Posts

*వైశ్య అభ్యర్థులకు ఎస్ఐ & కానిస్టేబుల్ కొరకు ఉచిత శిక్షణ*

Image
 *వైశ్య అభ్యర్థులకు ఎస్ఐ & కానిస్టేబుల్ కొరకు ఉచిత శిక్షణ* హైదరాబాద్:  తెలంగాణ వైశ్య గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TVGOA) ఆధ్వర్యంలో YRP  ట్రస్ట్ చైర్మన్ .ఏలిశాల రవిప్రసాద్ గుప్త  సౌజన్యంతో,  ఎస్ఐ & కానిస్టేబుల్ కొరకు అభ్యర్థులకు (పురుషులు & స్రీలు) ఉచిత శిక్షణ మరియు వసతితో  కోచింగ్ ఇవ్వాలనే సత్ సంకల్పంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని నిర్వహికులు తెలిపారు. ఆర్యవైశ్య యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు వెంటనే అందరూ  తెలియజేయాలని కోరారు..  స్క్రీనింగ్ పరీక్షలో పాల్గొనడానికి 5th June, 2022 లోగా  www.vysyaseva.org/policetest  అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకొవచ్చని వారు తెలిపారు. అందరూ  ప్రతి వైశ్య విద్యార్థికి తెలిపి సహాయపడే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నామని,  స్క్రీనింగ్ పరీక్ష  మంగళవారం 7th June, 2022 హైదరాబాద్అ నందు జరుపబడునని ఆభ్యర్థులకు మరింత సమాచారం కోసం TVGOA No.9493405678 నందు సంప్రదించవచ్చని తెలిపారు.

ఎంపీ అరవింద్ పై దాడిని ఖండించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Image
 ఎంపీ అరవింద్ పై దాడిని  ఖండించిన  తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  నల్గొండ : నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై టిఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా కండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.   నల్గొండ జిల్లా బీజేపీ కార్యలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టిఆర్ఎస్ గుండాలు, కార్యకర్తలు, పోలీసు కలిసి చేసిన దాడి లా భావిస్తున్నామని అన్నారు. నువ్వు అసలు గుండా వా, ముఖ్యమంత్రి వా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. అరివింద్ ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వెళ్తున్నాడు, నీ ఫామ్ హౌస్ కి రావట్లేదని, బిజెవైఎం కార్యకర్త పై కత్తులతో దాడి చేశారని, ఘటన కు సంబంధించి చెప్పడానికి సిపి కి కాల్ చేస్తే స్పందన లేదని, సిపి కార్యాలయంలో ఒక్కరు లేరని, డిజిపి ఎవరు ఫోన్ చేసిన ఎత్తడంలేదని, డిజిపి కి తెలిసే జిల్లాలలో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.  తెలంగాణ రాష్ట్రంలో ఇంత గోరం మా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాడని , ఈ విషయాన్ని కేంద్ర నాయకత్వానికి తెలియచేశామని, సీఎం తన ప్రవర్తన

TUWJకు కృతజ్ఞతలు తెలిపిన చిన్న పత్రికల సంఘం

Image
  TUWJకు కృతజ్ఞతలు తెలిపిన చిన్న పత్రికల సంఘం హైదరాబాద్ : తమకు అండగా నిలిచి ప్రభుత్వ ప్రకటనలు జారీ అయ్యేంతవరకు పోరాడిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె-ఐజేయూ) మేలును మరిచిపోలేమని తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణలు స్పష్టం చేశారు. బుధవారం నాడు అసోసియేషన్ ప్రతినిధి బృందం టీయుడబ్ల్యుజె కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీని కలుసుకొని కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ భవిష్యత్తులో చిన్న, మధ్యతరగతి పత్రికలకు, మేగజైన్లకు ఎలాంటి ఆపద వచ్చినా తమ సంఘం ముందుండి పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఇంకా ఈ సమావేశంలో చిన్న పత్రికల అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షులు దయానంద్, కోశాధికారి ఆజం ఖాన్, రాష్ట్ర నాయకులు రాజిరెడ్డి, మాధవరెడ్డి, షాహెద్ తదితరులు పాల్గొన్నారు.

317 జీవోతో జాయిన్ కు వెళ్లి మృతిచెందిన మురళీధర్ అంత్యక్రియలలో ఎమ్మెల్యే రఘునందన్ రావు

Image
   317 జీవోతో జాయిన్ కు  వెళ్లి మృతిచెందిన మురళీధర్ అంత్యక్రియలలో  ఎమ్మెల్యే రఘునందన్ రావు నల్గొండ: 317 జీవో తో హుజుర్ నగర్ ZPHS camp స్కూల్ లో  గురువారం రోజు జాయిన్ అవడానికి వెళ్లిన  రికార్డ్ అసిస్టెంట్ నాగిళ్ళ మురళీధర్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారని ఆయనకు  బీజేపీ  తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున  ఏం.రఘునందన్ రావు ఏం.ఎల్.ఏ. గారు జిల్లా అధ్యక్షుడు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి  ఆయనకు  శ్రద్ధాంజలి  గటిస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడానికి ఈరోజు ఉదయం వారి అంతిమ యాత్రలో పాల్గొంటున్నారని ఒక ప్రకటనలో జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి తెలిపారు. చనిపోయిన మురళీధర్ స్వస్థలం నర్సింగ్ బట్ల  గ్రామానికి ఈరోజు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారని ఆయన తెలిపారు.  

317 జీవోతో జాయిన్ అవడానికి హుజుర్నగర్ వెళ్లి మృతిచెందిన మురళీధర్ అంత్యక్రియలలో పాల్గొననున్న ఎమ్మెల్యే రఘునందంరావు

Image
 317 జీవోతో జాయిన్ అవడానికి హుజుర్నగర్  వెళ్లి మృతిచెందిన మురళీధర్ అంత్యక్రియలలో పాల్గొననున్న  ఎమ్మెల్యే రఘునందంరావు నల్గొండ: 317 జీవో తో హుజుర్ నగర్ ZPHS camp స్కూల్ లో  గురువారం రోజు జాయిన్ అవడానికి వెళ్లిన  రికార్డ్ అసిస్టెంట్ నాగిళ్ళ మురళీధర్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారని ఆయనకు  బీజేపీ  తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున  ఏం.రఘునందన్ రావు ఏం.ఎల్.ఏ. గారు జిల్లా అధ్యక్షుడు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి  ఆయనకు  శ్రద్ధాంజలి  గటిస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడానికి ఈరోజు ఉదయం వారి అంతిమ యాత్రలో పాల్గొంటున్నారని ఒక ప్రకటనలో జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి తెలిపారు. చనిపోయిన మురళీధర్ స్వస్థలం నర్సింగ్ బట్ల  గ్రామానికి ఈరోజు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారని ఆయన తెలిపారు.  

జియాగూడలో శైవల మత ఆచారాలతో మేకల, గొర్రెల వధ శాలను ఏర్పాటు చేయలి- ధర్మ వేద కటిక్ ట్రస్టీ ప్రముఖ న్యాయవాది కే.ఎన్. సాయి కుమార్ డిమాండ్.

Image
 జియాగూడలో  శైవల మత ఆచారాలతో మేకల, గొర్రెల వధ శాలను ఏర్పాటు చేయలి- ధర్మ వేద కటిక్ ట్రస్టీ ప్రముఖ న్యాయవాది కే.ఎన్. సాయి కుమార్ డిమాండ్. హైదరాబాద్: జియాగూడలో  శైవల మత ఆచారాలతో మేకల, గొర్రెల వధ శాలను ఏర్పాటు చేయలని  ధర్మ వేద కటిక్ ట్రస్టీ ప్రముఖ న్యాయవాది కే.ఎన్. సాయి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఆయన మా ప్రతినిధి తో మాట్లాడుతూ  జియా గూడలో గల ఆసియాలో కెల్ల పెద్ద  మేకల, గొర్రెల  వధశాల వద్ద ప్రత్యేకంగా శైవల మత ఆచారాలతో  వధించుట కోరకు వధశాలను  ఏర్పాటు చేయలని ప్రభుత్వాన్ని కోరామని, హైకోర్టులో కూడా కేసు వేశామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. హలాల్ చేసిన మాంసాన్ని అల్లాకకు అర్పిస్తారని ఆ మాంసాన్ని ఇతర దేవతలకు అర్పిస్తే ఎంగిలు మాంసాన్ని అర్పించినట్లు అవుతుందని అందుకే శైవల మాత ఆచారము ప్రకారము మేకలను, గొర్రెలను వధించుటకొఱకు ప్రత్యేక వధ శాలను ఏర్పాటుచేయాలని కోరుతున్నామని తెలిపారు.

చర్లపల్లి 16 వ వార్డులో జాతీయ జెండా ఆవిష్కరణ

Image
  చర్లపల్లి 16 వ వార్డులో జాతీయ జెండా ఆవిష్కరణ నల్గొండ: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చర్లపల్లి 16 వ వార్డులో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో లో బిజెపి రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ జిల్లా నాయకులు రాపోలు విద్యాసాగర్ బద్దం నగేష్ రాపోలు భాస్కర్ గోని సుధాకర్ నాగేశ్వరరావు సుంకరబోయిన శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు