Posts

భూపతి టైమ్స్ దిన పత్రిక నవంబర్, 22, 2022 8 పేజీలు లింక్ టచ్ చేసి చదవండి

Image

భూపతి టైమ్స్ దిన పత్రిక 2022, నవంబర్, 22

Image
 

*అక్రమంగా భూములు కబ్జా చేసిన శాగం ఈశ్వరమ్మ పై విచారణ చేసి ఆర్ ఓ ఆర్ బుక్కులను వెంటనే రద్దు చేయాలి*

Image
*అక్రమంగా భూములు కబ్జా చేసిన శాగం ఈశ్వరమ్మ పై విచారణ చేసి ఆర్ ఓ ఆర్ బుక్కులను వెంటనే రద్దు చేయాలి* *నల్లగొండ : (గూఢచారి ప్రతినిధి) కలెక్టరేట్ గ్రీవెన్స్ లో ఈశ్వరమ్మ బాధిత రైతులు జెసి గారికి విన్నపం* నల్గొండ;21-11-2022; పెద్దవూర మండలం చలకుర్తి శివారులో గిరిజన పేద రైతుల భూములను అక్రమంగా కబ్జా చేసుకుని ఆరో ఆరులో పాస్ బుక్కులు తీసుకున్న ఈశ్వరమ్మ పై ప్రత్యేక విచారణ జరిపించి ఆరో వార్ పాస్బుక్కులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్ నాయక్, కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి sk బషీర్ లు అన్నారు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ గ్రీవెన్స్ డే లో ఈశ్వరమ్మ బాధిత రైతులతో కలిసి జేసి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 ఎకరాలు ఉన్న శాగం ఈశ్వరమ్మకు 42ఎకరాలకు ROR లో భూమి పట్టాలు ఎలా వచ్చాయని ఆరో వారి పట్టా పాస్బుక్ లోకి సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియూ ROR లొ ఏకించుకున్న పట్టాలను వెంటనే రద్దు చేసి అర్హులైన పేద గిరిజన రైతులకు ఇవ్వాలి అని అన్నారు గత క...

*ప్రజావాణికి 60 ఫిర్యాదులు*

Image
 *ప్రజావాణికి 60 ఫిర్యాదులు*  నల్గొండ, నవంబర్ 21 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు  అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 60 ఫిర్యాదులు అందాయి. కాగా,  అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ,  సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం,నల్గొండ  సౌజన్యంతో

ఎల్ఐసిని నిర్వీర్యం చేసేందుకు మోడీ కుట్ర - ఎమ్మెల్యే కంచర్ల

Image
ఎల్ఐసిని నిర్వీర్యం చేసేందుకు మోడీ కుట్ర - ఎమ్మెల్యే కంచర్ల నల్గొండ : (గూఢచారి ప్రతినిధి) దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది పాలసీ హోల్డర్లు ఉన్న ఎల్ఐసి ని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నాడ ని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన ఎల్ఐసి ఏ ఓ ఐ  జిల్లా 5వ మహాసభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదాని, అంబానీలకు మేలు చేసే విధంగా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. సీఎం కేసీఆర్ ఎల్ఐసి ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతిష్టాత్మక రైతు బీమాను ఎల్ఐసి తో అనుసంధానం చేసి వారం రోజుల్లో మృతులకు డబ్బులు అందే విధంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడం మంచి పరిణామం అన్నారు. 43 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న అతిపెద్ద భీమా రంగ సంస్థను నిర్వీర్యం చేసి ప్రైవేటు భీమా రంగ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా కమిషన్లకు కక్కుర్తి పడి వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఎల్ఐసి ఏజెంట్ 1000 మందిని ప్రభావి...

ఆర్యవైశ్య మహసభ చౌటుప్పల్ మండల శాఖ ఆద్వర్యంలో కార్తీక వన బోజనాలు

Image
 ఆర్యవైశ్య మహసభ చౌటుప్పల్ మండల శాఖ ఆద్వర్యంలో కార్తీక వన బోజనాలు ఆర్యవైశ్య మహసభ చౌటుప్పల్ మండల శాఖ ఆద్వర్యంలో  మండల అద్యక్షులు కామిశెట్టి చంద్రశేకర్  అద్యక్షతన కార్తిక వనభోజన కార్యక్రమము నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరైన ఎమ్మెల్సి బొగ్గారపు దయానంద్ ఆర్యవైశ్య మహసభ యదాద్రి భువనగిరి జిల్లా అద్యక్షులు మల్లగారి శ్రీనివాస్  ,జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జుగం  సంతోశ్ కుమార్ ,కార్యనిర్వహక కార్యదర్శి చీకటిమళ్ల వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు

ఛాయా సోమేశ్వరాలయం లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

Image
ఛాయా సోమేశ్వరాలయం లో  ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి  పవిత్రమైన కార్తీక మాసం చివరి సోమవారం   నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయం లో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభం తో ఘనంగా స్వాగతం పలికారు.  ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్,పట్టణ పార్టీ అధికార ప్రతినిధి సంధినేని జనార్దన్ రావు, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస రెడ్డి,సర్పంచ్ పుల్లభట్ల ప్రవీణ్ కుమార్,పేర్ల కిరణ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.