*వైశ్య అభ్యర్థులకు ఎస్ఐ & కానిస్టేబుల్ కొరకు ఉచిత శిక్షణ*
*వైశ్య అభ్యర్థులకు ఎస్ఐ & కానిస్టేబుల్ కొరకు ఉచిత శిక్షణ* హైదరాబాద్: తెలంగాణ వైశ్య గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TVGOA) ఆధ్వర్యంలో YRP ట్రస్ట్ చైర్మన్ .ఏలిశాల రవిప్రసాద్ గుప్త సౌజన్యంతో, ఎస్ఐ & కానిస్టేబుల్ కొరకు అభ్యర్థులకు (పురుషులు & స్రీలు) ఉచిత శిక్షణ మరియు వసతితో కోచింగ్ ఇవ్వాలనే సత్ సంకల్పంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని నిర్వహికులు తెలిపారు. ఆర్యవైశ్య యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు వెంటనే అందరూ తెలియజేయాలని కోరారు.. స్క్రీనింగ్ పరీక్షలో పాల్గొనడానికి 5th June, 2022 లోగా www.vysyaseva.org/policetest అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకొవచ్చని వారు తెలిపారు. అందరూ ప్రతి వైశ్య విద్యార్థికి తెలిపి సహాయపడే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నామని, స్క్రీనింగ్ పరీక్ష మంగళవారం 7th June, 2022 హైదరాబాద్అ నందు జరుపబడునని ఆభ్యర్థులకు మరింత సమాచారం కోసం TVGOA No.9493405678 నందు సంప్రదించవచ్చని తెలిపారు.