Posts

*ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం అన్ని ఆర్యవైశ్య సంస్థలు ఒక్కటై "వైశ్య గర్జన"*

Image
  *ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం అన్ని ఆర్యవైశ్య సంస్థలు ఒక్కటై "వైశ్య గర్జన"* *ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని అశించాము ..కానీ ఆర్య వైశ్యులకు సరైన న్యాయం జరగ నందున ఆర్యవైశ్య సంస్థలన్నీ ఒక్క దాటిపై గర్జనకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నారు.. కానీ ఆర్థికoగా ఆర్యవైశ్యులకు న్యాయం జరగటo లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో 150% శాతం పెరిగిన మా ఆర్యవైశ్యుల్లో పేదరికానికి దగ్గర గా రాజరీకానికి దూరమై పోతున్నాం.. ఇప్పుడున్న అధికార పార్టీ బి.ఆర్.ఎస్ ఒకే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మాకు పూర్తిగా అన్యాయం చేసింది... కాని రాజకీయ పార్టీలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలన్నా ఆర్యవైశ్యులు ఆర్థికంగా , విద్యాపరంగా, రాజకీయంగా పూర్తిగా అణిచివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుండి ఆర్యవైశ్యుల్ని చైతన్య పరుస్తూ 1500 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసామని.. 24 జిల్లాలలో ధర్నాలు, అసె...

సింహంలా గర్జిద్దామా? గాడిదలా ఘి పెడదామా?

Image
 సింహంలా గర్జిద్దామా?  గాడిదలా ఘి పెడదామా? ఆర్యవైశ్యులరా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. ఆర్యవైశ్యుల హక్కుల కొరకు ఒకవైపు వైశ్య వికాస వేదిక సింహంలా గర్జిద్దాం అంటుంటే, ఇంకోవైపు రాష్ట్ర సంఘాన్ని ఆక్రమించిన నాయకులు గాడిదలా ఘి పెడదాం అంటున్నారు. ఈ నాయకులు తమ బాధ్యత ను ఎప్పుడూ నిర్వర్తించలేదు కానీ అధికారాన్ని మాత్రం చలాయిస్తూ పదవులతో కులుకుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకు చేసింది ఏందో ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని చెప్పమనండి.  సంఘాలు అంటే ఆ కమ్యూనిటీ మేలు చేసేలా ఆర్థికంగా చితికిన కమ్యూనిటీ వర్గానికి ఎంతో కొంత మేలు చేసేలా ప్రవర్తించాలి. ఆ కమ్యూనిటీకి రావలసిన రాజకీయ వాటాను సాధించేందుకు కృషి చేయాలి, చదువుకునే విద్యార్థులకు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించేలా కృషి చేయాలి. ప్రభుత్వం ద్వారా ప్రకటించే సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేయాలి. కానీ ఒక్కటి చేస్తే ఒట్టు.  గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు వైశ్యుల అభ్యున్నతి పెంచే కార్యక్రమాలు విద్యార్థులకు ఆర్థిక సహాయం, రాజకీయంగా ఎదగడానికి అన్ని పార్టీలకు విజ్ఞప్తులు చేస్తూ ప్రజాస్వామ్యబ...

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

Image
 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

కార్పోరేషన్ కొరకు హరీష్ రావుకు వినతి పత్రం అందచేసిన ఉప్పల శ్రీనివాస్

Image
 *_మంత్రి హరీష్ రావు గారికి వినతి పత్రం అందజేసిన టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త_* ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి హరీష్ రావుకు హైదరాబాద్ లో సోమవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త వినతి పత్రం అందజేశారు. *తదనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..* ఆర్యవైశ్యుల్లో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారని వారికి ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ బృందం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగిందని మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించి సీఎం కెసిఆర్ తో చర్చించి త్వరలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారని తెలిపారు సీఎం కేసీఆర్ ఆర్యవైశ్యులకు అండగా ఉంటూ ఉప్పల్ భగాయత్ లో ఐదు ఎకరాల భూమిని ఇచ్చి ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తున్న సీఎం కెసిఆర్ ఆర్యవైశ్య కార్పొరేషన్ కచ్చితంగా ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు *ఈ కార్యక్రమంలో..* ఆయనతోపాటు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్స...

ఐక్యతను పెంచి ఆర్యవైశ్యుల పరపతిని పెంచాల్సిన మహాసభ నాయకులు పోటీ దీక్ష పై సోషల్ మీడియాలో ట్రోలింగ్

Image
   ఐక్యతను పెంచి ఆర్యవైశ్యుల పరపతిని పెంచాల్సిన మహాసభ నాయకులు పోటీ దీక్ష పై సోషల్ మీడియాలో ట్రోలింగ్  స్వేచ్ఛ మైన పాల లో విషపు చుక్కలా ప్రవర్తిస్తున్న నాయకుల తీరు పై ట్రోలింగ్..... ఇప్పుడు జరుగుతున్న సంఘటన చాలా దురదృష్టకరం, మహాసభ సెప్టెంబర్ 30వ తేదీన దర్నా చౌక్‌లో ""వైశ్య కార్పొరేషన్ సదన సాధన దీక్ష"" శీర్షికతో దీక్షను ప్రతిపాదించడం ఈ విషయంలో నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను ...వైశ్య వికాస వేదిక దాదాపు వైశ్య గర్జనను ప్రతిపాదించింది 3 నెలల క్రితం అనేక జిల్లా కేంద్రాలు మరియు మండలాల్లో సమావేశాలు నిర్వహించారు, ఇప్పుడు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అకస్మాత్తుగా సాధన దీక్షను ప్రకటించింది, ఇది ప్రతిపాదిత వైశ్య గర్జనకు కౌంటర్ బ్లాస్ట్ లేదా దీని వెనుక ఏదైనా రాజకీయ ప్రేరణ ఉందా, నిజంగా మహాసభకు ఉద్దేశ్యం ఉంటే. స్వచ్ఛత బుద్ధి 4 సంవత్సరాల క్రితమే ముందుకు వచ్చేది, మరోవైపు మన వైశ్య ప్రముఖులు చాలా మంది ప్రభుత్వంలో మంచి పదవులను కలిగి ఉన్నారు మరియు వారి హోల్డింగ్ పోస్ట్ వరకు, వారి పదవీకాలంలో వారు ఈ విషయాన్ని స్పృశించలేదు, అకస్మాత్తుగా మహాసభ సాధన దీక్షను ప్రకటించింది, మహాసభలో సరైన సమ...

పరకాలలో ఫైరింగ్ కలకలం..

Image
పరకాలలో ఫైరింగ్ కలకలం.. హన్మకొండ జిల్లా: పరకాలలో ఫైరింగ్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన బిల్డర్ తిరుపతిరెడ్డి లైసెన్స్ తుపాకితో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.. ఐదురోజుల క్రితం కాల్పుల ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. తుపాకీని సీజ్ చేశారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లైసెన్స్ తుపాకీతో సంవత్సరికం పంక్షన్‌లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి గాలిలోకి కాల్పులు జరిపాడని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. నిందితున్ని కోర్టులో హాజరుపర్చిగా న్యాయస్థానం రిమాండ్ విధించిందని స‍్పష్టం చేశారు..  

ఆర్యవైశ్యుల హక్కులు సాధనకై వైశ్య గర్జన - కాచం

Image
  ఆర్యవైశ్యుల హక్కులు సాధనకై వైశ్య గర్జన - కాచం పాల్వంచ : ఆర్యవైశ్యుల కార్పొరేషన్, ఆర్యవైశ్యుల హక్కులు ఆర్యవైశ్యుల కు రాజకీయాల్లో వాటా కొరకు  వైశ్యగర్జన హైదరాబాద్ లో ఏర్పాటు  చేసినట్లు వైశ్య వికాస వేదిక పౌండర్ చైర్మన్ కాసం సత్యనారాయణ గుప్తా తెలిపారు. పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర వైశ్య  గర్జన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం లో  కాచం సత్యనారాయణ మాట్లాడుతూ అధిక సంఖ్యలో పాల్గొని వైశ్య గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి అన్ని మండలాల ఆర్యవైశ్య ప్రముఖులు, పట్టణ మండల నాయకులు, సభ్యులు పాల్గొన్న వారు మాట్లాడుతూ  వైశ్య గర్జనకు వేలాదిగా తరలివచ్చి మన సమస్యలన్నీ మాట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన న్యాయమైన డిమాండ్లుసాధించుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వరరావు, పాల్వంచ ఆర్యవైశ్య మహాసభ టౌన్ అధ్యక్షులు చలవాది ప్రకాష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఐక్యత కోసం అందరూ కట్టుబడి ఉండాలని ఈ వైశ్య గర్జన సదస్సుని హైదరాబాదులో విజయవంతం చేయాల...