Posts

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కోరం అశోక్ రెడ్డి

Image
 రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా కోరం అశోక్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సం సందర్బంగా రెండవ అంతస్తులోని తన సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కార్యాలయంలో మధ్యాహ్నం 1.50 గంటల ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని జిల్లా పౌర సంబంధాల అధికారులకు వాహన సౌకర్యం కల్పించేందుకై అనుమతినిమిత్తం ఆర్థిక శాఖకు పంపే తొలి ఫైలు పై సంతకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సమాచార, పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ గా, రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా, E.O. కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ రెడ్డిని సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, కె.వెంకట రమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధుసూదన్, హష్మీ, సి.ఐ.ఇ రాధాకిషన్, ఆర్.ఐ.ఇ జయరాంమూర్తి, ఎఫ్.డి.సి. ఇ.డి కిషోర్ బాబు తదితరులు అభినందించారు.

ఘనంగా శ్రీ శ్రీ శ్రీ విశ్వజనని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు

Image
  ఘనంగా శ్రీ శ్రీ శ్రీ విశ్వజనని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు నల్గొండ: ఆదివారం రోజున పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో స్థానిక వాసవి భవన్ యందు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, అమ్మవారికి పంచామృతాభిషేకములు, అనంతరం సామూహిక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు యమా మురళి, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భూపతి రాజు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుబ్బా శ్రీనివాస్, భాస్కర్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసం శేకర్, వందనపు వేణు, అర్థం శ్రీనివాస్, నీలా వెంకన్న, మిరియాల మహేష్, తెలుకుంట్ల శ్రీకాంత్, వనమా రమేష్, తాళం గిరి, నూనె కిషోర్, కోటగిరి రామకృష్ణ, గజవెల్లి సత్తయ్య, ప్రొద్దుటూరు రాజలింగం, శీలా శేకర్, బండారు హరి, పారెపల్లి, వెంకన్న, నాంపల్లి భాగ్య, మిరియాల రాధ, సోమా దీప్తి, కాసం శోభారాణి, యమా శారద, తల్లం కల్పన, మిరియాల అనూష, మరియు పట్టణ ఆర్యవైశ్య బంధువులు, మిత్రులు, అందరూ అమ్మవారి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.

నల్గొండ జిల్లా IVF నూతన కార్యవర్గం

Image
 నల్గొండ జిల్లా IVF నూతన కార్యవర్గం నల్గొండ: నల్గొండ జిల్లా IVF నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులుగా ప్రముఖ వ్యాపార వేత్త రేపాల భద్రాద్రి ని రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ ఎంపిక చేశారు. కార్యదర్శి గా నూనె కిషోర్, కొశాదికారిగా గోవిందు బాలరాజు, జాయింట్ సెక్రటరీ తేలుకుంట్ల వీరయ్య, మహిళ విభాగ్ జిల్లా అద్యక్షురాలుగా కొమిరిశెట్టి రమాదేవి, కార్యదర్శి గా వందనపు జ్యోతి, కోశాధికారిగా వనమా శ్రీదేవి, జాయింట్ సెక్రటరీ నల్గొండ సుమలత, యువజన విభాగ్ జిల్లా అధ్యక్షులుగా తేలుకుంట్ల శ్రీకాంత్, కార్యదర్శి గౌరు శ్రీనాథ్, కోశాధికారిగా మిర్యా ల మహేష్ లు ఎంపికైనట్లు రాష్ట్ర నాయకులు కోటగిరి దైవాదీనం తెలిపారు.

కన్నీరు చుక్క కారిస్తే కాదు.. చెమట ముక్క చిందిస్తే.. చరిత్ర రాయగలవని తెలుసుకో...

Image
  శ్రీ సాహిత్య చార్య మహాకవి,అభ్యుదయ సాహిత్యానికి యుగకర్త శ్రీ శ్రీ జయంతి సందర్భంగా :- ==== ఆ సృష్టి లో చలనం ఉన్నది ఏదీ ఆగి పోకూడదు పారే నది... విచే గాలి.. ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు  అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తున్నది ఆ నెత్తురుతో సహా ఏదీ ఆగిపోకుడదు.... పుట్టడం గొప్పకాదు. బతకడం గొప్ప మంచి బతకడం గొప్పగాదు.. మంచిని పంచి బతకడం గొప్ప నీకు నువ్వే గొప్ప అనుకోకు  నీగురించి నలుగురు..  గొప్పగా చెప్పుకుంటే గొప్ప.. కుదిరితే పరుగెత్తు... లేకపోతే నడు అది చేత కాకా పోతే పాకుతూ పో.. అంతే కానీ... ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు.. ఏదీ తనంతట తాను నీదరి చేరదు  ప్రయత్నపూర్వకంగా సాధిస్తేనే విజయం నీ సొంతమవుతుంది. చదివితే ఇవి పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రా లుగా తెలుగు సాహిత్యంలో తన కలంతో కథంతొక్కి సిరా చుక్కలతో అగ్రి జ్వాలలు కురిపించిన మహాకవి శ్రేణీ 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించి, ఈ శతాబ్దం నాది అని చెప్పుకున్న దమ్మున్న కవి శ్రీ శ్రీ. అభ్యుదయ కవి , విష్ణవ కవిగా సాంప్రదాయ చందో బద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన ప్రజాకవి శ్రీ శ్రీ.శ్రీ శ్రీ అసలుపేరు శ్రీరంగం శ్రీనివా...

I & PR కమీషనర్ గా అశోక్ రెడ్డి

Image
 I & PR కమీషనర్ గా అశోక్ రెడ్డి కె. అశోక్ రెడ్డి IAS(2014) ని సమాచార పౌర సంబధాల శాఖ కమీషనర్ మరియు Ex.Officio Spl. కార్యదర్శి గా ప్రభుత్వ నియమిస్తూ జివో జారీచేసింది. ఇప్పటి వరకు ఇయన ఆర్థిక మంత్రి OSD గా పని చేశారు. ఇప్పటి వరకు భాద్యతలు నిర్వహిస్తున్న అరవింద్ కుమార్,IAS(1991)ని పూర్తి గా రిలీవ్ చేసింది.

ఘనంగా ఐవిఎఫ్ తెలంగాణ నూతన కార్యాలయం ప్రారంభం

Image
  ఘనంగా ఐవిఎఫ్ తెలంగాణ నూతన కార్యాలయం ప్రారంభం హైదరాబాద్, నారాయణ గూడ కుబేర ఎస్టేట్ లో నూతనంగా నిర్మించిన IVF- తెలంగాణ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం మరియు ఐవీఎఫ్ బెనారస్ ఆనంద నిలయం బ్రోచర్ ఆవిష్కరణ మహోత్సవమునకు ముఖ్య అతిధులుగా ఐవీఎఫ్ చీఫ్ అడ్వయిజర్, మాజీ పార్లమెంట్ సభ్యులు టి.జి.వెంకటేష్, ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్ మరియు అతుధులుగా ఐవీఎఫ్ కేంద్ర కమిటీ సీనియర్ కార్యనిర్వాహక అధ్యక్షులు గంజి రాజమౌళి గుప్త మరియు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ మరియు ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ చీఫ్ అడ్వయిజర్, మాజీ పార్లమెంట్ సభ్యులు టి.జి.వెంకటేష్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఊర్లో బడి, గుడి, అన్నదానం, ఎటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు అయినా చేయడానికి ఆర్యవైశ్య సోదరులు, మహిళలు ముందుంటారని, సామాజిక సేవా కార్యక్రమం ఏదైనా కావచ్చు తెలంగాణ రాష్ట్రం లో IVF నాయకులు ఆర్యవైశ్యులు ముందు ఉంటారని అన్నారు.ఈ సందర్భంగా.ల ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షుల...

జర్నలిస్టు లను మోసం చేసిన కేసీఆర్ కు ప్రజలను మోసం చేయడం ఓ లెక్కా: ఎమ్మెల్యే రఘునందన్ రావు

Image
 జర్నలిస్టు లను మోసం చేసిన కేసీఆర్ కు ప్రజలను మోసం చేయడం ఓ లెక్కా: ఎమ్మెల్యే రఘునందన్ రావు   బిఆర్ఎస్ వ్యతిరేక వార్తలు రాయండి మూడు రోజుల్లో కేసీఆర్ జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరిస్తారు. ఆల్లం బెల్లం అని చెప్పే పెద్ద మనిషి కుర్చీకి పవర్ లేదంటూ జర్నలిస్టులకు న్యాయం చేయనివారు  ఎర్ర బుగ్గ కారులో ఎందుకు తిరుగుతున్నారు అని  దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు  మండి పడ్డారు.అన్ని వర్గాలను మోసం చేసినట్లే కెసిఆర్ జర్నలిస్ట్ లను మోసం చేశారన్నారు.  ఇదిగో ఇల్లు అదిగో స్థలాలు జర్నలిస్టులో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జర్నలిస్టులు అధైర్య పడవద్దని ఏక తాటిగా ఉంటే ప్రభుత్వమే దిగివచ్చిందన్నారు.  ప్రభుత్వం చేపట్టి ఆత్మీయ సమ్మేలాన్ని పత్రికల్లో ప్రచూరించకుంటే పత్రికల విలువ తెలుస్తుంది అన్నారు.  మాస్టర్ ప్లాన్ లో రైతులు ఏ విధంగా  ఉద్యమంలో చేపెట్టారు అదే స్ఫూర్తిలో జర్నలిస్టులు ఏకతాటిపై వచ్చి స్థలాల కోసం పోరాడాలన్నారు.   తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సకల జనులను  ఏకం చేసి చైతన్య వం...