ లైన్లో వ్యభి చార దందా
ఆన్ లైన్లో వ్యభి చార దందా చిలకలూరిపేటకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన తెలంగాణ రాచకొండ పోలీసులు అన్ లైన్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ రాచకొండ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ బ పట్టుకున్నారు. నిర్వాహకుల్లో ఒకరిని అరెస్ట్ చేయడమేగాక పశ్చిమ్ బంగ , కోల్కతాకు చెందిన నలుగురు యువతులకు విముక్తి కల్పించారు . పరారీలో ఉన్న అంజలి ( ప్రధాన నిర్వాహకురాలు ) , ఆమె సహాయ కుడు చిన్నా కోసం గాలిస్తున్నారు. *గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వంశీరెడ్డి* తో విజయవాడకు చెందిన అంజలి , చిన్నా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. అంతకుముందే వీరికి వివిధ రాష్ట్రాల్లో యువ తులను సరఫరా చేసే దళారులతో పరిచయముంది. వారి సహకారంతో కొంత డబ్బు చెల్లించి పశ్చిమ్ బంగా, కోల్కతాకు చెందిన నలుగురు యువతులను నగరానికి తీసు కొచ్చి బల్కంపేటలోని అద్దె ఇంట్లో ఉంచారు. సామాజిక మాధ్యమాలు , లొకాంటో తదితర వెబ్ సైట్లలో ఈ నలుగురి ఫొటోలను ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు. నమ్మకం కుదిరాకే మళ్లీ ఫోన్ ఈ వ్యవహారమంతా ఆన్ లైన్ లోనే జరుగుతోంది . విటుల నుంచి ఫోన్ రాగానే నిర్వాహ కులు అప్రమత్తమవు తారు. మీకు ఈ నంబర్ ఎక్కడి నుంచి వ...