Posts

నల్గొండ ప్రభుత్వ హాస్పటల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి - బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయిత రాజు సిద్దు

Image
  నల్గొండ ప్రభుత్వ హాస్పటల్లో  సమస్యలు వెంటనే పరిష్కరించాలి -  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయిత రాజు సిద్దు నల్గొండ : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి బీజేవైఎం ఆధ్వర్యంలో సందర్శించి సమస్యలు  పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయిత రాజు సిద్దు  మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో నల్లగొండలోని ప్రైవేట్ హాస్పిటల్ లో అధిక ఫీజుల దోపిడీ కి పాలు పడుతూ ఉంటే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం అరకొర సౌకర్యాలతో పేద మధ్యతరగతి ప్రజలకు అనేక సమస్యల తో స్వాగతం పలుకుతున్నదిని ఆయన అన్నారు.  ప్రభుత్వ హాస్పిటల్  సిబ్బంది  ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని  ప్రభుత్వ హాస్పిటల్ ను పట్టించుకోవడం లేదని,   ఎన్ని సమస్యలు ఉన్న ప్రభుత్వ అధికారులు  పట్టించుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ సమస్యల పైన జిల్లా అధికారులు పట్టించుకోకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో లో బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్...

బిసీ క‌మిష‌న్‌లో మైనార్టీలకు చోటేది? : సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డ ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌

Image
  బిసీ క‌మిష‌న్‌లో మైనార్టీలకు చోటేది? : సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డ ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌. ముస్లిం మైనార్టీలు బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీల‌కే  ప‌నికోస్తారా ? గ‌త ఏడేళ్లుగా మోస‌పోతున్న ముస్లిం మైనార్టీల‌కు మ‌రోసారి దొక ఇచ్చిన సీఎం కేసీఆర్‌ హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 24:  బిసీ క‌మిష‌న్‌లో ముస్లిం మైనార్టీల‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌.  తెరాస స‌ర్కార్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి మైనార్టీల‌కు స‌ముచిత స్థానం వ‌స్తుంద‌ని ఆశించిన మైనార్టీల‌కు మ‌రోసారి అన్యాయం చేశార‌ని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్‌ని న‌మ్ముకున్న వారికి దోకా మీద దోకా ఇస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీన్ని ప్ర‌తి ఒక్క ముస్లిం సోద‌రి, సోద‌రీమ‌ణులు ఆలోచించాల్సిన విష‌య‌మ‌న్నారు.  " 240 జీవో జారీ చేస్తూ... బిసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా తెరాస నాయ‌కులు వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్, స‌భ్యులుగా ఉపేంద్ర‌, శుభ‌ప్ర‌ద్ ప‌టేల్‌, కిషోర్‌గౌడ్‌ల‌ను నియ‌మించారు. ఇప్ప‌టికైన పున‌రుద్ద‌రించినందుకు స్వాగ‌తిస్తున్నాం. అయితే బిసి క‌మిష‌న్‌లో మై...

తెలంగాణ తాలిబన్లలాగా మారిన టీఆర్ఎస్

Image
తెలంగాణ తాలిబన్లలాగా మారిన టీఆర్ఎస్ అప్గానిస్తాన్ని తాలిబన్లు నాశనం చేసినట్టు, కేసీఆర్ సేన తెలంగాణను  చేరబట్టింది - ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రవణ్h 👉  సీఎం కేసీఆర్ తాలిబన్ల‌ మాదిరిగా ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారు :ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు 👉 కేసీఆర్ దళిత బంధుతో మోసం చేస్తున్నారు, హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత దళిత బంధు ఉండదు.  👉 హుజురాబాద్‌లో ప్రభుత్వ సమావేశమా.. పార్టీ సమావేశమా..? ప్రభుత్వ సమావేశం అయితే,పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎందుకు ఉన్నారు? 👉 సీఎస్ సోమేశ్ కుమార్ చిల్లరగా వ్యవహరిస్తున్నారు  👉 7 ఏళ్లలో సీఎంగా కేసీఆర్ ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయలేదు. 👉  మొట్టమొదటి సారిగా ఏడేళ్లలో ప్రగతి భవన్ లోకి దళిత ఐఏఎస్ కు అడుగుపెడుతున్నారు. ఏడేళ్లలో దళితులకు లక్షా 25 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా చేయలేదు. ఏడేళ్లలో దళితులకు వాటాగా రావాల్సిన నిధులలో 65 శాతం పక్కదారి పట్టించారు. హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్గానిస్తాన్ తాలిబన్లాగా మారారని మండిపడ్డా...

నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా భూపతి రాజు

Image
 నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా  భూపతి రాజు నల్గొండ : నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి గా నల్గొండ పట్టణాన వాసి సీనియర్ కార్యకర్త    భూపతి రాజును బీజేపీ జిల్లా అధ్యక్షులు  కంకణాల శ్రీధర్ రెడ్డి నియమించారు. పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి పార్టీ అభివృద్ధి కి  తోడ్పడాలని ఆయన కోరారు. తన ను  నియమించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి గారికి మరియు  నియమానికి సహకరించిన నాయకులకు  భూపతి రాజు కృతజ్ఞతలు తెలుపుతు,  పార్టీ నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని  అన్నారు.  

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన సందర్భంగా పండ్ల పంపిణీ

Image
 రాష్ట్ర బీజేపీ  అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన సందర్భంగా  పండ్ల పంపిణీ నల్గొండ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన సందర్భంగా ఈ రోజు నల్లగొండ జిల్లా మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రాష్ట్ర మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ పాషా ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేసిన జిల్లా మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్రార, జిల్లా కార్యదర్శి అజీజ్ మరియు రెహమాన్, షరీఫ్ ఇతర నాయకు పాల్గొన్నారు

పేదల సొంతింటి కల సాకారం చేసిన వైయస్ జగన్ ప్రభుత్వం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

Image
  పేదల సొంతింటి కల సాకారం చేసిన వైయస్ జగన్ ప్రభుత్వం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  *జగనన్న లేఅవుట్ లలో సకల సౌకర్యాలు ,వసతుల ఏర్పాట్లు ..* *మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళాలో భాగంగా టీడ్కో లే అవుట్ లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా"జగన్ మోహన్ రావు  నందిగామ : నందిగామ పట్టణంలోని హనుమంతుపాలెం టీడ్కో లే అవుట్ లోని వైయస్సార్ జగనన్న కాలనీలో మెగా గ్రౌండ్ హౌసింగ్ మేళాలో భాగంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలకు శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  శనివారం సామూహిక శంకుస్థాపనలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా"జగన్ మోహన్ రావు  మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో సకల సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నామన్నారు ,గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన కూడా చేయని నిరుపేదల సొంతింటి కలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారని తెలిపారు , అదేవిధంగా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు ,గత ప్రభుత్వ హయాంలో ఒక్క నిరుపేద క...

*ABVP ఆధ్వర్యంలో పరిషత్ పాఠశాల*

Image
 *ABVP ఆధ్వర్యంలో పరిషత్ పాఠశాల* నేడు నల్గొండ నగరంలోని స్థానిక బోయవాడ లో గల ఏచూరి శ్రీనివాస్ స్మారక భవనం ఏబీవీపీ కార్యాలయంలో  కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో నిరుపేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల వద్దకే విద్య వెళ్లాలి అనే ఉద్దేశంతో పరిషత్ పాఠశాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీవీపీ ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ లో భాగంగా కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి పేదరికం వల్ల ఆన్లైన్ క్లాసులు వినలేక తీవ్ర ఇబ్బందులు పడుతు విద్యకు దూరం అవుతున్న విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు గ్రామ గ్రామాన,వాడల్లో, బస్తీల్లో,కాలనీల్లో *పరిషత్ పాఠశాల* అనే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల సంపత్ కుమార్, ఎన్జి కళాశాల ఉపాధ్యక్షుడు భానోత్ నాగేందర్, బాలాజీ, ప్రవీణ్,రమేష్ బాల్థాక్రే, నరేష్, పాల్గొన్నారు.