ఎంపీ అరవింద్ పై దాడిని ఖండించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
ఎంపీ అరవింద్ పై దాడిని ఖండించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ : నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై టిఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా కండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టిఆర్ఎస్ గుండాలు, కార్యకర్తలు, పోలీసు కలిసి చేసిన దాడి లా భావిస్తున్నామని అన్నారు. నువ్వు అసలు గుండా వా, ముఖ్యమంత్రి వా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. అరివింద్ ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వెళ్తున్నాడు, నీ ఫామ్ హౌస్ కి రావట్లేదని, బిజెవైఎం కార్యకర్త పై కత్తులతో దాడి చేశారని, ఘటన కు సంబంధించి చెప్పడానికి సిపి కి కాల్ చేస్తే స్పందన లేదని, సిపి కార్యాలయంలో ఒక్కరు లేరని, డిజిపి ఎవరు ఫోన్ చేసిన ఎత్తడంలేదని, డిజిపి కి తెలిసే జిల్లాలలో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత గోరం మా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాడని , ఈ విషయాన్ని కేంద్ర నాయకత్వాని...