Posts

ఉచిత బస్సు సర్వీస్ ని ప్రారంభించిన అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ

Image
ఉచిత బస్సు సర్వీస్ ని ప్రారంభించిన అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ నిజా మాబాద్ నగరం లోని RTC బస్  స్టాండ్ లో మహాలక్ష్మి పథకం మహిళమనులకు ఉచిత బస్ ని ప్రారంభయించిన అర్బన్ MLA ధన్ పాల్ సూర్యనారాయణ.  ఈ సందర్బంగా అయన  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ ద్వారా మహిళలకు మంచి అవకాశం అన్నారు కానీ కర్ణాటక ప్రభుత్వం లాగా ఇక్కడ ఇబ్బందులు కాకుండ చూడాలని అన్నారు ప్రజల కు మెరుగైన సదుపాయాలు కల్పించి RTC తొడ్పాటు అందించాలని కోరారు.  బస్ లలో మహిళా మణులకు ఇబ్బందులు కాకుండా చూడాలని కోరారు మహిళా మణులకు ఉచిత టికెట్ అంద చేసి MLA గారు టికెట్ తీసుకోని నగరం లో కొద్దిసేపు బస్ లో పర్యటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ ఆవిష్కరణ లొ కూడా  నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో కేసీఆర్ ను పరామర్శిస్తూన్న సీఎం రేవంత్ రెడ్డి

Image
 సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో  కేసీఆర్ ను  పరామర్శిస్తూన్న సీఎం రేవంత్ రెడ్డి

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం భీమా 5 లక్షల నుండి 10 లక్షలకు పెంపు , ఆర్టీసీ బస్సు ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం* "*మహాలక్ష్మి*"

Image
**రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం   భీమా 5 లక్షల నుండి 10 లక్షలకు పెంపు , ఆర్టీసీ బస్సు ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం* "*మహాలక్ష్మి*"  *పథకాలను ప్రారంభించిన స్థానిక సంస్థల కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్* నల్గొండ, డిసెంబర్ 09 :  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన *మహాలక్ష్మి* పథకాలను జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల అదనపు  కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ముందుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుండి 10 లక్షల రూ.ల కు పరిమితి పెంపు   పోస్టర్ ఆవిష్కరించి, పథకాన్ని ప్రారంభించిన అనంతరం మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుకు స్థానిక సంస్థల కలెక్టర్ పచ్చ జెండా ఊపి పథకాన్ని ప్రారంభించారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులతో కలిసి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుండి క్లాక్ టవర్  వరకు కలెక్టర్ సైతం బస్సులో ప్రయాణం చేశారు. బస్సులోని మహిళలకు ఎలాంటి చార

తిరుపతి మొక్కు తీర్చుకున్న అవినాష్*

Image
 *తిరుపతి మొక్కు తీర్చుకున్న అవినాష్*  వేముల వీరేశం ఎన్నికలలో గెలవాలని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కు కున్న ఆయన అభిమాని వంగాల అవినాష్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ కు నగరానికి చేరుకున్న అవినాష్ కుటుంబంతో సహా న్యూ ఎమ్మెల్యే క్వాటర్స్ లోని వీరేశం నివాసానికి వెళ్లి ఆయనకు ప్రసాదాన్ని అందజేశారు. ఉద్యమ సమయం నుంచి తెలంగాణ ఏర్పాటు కోసం పాటుపడిన వీరేశం కు అప్పటి అధికార పార్టీ టికెట్ నిరాకరించగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అక్కున చేర్చుకొని నకిరేకల్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఇవ్వడంతో ఆయన వీరాభిమానులు ఆనందంలో మునిగితేలారు. తాము నిత్యం అభిమానించే నాయకుడిని గెలిపించాలని కుటుంబాన్ని వదిలి, ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరి సొంత గ్రామాలకు వెళ్లి వీరేశం కోసం ప్రచారం నిర్వహించారు. వారి కష్టం వృధా కాలేదు వీరేశం అధికార పార్టీ అభ్యర్థిపై విజయం సాధించి మరో మారు అసెంబ్లీ మెట్లు ఎక్కనున్నారు.దీంతో సంతోషంతో వంగాల అవినాష్ ఆయన నమ్మే ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్లి తిరిగి నేరుగా వీరేశం ఇంటికి చేరుకొని ప్రసాదం అందజేసి సత్కరించి శుభాకాంక్షలు తెల

యాసంగి పంటల సాగు ప్రణాళిక సాగు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్

Image
                                                             #యాసంగి పంటల సాగు ప్రణాళిక సాగు పై సమీక్ష# *జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్* .         యాసంగి లో పంటల సాగు ప్రణాళిక ప్రకారం రైతులకు ఎరువులు,పురుగు మందులు,నాణ్యమైన విత్తనాలు అందు బాటులో ఉంచాలని నల్గొండ  జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం  సమావేశ మందిరం లో యాసంగి లో పంటల సాగు ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్ల పై వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ,జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ,సహకార శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. యాసంగి లో జిల్లాలో 4,80,000 ఎకరాల్లో సాగు అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారులు కలెక్టర్ కు వివరించారు. యానంగి పంటల సాగు ప్రణాళిక ననుసరించి రైతులకు కావలసిన రైతులకు నాణ్యమైన విత్తనాలు అంద చేయాలని అన్నారు..ఎరువుల డీలర్ ,సొసైటీ లు తనిఖీ చేస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు అందేలా వ్యవ సాయ శాఖ చర్యలు తీసుకోవాలని అన్నారు లక్ష ఎకరాల్లో వరి నారు వేసినట్లు,4వేల ఎకరాలు వరి సాగు,4 వేల ఎకరాలు వేరు శనగ సాగు చేసినట్లు అధికారులు వివరించారు.ప్రణాళి

రాష్ట్ర స్థాయి కరాటే టోర్నమెంట్ ఆండ్ సెలక్షన్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్

Image
నల్గొండ,  dt.5.12.23 67 వ SGF ( స్కూలు గేమ్స్ ఫెడరేషన్) తెలంగాణా రాష్ట్ర స్థాయి కరాటే టోర్నమెంట్ ఆండ్ సెలక్షన్స్ ను జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ ప్రారంభించారు 14, 17 సంవత్సరాల లోపు బాల బాలికలకు నిర్వహిస్తున్న కరాటే  పోటీలను  నల్లగొండ పట్టణం లోని ఇండోర్ క్రీడా ప్రాంగణంలో మంగళ వారం జిల్లా కలెక్టర్ జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి తో కలిసి   ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్   మాట్లాడుతూ  నేటి యువతకు ఎక్కువగా క్రీడా పోటీలు అవసరమని,క్రీడా పోటీల లో పాల్గొనడం  ద్వారా మాత్రమే శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందని అనారు.  తల్లిదండ్రులు చదువు మాత్రమే కాకుండా ఆటలపై కూడా బాల బాలికలను పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. కరాటే వలన వ్యక్తిగత ధైర్యంతో పాటు శారీరక దృఢత్వం అభివృద్ధి చెందుతుందని,.అందువలన బాలబాలికలందరూ పాల్గొనాలని అన్నారు. తను కూడా ప్రతిరోజు గేమ్స్ ఆడుతానని షెటిల్, వాలీబాల్ ఆడుతానని తెలిపారు బాలబాలికలు అందరూ ఏదో ఒక ఆటలలో పాల్గొనడం వలన శారీరక దృఢత్వం అభివృద్ధి చెందుతుందని, నేటి యువత ఎక్కువగా సెల్ఫోన్లతో టైమ్ స్పెండ్ చేస్తున్నందువలన శారీరక దృఢత్వం అనేది ఉండడం లేదు. కా

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు - జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అర్.వి.కర్ణన్

Image
*జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు* - నల్గొండ, 01,  డిసెంబర్ 2023 నల్గొండ జిల్లాలో ఈ నెల 3 వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అర్.వి.కర్ణన్ తెలిపారు. తిప్పర్తి మండలం అనిశెట్టి ధుప్పల పల్లి లోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం లో డిసెంబర్ 3 ఉదయం 8 గంటలకు నల్గొండ,మిర్యాలగూడ,దేవరకొండ,మును గోడ్,నకిరేకల్,నాగార్జున సాగర్ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేపట్ట నున్నట్లు తెలిపారు.  *లెక్కింపునకు ఏర్పాట్లు* 3న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం  ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తిప్పర్తి మండలం అనిశెట్టి ధుప్పల పల్లి లోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం లో  లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు నల్గొండ,మిర్యాలగూడ,దేవరకొండ,మును గోడ్,నకిరేకల్,నాగార్జున సాగర్ నియోజకవర్గాలకు  అసెంబ్లీనియోజక వర్గాలకు వేరు వేరు కౌంటింగ్‌ హాల్ లను ఏర్పాటు చేశారు.  ఒక్కో నియోజకవర్గంలో ఈవీఎం ల ఓట్ల లెక్కింపుకు 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు.  లెక్కింపులో జాప్యం జరగక