Posts
పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని పరిశీలించి సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్
- Get link
- X
- Other Apps
రేపు జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో భాగంగా గేమ్యానాయక్ తండా, ఉట్లపల్లి గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని పరిశీలించి సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ *ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పటిష్ట బందోబస్తు : డిఐజి రంగనాధ్* - - 4,000 పైగా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు - - సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతకు ప్రత్యేక చర్యలు - - పారామిలటరీ బలగాల పహారాలో ఈవీఎంల తరలింపు నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పటిష్ట నిర్వహణ కోసం భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాలను సైతం పరిశీలించి పలు సూచనలు చేయడం జరిగిందని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో 108 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కనీసం 15 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పోలింగ్ సరళిపై వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు భద్రతతో పాటు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా నిమిషాల వ్యవధి...
గాంధీ ఆస్పత్రి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రి
- Get link
- X
- Other Apps
Breaking గాంధీ ఆస్పత్రి ని రేపటి నుంచి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఆదేశాలు జారీ చేసిన ఆరోగ్య శాఖ. శనివారం నుంచి OP ని నిలిపివేయాలని... ఆదేశం ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్ కేసులు మాత్రమే ట్రీట్మెంట్... ఇప్పటికే 450కి పైగా పేషెంట్స్ ఉన్నారు.. నిన్న ఒక్కరోజే 150మంది అడ్మిట్ అయ్యారు... 10నిమిషాలకు ఒక పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు.. IP బ్లాక్ మొత్తం ఇప్పటికే కోవిడ్ పేషెంట్స్ తో నిండిపోయింది... రెపటినుంచి ఎమర్జెన్సీ సర్వీస్ లు కూడా ఆపేసి... కేవలం కోవిడ్ హాస్పిటల్ గా మారనుంది...
హైకోర్టు ను ఆశ్రయించిన కాంగ్రెస్ నేత మానవత రాయ్
- Get link
- X
- Other Apps
*టీఎస్ హైకోర్టు......* హైకోర్టు ను ఆశ్రయించిన కాంగ్రెస్ నేత మానవత రాయ్... తనను అక్రమంగా అరెస్ట్ చేసి దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని హైకోర్టు ను కోరిన మమవత రాయ్, ఎలాంటి నోటీస్ లు లేకుండా అరెస్ట్ చేసి, తనపై దాడి చేశారని తన పిటిషన్ లో పేర్కొన్నా మానవత రాయ్, అక్రమ అరెస్ట్ తో 24 గంటలపాటు తనను నిర్బంధించారని,25 లక్షల నష్టపరిహారం చెల్లించేలా పోలీస్ డిపార్ట్మెంట్ ను ఆదేశించాలని కోరిన మానవత రాయ్.. తనపై దాడి చేసిన పోలీస్ అధికారిపై కేసు నమోదు చేయాలని కోరిన మానవత రాయ్ తన కేసులో డీజీపీ, మిర్యాలగూడ, నల్గొండ ఎస్పీలను, బాషా టాస్క్ ఫోర్స్, నాగార్జున సాగర్ సీఐ లను ప్రతివాదులుగా చేర్చిన మమవత రాయ్.
ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్
- Get link
- X
- Other Apps
ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్ 95 శాతం మంది ఇంటి నుంచే చికిత్స పొందుతున్నారు 47 వేల పడకల్లో సగానికి పైగా కరోనా పేషెంట్లకు కేటాయించాం సీరియస్ కేసులను ప్రైవేట్ ఆసుపత్రులు గాంధీ హాస్పిటల్ కు పంపుతున్నాయి సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో 20 శాతం మంది పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరారని... సెకండ్ వేవ్ లో 95 శాతం మంది ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47 వేల పడకల్లో సగానికి పైగా కోవిడ్ పేషెంట్లకే వాడుతున్నామని తెలిపారు. సీరియస్ కేసులు వస్తే ప్రైవేట్ ఆసుపత్రులు గాంధీ ఆసుపత్రికి పంపుతున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ధర్నాలు చేయవద్దని కోరారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈటల ఈరోజు గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి ఆసుపత్రులను సందర్శించారు. ఆసుపత్రుల్లో ఉన్న ఏర్పాట్లు, ఔషధాల లభ్యత, ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జిల్లాల వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉన...