మిర్యాలగూడలో బిజెపి అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం.
*మిర్యాలగూడలో బిజెపి అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం.* నలగొండ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు కోసం సీతారాంపురం 44వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నేరెళ్ల అజయ్ మాట్లాడుతూ ఈసారి కేంద్రంలో ఇండియా సర్కార్ 400 సీట్లతో ఏర్పడుతుందని అందులో నల్గొండ పార్లమెంటు కూడా ఉంటుందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు పార్టీలో కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పిచ్చుకోవడం జరిగిందినీ, ఇటువంటి ప్రజా ప్రతినిధి అనుభవం లేని వ్యక్తులు. ఇటు బిజెపి అభ్యర్థి హుజూర్నగర్ మాజీ శాసనసభ్యులు అనేక విధాలుగా హుజూర్నగర్ నియోజకవర్గం నీ అభివృద్ధి చేశారనీ అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గత పది సంవత్సరాలుగా అనేక అభివృద్ధి పదంలో ప్రపంచంలోనే భారత్ ను తొలి స్థానంలో నిలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ రమణ మహేష్ ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు