Posts

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన సందర్భంగా పండ్ల పంపిణీ

Image
 రాష్ట్ర బీజేపీ  అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన సందర్భంగా  పండ్ల పంపిణీ నల్గొండ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన సందర్భంగా ఈ రోజు నల్లగొండ జిల్లా మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రాష్ట్ర మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ పాషా ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేసిన జిల్లా మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్రార, జిల్లా కార్యదర్శి అజీజ్ మరియు రెహమాన్, షరీఫ్ ఇతర నాయకు పాల్గొన్నారు

పేదల సొంతింటి కల సాకారం చేసిన వైయస్ జగన్ ప్రభుత్వం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

Image
  పేదల సొంతింటి కల సాకారం చేసిన వైయస్ జగన్ ప్రభుత్వం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  *జగనన్న లేఅవుట్ లలో సకల సౌకర్యాలు ,వసతుల ఏర్పాట్లు ..* *మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళాలో భాగంగా టీడ్కో లే అవుట్ లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా"జగన్ మోహన్ రావు  నందిగామ : నందిగామ పట్టణంలోని హనుమంతుపాలెం టీడ్కో లే అవుట్ లోని వైయస్సార్ జగనన్న కాలనీలో మెగా గ్రౌండ్ హౌసింగ్ మేళాలో భాగంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలకు శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  శనివారం సామూహిక శంకుస్థాపనలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా"జగన్ మోహన్ రావు  మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో సకల సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నామన్నారు ,గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన కూడా చేయని నిరుపేదల సొంతింటి కలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారని తెలిపారు , అదేవిధంగా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు ,గత ప్రభుత్వ హయాంలో ఒక్క నిరుపేద క...

*ABVP ఆధ్వర్యంలో పరిషత్ పాఠశాల*

Image
 *ABVP ఆధ్వర్యంలో పరిషత్ పాఠశాల* నేడు నల్గొండ నగరంలోని స్థానిక బోయవాడ లో గల ఏచూరి శ్రీనివాస్ స్మారక భవనం ఏబీవీపీ కార్యాలయంలో  కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో నిరుపేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల వద్దకే విద్య వెళ్లాలి అనే ఉద్దేశంతో పరిషత్ పాఠశాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీవీపీ ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ లో భాగంగా కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి పేదరికం వల్ల ఆన్లైన్ క్లాసులు వినలేక తీవ్ర ఇబ్బందులు పడుతు విద్యకు దూరం అవుతున్న విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు గ్రామ గ్రామాన,వాడల్లో, బస్తీల్లో,కాలనీల్లో *పరిషత్ పాఠశాల* అనే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల సంపత్ కుమార్, ఎన్జి కళాశాల ఉపాధ్యక్షుడు భానోత్ నాగేందర్, బాలాజీ, ప్రవీణ్,రమేష్ బాల్థాక్రే, నరేష్, పాల్గొన్నారు.

బిజెపి... బిజినెస్ జనతా పార్టీగా మారి ప్రజల రక్తం తాగుతుంది-డా. దాసోజు శ్రవణ్

Image
 బిజెపి... బిజినెస్ జనతా పార్టీగా మారి ప్రజల రక్తం తాగుతుంది-డా. దాసోజు శ్రవణ్ వ్యాపారాన్ని పక్కన పెట్టి కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోండి : హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలోనూ మోడీ సర్కార్ పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నదని, వ్యాపారాన్ని పక్కన పెట్టి కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు .   ఏఐసీసీ ఆదేశాల మేరకు, పెరిగిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో బాగంగా ''ప్రజల చెవిలో పువ్వుపెట్టిన ప్రధాని'' అంటూ మోడీ మాస్కులు ధరించి చెవిలో పువ్వులు పెడుతూ వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్తమాంసన్ని జలగల్లా పిల్చేసే రీతిలో మోడీ పాలన ఉందని, ప్రజలని లూటీ చేయడమే మోడీ సర్కార్ అజెండాయని ఆయన విమర్శించారు. క్రూడాయిల్ ధర తగ్గుతుంటే సేల్స్ ట్యాక్స్ పెంచేస్తున్నారు. ఎలాగైనా ప్రజలని దోచుకోవాలనేదే మోడీ సర్కార్  ప్లాన్ గా ఉందని అన్నారు....

ఎబివిపి ఫర్ సొసైటీ పేరుతో ఏబీవీపీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం- నల్గొండ డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి

Image
 ఎబివిపి ఫర్ సొసైటీ పేరుతో ఏబీవీపీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం- నల్గొండ డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి   నల్గొండ :  నగరంలోని స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు  ఏబీవీపీ ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్  రెండవ రోజులో భాగంగా  200 మందికి భోజన వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి నల్గొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి  కార్యక్రమాన్ని ప్రారంభించి ఏబీవీపీ ఫర్ సొసైటీ పేరుతో ఏబీవీపీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, యువత ఇలాగే పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా ఏబీవీపీ నల్గొండ జిల్లా ప్రముఖ్ కత్తుల ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ ఏబీవీపీ ఫర్ సొసైటీ అనే పేరుతో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జూన్ 10వ తేదీ నుండి 15 తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలు పేదలకు భోజన వితరణ,కరోనా పై అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటడం,మాస్కులు పంపిణీ , వాడల్లో శానిటేషన్ చేయడం, అలాగే కరోనా కారణంగా పాఠశాలలకు దూరమైన పేద విద్యా...

ఎబివిపి నల్గొండ విభాగ్ ఆధ్వర్యంలో ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్

Image
 ఎబివిపి  నల్గొండ విభాగ్ ఆధ్వర్యంలో ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్   అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో జూన్ 10 నుండి 15 వ తేదీ వరకు ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు అండగా నిలిచేందుకు విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసి ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూన్ 10 నుండి 15 వరకు ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ పేరుతో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల నుండి మారుమూల గ్రామాలు, గిరిజన తండాల వరకు పెద్ద ఎత్తున 150 స్థలాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నమని తెలిపారు.  వ్యాక్సినేషన్ ప్రక్రియ మీద ఉన్న అపోహలను తొలగించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునే విధంగా అవగాహన కల్పించడం, కరోనా మహమ్మారి వల్ల ప్రాణా...

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి

Image
  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి   నల్గొండ : కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి  సందర్శించారు. ఈ సందర్బగంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని రెండు మాసాలు పూర్తయినప్పటికీ కూడా ప్రభుత్వం ,మరియు అధికారుల నిర్లక్ష్యం వలన మరియు ముందుచూపు లేని కారణంగా  కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దై మొలకలేత్తినవని, రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడంలో విసిగివేసారిపోతున్నారని,   వెంటనే చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుందని తెలిపారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఐకేపీ కేంద్రాల్లో నిల్వఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులు విక్రయించిన వరి ధాన్యానికి వెంటనే డబ్బులను వారి ఖాతాల్లో జమచేయాలని. అధికారులు  లారీలకొరత లేకుండా చూడాలని మరియు మిల్లుల వద్ద  ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయాలని తాలు పేరుతో ...