Posts

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఉప్పల ఫౌండేషన్ చేయూత - ఒకేరోజు ఐదుగురు కుటుంబాలకు మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు అందజేత

Image
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఉప్పల ఫౌండేషన్ చేయూత  ఒకేరోజు ఐదుగురు కుటుంబాలకు మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు అందజేత   హైదరాబాద్ లోని నాగోల్ లో  ఉప్పల శ్రీనివాస్ గుప్త  నివాసానికి.. పలు జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన  కుటుంబాలు వారి కూతుర్ల వివాహం సందర్భంగా వచ్చి కలవడం తో  వారి కుటుంబ పరిస్థితి గమనించి, వారి ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని, ఆడబిడ్డల  వివాహం కోసం ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్   ఉప్పల శ్రీనివాస్ గుప్త  మరియు వారి సతీమణి, ఉప్పల ఫౌండేషన్ కో-చైర్ పర్సన్ ఉప్పల స్వప్న గార్ల చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు విరాళంగా ఇచ్చారు. ఉప్పుగూడ   ఆర్యవైశ్య  కమ్యూనిటీ చెందిన వైష్ణవి, ఉప్పల్ మేర కమ్యూనిటీ చెందిన రూప, దిల్ సుఖ్ నగర్ బ్రాహ్మణ కమ్యూనిటీ చెందిన శ్రీలేఖ, వరంగల్ కు చెందిన జ్యోతి, మహబూబ్ నగర్ SC కమ్యూనిటీ చెందిన ఝాన్సి లు మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు విరాళంగా పొందారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, R. కన్నయ్య,Trs నాయకులు రమేష్, మరియు ఐదుగురు పెళ్ళి కూతుర్ల వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యు

లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:* - *అదనపు కలెక్టర్ ఖుష్బు గుప్తా*

Image
  లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:* - *అదనపు కలెక్టర్ ఖుష్బు గుప్తా* నల్గొండ, డిసెంబర్ 08. ఈనెల 12న జిల్లా కేంద్రంలో ఒకే రోజు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బు గుప్తా సూచించారు. గురువారం నల్లగొండ మున్సిఫల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కమిషనర్ డా.కె.వి. రమణా చారి తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న జిల్లా కేంద్రంలో లక్ష మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఎలాంటి పోరపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యార్థులు ఎక్కువగా పాల్గొంటున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత మున్సిపాలిటి అదికారులదేనని అన్నారు. చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటడం, వాటని నీరు అందించడం కూడా మున్సిపాలిటి అధికారులు చూడాలన్నారు.అనంతరం అధికారులతో

నల్గొండ ప్రజాగోస - బీజేపీ భరోసా" బైక్ ర్యాలీ లో పాల్గొననున్న ఈటెల

Image
  నల్గొండ ప్రజాగోస - బీజేపీ భరోసా"  బైక్ ర్యాలీ లో పాల్గొననున్న ఈటెల శుక్రవారం డిసెంబర్ 9న నల్గొండ పట్టణంలో హుజురాబాద్ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్ పర్యటన....  "ప్రజాగోస - బీజేపీ భరోసా" పేరుతో బైక్ ర్యాలీ... ర్యాలీలో పాల్గొననున్న  ఈటల... ఉదయం 8 గం.కు పానగల్లులోని పచ్చల సోమేశ్వరాలయంలో పూజల అనంతరం, బైక్ ర్యాలీలో పాల్గొననున్న ఈటల రాజేందర్...

గూఢచారి ఎఫెక్టు తో బిసి వెల్ఫేర్ లో కాలం చెల్లిన టెండర్ల స్థానం లో క్రొత్త టెండర్లకు నోటిఫికేషన్

Image
  గూఢచారి ఎఫెక్టు తో   బిసి వెల్ఫేర్ లో కాలం చెల్లిన టెండర్ల  స్థానం లో  క్రొత్త టెండర్లకు  నోటిఫికేషన్ నల్గొండ:  బిసి వెల్ఫేర్ లో కాలం చెల్లిన టెండర్ల కు ప్రాణం పోస్తున్న అధికారులు అంటూ గూఢచారి న్యూస్ లో నవంబర్ 11 న వచ్చిన   వార్త ఎఫెక్ట్ తో అధికారులు  కాలం చెల్లిన టెండర్ల  కు బదులు  క్రొత్త  బాక్స్  టెండర్లకు  నోటిఫికేషన్ జారీ చేశారు.        అయితే ఇక్కడ ఒక ట్విస్టు కూడా ఉన్నట్లు కొందరు ఆరోపణలు చేస్తున్నారు. 5 లక్షల విలువ దాటిన టెండర్లు ను ఆన్లైన్లో  ఈ  ప్రోక్యూర్మెంట్ ద్వారా కూడా పిలిచే నిబంధనలు ఉన్నాయి. అలా కాకుండా అధికారులు బాక్స్ టెండర్లు పిలిచారు.         ఈ  ప్రోక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదు.   ఎక్కడి నుండి అయిన టెండరు దారులు టెండరు దాఖలు చేసుకోవచ్చు.      బాక్స్ టెండర్లో  ఎవరు ఎవరు టెండర్ షెడ్యూళ్లు కొనుగోలు చేశారో తెలుస్తుంది. అంతే కాకుండా  టెండర్ వేసే సమయం లో టెండరు దారులు అందరూ కలుసుకునే  అవకాశం ఉంటుంది దీనితో  వారికి రింగ్  అయ్యే  వెసులుబాటు కలుగుతుంది.   షెడ్యూళ్లు మార్పు చేయడానికి కూడా అవకాశం ఉంది.         గతం లో బాక్స్ టెండర్ లో టెండరు దారు

ఒకే రోజు రెండు ఏసీబీ రైడ్స్

Image
  ఒకే రోజు రెండు ఏసీబీ రైడ్స్ *18  వేలు లంచము  తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ,  అటెండర్‌* *20 వేలు లంచం తీసుకుంటు ఎసిబి కి పట్టుబడ్డ విద్యుత్ ఏ ఈ మరియు బిల్ కలక్టర్*   జనగామ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని సక్రమ మార్గంలో నడిపించే గురువులు అవినీతికి పాల్పడి రెడ్‌ హ్యండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ అనురాధ, లెక్చరర్ మల్లేష్ అటెండర్‌ రేణుక వద్ద రూ. 18 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వేతనాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వాటి చెల్లింపునకు బాధితురాలి నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం  పాఠశాలలో ప్రిన్సిపాల్‌, లెక్చరర్‌కు ఆమె డబ్బులు అందజేస్తుండగా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ************************** హైదరాబాద్ విద్యుత్ శాఖలో ఏసీబీ రైడ్స్ యాకత్ పురా సెక్షన్ విద్యుత్ ఏ ఈ రాజ శేఖర్ తోపాటు బిల్ కలెక్టర్ మొహ్మద్ జమాల్  లు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏస

11న సిబిఐ అధికారులతో సమావేశానికి అంగీకరించిన కవిత

Image
 11న సిబిఐ అధికారులతో సమావేశానికి అంగీకరించిన కవిత హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో తన వివరణ కోరడానికి ఈనెల 11న ఉదయం 11 గంటలకు సిబిఐ అధికారులతో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని  పేర్కొన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సిబిఐ అధికారులకు కవిత ఈ- మెయిల్ ద్వారా సమాచారం అందించారు.

.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

Image
 రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్ కొమురంభీం:  జిల్లాలోని రెబ్బన తహసీల్దార్ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఏసీబీ అధికారులకు సర్వేయర్ గుణవంతరావు పట్టుపడ్డాడు. రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. మరో ఉద్యోగి గణపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.