Posts

తెలంగాణ టింబర్, సా మిల్స్ ఆధ్వర్యంలో కోలేటి దామోదర్‌ గుప్తా జన్మదినోత్సవం సందర్భంగా అన్నదానం

Image
 తెలంగాణ టింబర్, సా మిల్స్ ఆధ్వర్యంలో కోలేటి దామోదర్‌ గుప్తా జన్మదినోత్సవం సందర్భంగా అన్నదానం రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తా 61వ జన్మదినోత్సవం పురస్కరించుకొని.. దిల్ సుఖ్ నగర్ లోని తెలంగాణ టింబర్, సా మిల్స్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం ప్రాంతానికి చెందిన కోలేటి దామోదర్‌ గుప్తాను సీఎం కేసీఆర్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ...వైశ్యులకు అవసరమైన సహాయ సహాకారలు అందిస్తున్న దామోదర్ గుప్త ఆయురారోగ్యాలు అందాలని కోరుతూ వేలాది మందికి పేదలకు భారీగా అన్నదానం చేశారు. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనదని ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారని తెలంగాణ టింబర్,సా మిల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, సాయి తులసీ భవనం అధ్యక్షుడు చకిలం రమణయ్య అన్నారు. ఈ అన్న దాన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సింహ గుప్త, కార్యదర్శి సింగికొం...

కౌటికె విఠల్ ఆధ్వర్యంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త జన్మదినం సందర్భంగా అన్నదానం

Image
 కౌటికె విఠల్ ఆధ్వర్యంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త జన్మదినం సందర్భంగా అన్నదానం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆల్ ఇండియా విభాగం జాతీయ సలహాదారులు, భారతీయ జీవిత బీమా సంస్థలో నంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్  కౌటికె విఠల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త జన్మదినం సందర్భంగా ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ సలహా మేరకు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోలేటి దామోదర్ గుప్త జన్మదినం సందర్భంగా మేము చేసిన అన్నదాన కార్యక్రమంలో స్వయంగా వారు పాల్గొని కెకును కట్ చేసి అందరికీ తినిపించడం మా అదృష్టం అన్నారు. వారు కూడా సహ పంక్తిలో మాతో కలిసి భోజనం చేశారని అన్నారు. అంతే కాకుండా వారి ఆయురారోగ్యాలు బాగుండాలని మరిన్ని పదోన్నతులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ధన క్రాప్స్ అధినేత, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పబ్బతి వెంకట రవి కుమార్ ప్రా...

తుల్జా భవాని శక్తిపీట్ అమ్మవారిని దర్శించుకున్న ఉప్పల శ్రీనివాస్

Image
 తుల్జా భవాని శక్తిపీట్ అమ్మవారిని దర్శించుకున్న ఉప్పల శ్రీనివాస్  మహారాష్ట్ర రాష్ట్రం, తుల్జాపూర్ లోని శ్రీ తుల్జా భవాని శక్తిపీట్ ఆలయంలో అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర టూరిజం మాజీ చైర్మెన్ మరియు IVF రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ సకుటుంబ సమేతంగా.. దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

వామ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ 61 వ జన్మ దినోత్సవం

Image
 వామ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ 61 వ జన్మ దినోత్సవం  ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ 61 వ జన్మ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ జాతీయ సలహాదారు కౌటికె విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. తేదీ 05 జూన్ సోమవారం మధ్యాహ్నము 1.30pm నకు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వద్ద భోజన వితరణ చేయనున్నట్లు కోలేటి దామోదర్ చే కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ ప్రెసిడెంట్ తంగుటూరి రామకృష్ణ ముఖ్య అతిథి గా విచ్చేయు చున్నారని, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గౌరవ సభ్యులు నాయకులూ అందరూ పాల్గొనగలరని అయన కోరారు.

1200 మంది బలిదానం చేసుకొని సాధించిన తెలంగాణ కెసిఆర్ కుటుంబం పాలయ్యింది - మాజీ ఎంపీ లు బూర నర్సయ్య గౌడ్ విశ్వేశ్వర్ రెడ్డి

Image
  1200 మంది బలిదానం చేసుకొని సాధించిన తెలంగాణ కెసిఆర్ కుటుంబం పాలయ్యింది - మాజీ ఎంపీ లు బూర నర్సయ్య గౌడ్ విశ్వేశ్వర్ రెడ్డి 1200 మంది బలిదానం చేసుకొని తెలంగాణ సాధిస్తే కెసిఆర్ కుటుంబం పాలయ్యిందని మాజీ ఎంపీ లు బూర నర్సయ్య గౌడ్ విశ్వేశ్వర్ రెడ్డిలు అన్నారు. 10 ఏళ్లలో తెలంగాణలో కెసిఆర్ కుటుంబం దండుకున్నంత ధరణి భూతాన్ని తెలంగాణ ప్రజలపైకి వదిలింది ఉద్యమకారులను వదిలి ఉద్యమ ద్రోహులు మంత్రులు చేశారు వచ్చిన తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే తప్పు చేశాను క్షమించండి ప్రజాయుద్ధం ఒక గద్దర్ ప్రజలను క్షమాపణ కోరిన గద్దర్  తుపాకీతో చేయలేనిది ఓటుతో చేయొచ్చు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ గిన్నిస్ బుక్ లో ఎక్కించొచ్చు జర్నలిస్టులు టిఆర్ఎస్ పార్టీకి భజన పరులుగా మారోద్దు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో కప్పర ప్రసాద్ రావు అధ్యక్షతన జరిగిన దగా పడ్డది ఎవరు ?దండుకున్నది ఎవరు? రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజాయుద్ధన నౌక గద్దర్ ఓయూ ఉద్యమకారులు గాదెన్నయ్య జేఏసీ పిడమర్తి రవి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాజీ టీఎస్పీఎస్ సభ్యులు బిజెపి అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి సిహెచ్ వ...

పదేండ్ల తెలంగాణలో దందుకున్నది ఎవరు? దగా పడ్డది ఎవరు.? - కప్పర

Image
 పదేండ్ల తెలంగాణలో  దందుకున్నది ఎవరు? దగా పడ్డది ఎవరు.? జై తెలంగాణ ఇది తెలంగాణ ప్రజల ఉద్యమ నినాదం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న దృఢ సంకల్పంతో నాటి పోరాటంలో ముక్కోటి గొంతుకలు ఒక్కటై దిక్కులు పిక్కటిల్లెల, భూమి బద్దలయ్యేలా, పాలకుల గుండెలు అదిరిపోయేలా గర్జించిన రణ నినాదమది. అనుకున్నట్టుగానే, తెలంగాణ ప్రజానీకం ఆశించిన విధంగా రాష్ట్రం సాకారమైంది. చూస్తుండగానే పదేళ్లు గడిచిపోతున్నాయి. ఇప్పుడు మనం చాలా ముందుకు వచ్చాం. ఇక ఒక్క అడుగు ఆగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. పదేళ్ల తెలంగాణలో దండుకున్నది ఎవరు. దగా పడ్డది ఎవరో తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ ఉద్యమంలో కలాలను, గళాలను, హాలాలను, ఒక్కటిగా చేసి ఉద్యమం లో భగస్తులను చేసింది జర్నలిస్టులు. సర్వరోగ నివారిణి జిందా తిలస్మాత్  అన్న చందంగా అన్ని సమస్యలకు తెలంగాణ ఒక్కటే పరిష్కార మార్గమని అందుకోసం అలుపెరుగని పోరాటం అవసరమని భావించాం. మనం ఏది అనుకున్నామో , ఏమి ఆలోచించామో ఆ భావాలన్నింటినీ ప్రజలపై రుద్దాం. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఒక ఆకర్షణీయ నినాదాన్ని తయారుచేసి ఉద్యమకారులకు అందించాము. ...

*సీఎం కు ప్రసాదం అందించిన ఎమ్మెల్యే బిగాల *

Image
 *సీఎం  కు  ప్రసాదం అందించిన ఎమ్మెల్యే  బిగాల * రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల కలిశారు. సోమవారం సచివాలయంలో సీఎంతో భేటీ అయిన ఎమ్మెల్యే గతవారం మూడు రోజులపాటు వైభవంగా జరిగిన ఆలయ స్థాపన మహోత్సవంలో పూజలు అందుకున్న ప్రసాదాన్ని అందించారు. తన స్వగ్రామం మాక్లూర్ లో నిర్మించిన దేవాలయాల విశిష్టతను సీఎంకు ఎమ్మెల్యే వివరించారు. తన తండ్రి కృష్ణమూర్తి గారి సంకల్పాన్ని బిగాల సోదరులు ఏ విధంగా పూర్తి చేశారన్న అంశాన్ని సీఎంకు చెప్పారు. ఓకే ఆలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప సహిత,శ్రీ ఆంజనేయ శివ పంచాయతన సహిత, శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయాలను నిర్మించి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సోదరులు చేసిన కృషిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా అభినందించారు.