Posts

అభ్యర్థులను నిర్ణయించినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదు - తెలంగాణ రాష్ట్ర బిజెపి

Image
 అభ్యర్థులను నిర్ణయించినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదు - తెలంగాణ రాష్ట్ర బిజెపి -  భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను నిర్ణయించినట్లు మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలకు ఎలాంటి ఆధారం లేదు. ఈ వార్తలలో నిజం లేదు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక గురించి పార్టీలో ఇంతవరకు ఎలాంటి చర్చా జరగలేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపినట్లు కార్యాలయ కార్యదర్శి డా॥ బి. ఉమాశంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారుచేస్తే అధికారికంగానే ప్రకటిస్తుందని, పార్టీ కార్యకర్తలు ఇలాంటి కల్పిత కథనాలపట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిజెపి రాష్ట్ర పార్టీ తెలియజేస్తున్నదని ఆ ప్రకటన తెలిపారు.

ముఖ్యమంత్రి ని కలసిన కంచర్ల

Image
  ముఖ్యమంత్రి ని కలసిన కంచర్ల అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంగా.. జిల్లా మంత్రి గారు,ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్యమంత్రి ని కలిసి.. నల్గొండలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలకు విచ్చేయవలసిందిగా ఆహ్వానించామని ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి అభ్యర్థించానని ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు 

*ఎస్సీ, ఎస్టీ, గౌడ్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం లక్కీ డ్రా ద్వారా మద్యం షాప్ లు కేటాయింపు*

Image
*ఎస్సీ, ఎస్టీ, గౌడ్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం లక్కీ డ్రా ద్వారా మద్యం షాప్ లు కేటాయింపు* నల్గొండ:    2023–25 సంవత్సరాలకు రెండేళ్ల కాల పరిమితికిగాను జిల్లాలో మొత్తం 155 మద్యం దుకాణాలకు గాను ఎస్.టి.,ఎస్.సి.,గౌడ్ సామాజిక వర్గాలకు నూతన మద్యం పాలసీ ననుసరించి వారికి రిజర్వేషన్ ప్రకారం జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులు కేటాయించారు. గురు వారం ( ఆగస్ట్ 3) న జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ అదనపు కలెక్టర్(రెవెన్యూ) జె.శ్రీనివాస్ తో కలిసి కమిటీ సభ్యులు ఎక్సైజ్,ప్రోహిబిషన్ సూపరిండెంట్ బి.సంతోష్, ఎస్.సి.అభివృద్ధి అధికారి ఎల్.శ్రీనివాస్,బి.సి.అభివృద్ధి సంక్షేమ అధికారి ఖాజా నాజిం అలీ,గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్ అధికారుల సమక్షంలో ఎస్.సి.,ఎస్.టి.,గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ 'ప్రాతిపదికన మద్యం దుకాణాలు, నిర్ధారించేందుకు డ్రా నిర్వహించి మొత్తం 155 ఏ4 మద్యం షాపుల్లో గౌడ్ లకు 34, ఎస్సీ లకు 14, ఎస్టీ లకు 4 షాపులు మొత్తం 52 షాపు లను రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు.   మిగిలిన 103 మద్యం షాపులను జనరల్ స

కుటుంబ సభ్యులతో మోడీని కలిసిన బండి సంజయ్

Image
 *కుటుంబ సభ్యులతో మోడీని కలిసిన బండి సంజయ్* బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి బండి సంజయ్ ప్రధానిని కలిశారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను మోడీ ఈ సందర్భంగా అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతో పాటు వారి యోగ క్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు.

వైశ్య కార్పొరేషన్* సాధన కై కొలేటికి వినతి పత్రం

Image
 *ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య* అధ్యక్షురాలు శ్రీమతి ఉప్పల రాజ్యలక్ష్మి శ్రీధర్ గుప్త  మరియు వారి కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి *వైశ్య కార్పొరేషన్* సాధన కై తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ *శ్రీయుత కొల్లేటి దామోదర్ గుప్త* ని కలిసి వినతపత్రం ఇవ్వడం జరిగింది

బీజేపీ ఎస్సీమోర్చా జిల్లా కార్యదర్శిగా ఆదిమల్ల దేవేందర్

Image
  బీజేపీ ఎస్సీమోర్చా జిల్లా కార్యదర్శిగా ఆదిమల్ల దేవేందర్ నియామకం నల్గొండ నియోజకవర్గం కనగల్ మండలంలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన *ఆదిమల్ల దేవేందర్  ను జిల్లా ఎస్సీమోర్చా కార్యదర్శిగా నియామకం చేస్తూ మంగళవారం బీజేపీ ఎస్సీమోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన నియామక పత్రాన్ని దేవేందర్కు అందచేశారు. ఈ సందర్బంగా గోలి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పధకాలలో ఎస్సీలను లబ్ధిదారులుగా చేసేందుకు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర జిల్లా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నిరంతరం పని చేయాలని సూచించారు. దేవేందర్ మాట్లాడుతూ నామీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన గోలి ప్రభాకర్ కి,  నియామాకానికి సహకరించిన ఎస్సీమోర్చా రాష్ట్ర కార్యదర్శి పొతేపాక సాంబయ్య కి వెన్నమళ్ళ మహేష్ కొత్తపల్లి ప్రమోద్ కి కృతజ్ఞతలు తెలియచేసారు.

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కొరకు నిరసన దీక్ష

Image
 ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కొరకు నిరసన దీక్ష ఈరోజు తేదీ 31 జులై 2023 సోమవారం రోజున కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు గురించి నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో వైశ్య నాయకులు అమరవాది లక్ష్మీనారాయణ, ఇరుకుల్ల రామకృష్ణ, గంప శ్రీనివాస్ మరియు కరీంనగర్ పట్టణ వైశ్య ప్రముఖులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.