బిసీ కమిషన్‌లో మైనార్టీలకు చోటేది? : సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్‌కుమార్. ముస్లిం మైనార్టీలు బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీలకే పనికోస్తారా ? గత ఏడేళ్లుగా మోసపోతున్న ముస్లిం మైనార్టీలకు మరోసారి దొక ఇచ్చిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 24: బిసీ కమిషన్‌లో ముస్లిం మైనార్టీలకు చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్‌కుమార్. తెరాస సర్కార్ వచ్చినప్పటి నుండి మైనార్టీలకు సముచిత స్థానం వస్తుందని ఆశించిన మైనార్టీలకు మరోసారి అన్యాయం చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ని నమ్ముకున్న వారికి దోకా మీద దోకా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరి, సోదరీమణులు ఆలోచించాల్సిన విషయమన్నారు. " 240 జీవో జారీ చేస్తూ... బిసీ కమిషన్ ఛైర్మన్‌గా తెరాస నాయకులు వకుళాభరణం కృష్ణమోహన్, సభ్యులుగా ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిషోర్‌గౌడ్‌లను నియమించారు. ఇప్పటికైన పునరుద్దరించినందుకు స్వాగతిస్తున్నాం. అయితే బిసి కమిషన్‌లో మై...