Posts

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులకు ఘనంగా సన్మానం

Image
  మైనార్టీ మోర్చ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి    షేక్ బాబా, సోషల్ మీడియా కన్వీనర్  సయ్యద్ పాష,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బషీర్  గార్లకు ఘనంగా సన్మానం మైనారిటీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ మజీద్ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతాపార్టీ నల్గొండ జిల్లా కార్యాలయంలో మైనారిటీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ లో  ఎన్నుకోబడిన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి    షేక్ బాబా కు,  రాష్ట్ర మైనారిటీ మోర్చా  సోషల్ మీడియా కన్వీనర్  సయ్యద్ పాష మరియు మైనారిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బషీర్  గార్లకు ఘనంగా సన్మానించారు . . ఈ భాద్యతలు   కల్పించిన  బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరియు రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు అప్సర్ భాషా గార్లకు  జిల్లా అధ్యక్షులు  కంకణాల శ్రీధర్ రెడ్డి కి మరియు ఇతర సీనియర్ నాయకులకు  కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా యువ మోర్చా  అధ్యక్షులు సిద్దు ప్రధాన కార్యదర్శి  సయ్యద్ ,అబ్రహం  ఉపాధ్యక్షులు జావిద్  ,కార్యదర్శి యూసుఫ్ , అజీజ్ బిజెపి నాయకులు మర...

టూ టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన చంద్ర శేఖర్ రెడ్డి

Image
  *టూ టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన చంద్ర శేఖర్ రెడ్డి* - - సిసిఎస్ నుండి టూ టౌన్ సీఐగా బదిలీ నల్లగొండ : పట్టణ టూ టౌన్ సీఐగా చంద్ర శేఖర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. 199 బ్యాచ్ కు చెందిన నల్లగొండ సిసిఎస్ సీఐగా విధులు నిర్వహిస్తున్న ఆయనను నల్లగొండ టూ టౌన్ కు బదిలీ చేయగా ఆయన శనివారం సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో డిండి సీఐగా పని చేసిన ఆయన అంతకు ముందు నారాయణపేటలో, అంతకు ముందు నిజామాబాద్ ఏ.సి.బి. సీఐగా విధులు నిర్వహించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో కేంద్ర ప్రభుత్వ 3446 ఉద్యోగాలు.

Image
  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో కేంద్ర ప్రభుత్వ 3446 ఉద్యోగాలు. అర్హత పదవ తరగతి పోస్టల్ ఉద్యోగాలు .తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్  విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో మొత్తం 3446 ఖాళీలు ఉండగా.. అందులో ఏపీలో 2296, తెలంగాణలో 1150 ఉన్నాయి. ఇందులో బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్,  అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్,  డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు.. పదో తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు మాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలో మంచి మార్కులు సాధించాలి. వయస్సు జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. SC/ST అభ్యర్థులకు ఐదేళ్లు, OBC అభ్యర్థులకు మూడేళ్లు, PWD అభ్యర్థులకు పదేళ్లు వయో సడలింపు ఇచ్చారు. ఇతర వివరాలు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్థానిక భాషలో మాట్లాడడం, రాయడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల విద్యార్హతలు, పదో తరగతిలో గణితం, ఆంగ్ల సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దర...

కేటీఆర్ ని క‌లిసిన తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల ‌.

Image
 ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్ ని క‌లిసిన తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త‌. తెలంగాణ రాష్ట్ర వ‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త‌.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ని  క‌లిశారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు వెళ్లిన ఆయ‌న కేటీఆర్‌కు పుష్ప‌గుచ్చం అంద‌జేశారు. తెలంగాణాలో ఆర్థికంగా వెనుక‌బడిన వ‌ర్గాల‌కు (ఈ.డ‌బ్ల్యూ.ఎన్) 10 శాతం ఇచ్చినందుకు కేటీఆర్ గారిని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన‌ట్లు ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త తెలిపారు. ఈ సంద‌ర్బంగా టూరిజం కార్పోరేష‌న్ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నందుకు కేటీఆర్‌ అభినందించిన‌ట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని జిల్లాలు తిరిగి మ‌రింత క‌ష్ట‌ప‌డాల‌ని ఆయ‌న చెప్పార‌న్నారు. సీఎం కేసీఆర్ గారి నాయ‌క‌త్వంలో రాష్ట్రం అభివృద్ధిలో మ‌రింత ముందుకు వెళుతుంద‌న్నారు.

నెల్లూరునగర శివారులో ప్రేమజంట ఆత్మహత్య

Image
  *నెల్లూరునగర శివారులో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా రూరల్‌ మండలానికి చెందిన హరీష్‌ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌గా, నాయుడుపేటకు చెందిన లావణ్య అదే సచివాలయంలో వీఆర్‌వోగా పనిచేస్తున్నారు. వీరుద్దరూ శుక్రవారం విధులకు హాజరుకాలేదు.*   *నెల్లూరు నగర శివారు ప్రాంతమైన నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఏ కారణమో స్పష్టంగా తెలియదు కాని ఇద్దరూ కలిసి ఓకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రయినా హరీష్‌, లావణ్య ఇంటికి రాకపోవడంతో ఇరువురు కుటుంబ సభ్యులు వీరి కోసం గాలింపు చర్యలుచేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులకు అర్ధరాత్రి దాటే వరకు ఎలాంటి సమాచారం అందేలేదు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు తెలియాల్సి ఉంది.*

ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో లేగదూడపై చిరుతపులి దాడి

 రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో లేగదూడపై చిరుతపులి దాడి జంగిటి రమేశ్ అనే రైతుకు చెందిన లేగదూడ,ఆందోళనలో గ్రామస్తులు

మితిమీరిన వేగం, మద్యం మత్తులో మరో...

  మితిమీరిన వేగం, మద్యం మత్తులో మరో • మితిమీరిన వేగం, మద్యం మత్తులో మరో రోడ్డు ప్రమాదం. ఐదుగురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు.  • రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ORR పై స్తంబానికి ఢీకొన్న  TS 12EK 0298 నెంబర్ గల షిఫ్ట్ కారు.  • కారు లో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. వారి పరిస్థితి విషమం.  • కారు లొ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో తప్పి పెను ప్రమాదం.  • గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం.  • క్షతగాత్రులు అంతా హైదరాబాద్ లోని టౌలి చౌకి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తింపు.