*మాస్క్ మస్ట్*
*మాస్కు ధరించకపోతే నేరుగా కోర్టుకే : సిఐ నిగిడాల సురేష్* - - శుక్రవారం నుండి మరింత కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు - - కరోనా కట్టడికి మాస్కు తప్పక ధరించాలని అవగాహన - - కరోనా వ్యాప్తి నియంత్రణకు అందరూ సహకరించాలి నల్లగొండ : ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించలేదా.... ఇక మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అంటున్నారు నల్లగొండ జిల్లా పోలీసులు...... *మాస్క్ మస్ట్* అంటున్న జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ఆదేశాల మేరకు మాస్కు ధరించకపోతే ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేసి కోర్టుకు పంపిస్తామంటున్నారు నల్లగొండ వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్. ఈ మేరకు గురువారం నల్లగొండ వన్ టౌన్ పరిధిలో వాహనదారులకు మాస్కు ధరించాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న పలువురికి మాస్కులు అందజేశారు. కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో దానిని అరికట్టడం లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్కు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి జరిమనలతో పాటు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని హెచ్చరించారు సిఐ సురేష్.... శుక్రవారం నుండి మాస్కులు ధరించే విషయంల