Posts

అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు) గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగింపు

Image
 హైదరాబాద్, జూన్ 19 :: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు) గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వల మేరకు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్లు ఆయిన జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రతి రెండు సంవత్సరాలకోసారి అక్రిడిటేషన్ కార్డుల సదుపాయం రాష్ట్ర సమాచార శాఖ కల్పిస్తున్నది. ఆ గడువు ఈ నెల జూన్ 30 తో ముగిస్తుండగా, గడువు తేదీని సెప్టేంబర్ 30 వరకు పొడిగించినట్లు ఆ ఉత్తర్వులలో తెలిపారు. ---------------------------------------------------------------------- స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖచే జారీ చేయనైనది.

శ్రీ కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య సత్రం రికార్డుల బీరువాను దౌర్జన్యంగా లాకెళ్ళిన ఆర్యవైశ్య ఓ పెద్ద నాయకుడి అనుచరులు?

Image
 శ్రీ కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య సత్రం రికార్డుల బీరువాను దౌర్జన్యంగా లాకెళ్ళిన ఆర్యవైశ్య ఓ పెద్ద నాయకుడి అనుచరులు? *అడహాక్ కమిటీ కో ఆర్డినేటర్ గబ్బ చంద్రశేఖర్ ఛాంబర్ కు తాళం?* హైద్రాబాద్ (గూఢచారి ప్రతినిధి) హైద్రాబాద్ లోని హిమయత్నగర్ లో ఉన్న శ్రీ కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం ఆఫీసు నుండి రికార్డుల బీరువాను ఈ నెల 17 న ఓ ఆర్య వైశ్య పెద్ద నాయకుడి అనుచారులు దౌర్జన్యంగా లాకెళ్ళినట్లు సమాచారం. అంతే గాకుండా ఈ రోజు అడహాక్ కమిటీ కో ఆర్డినేటర్ ఛాంబర్ కు కూడా సదరు అనుచరులు తాళం వేసినట్లు తెలిసింది. ఈ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య సత్రం కాశీ లో రిజిస్ట్రేషన్ అయ్యి పలు ప్రాంతాల్లో వసతి అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నది. కాశిలో, తిరుపతి లో , షిరిడీ, హరిద్వార్లో ఇలా పలు ప్రాంతాల్లో ఆర్యవైశ్య భక్తులకు వసతి అన్న దానాలు కల్పిస్తుంది. ఈ శత్రానికి 11వేల 156 నుండి 50156 రూపాయల వరకు చందాలు చెల్లించిన దాతలు దాదాపు 28 వేల మంది సభ్యులు ఉన్నారు. ఈ సత్రానికి పలుకారణలతో 2012 తరువాత ఎన్నికలు జరుగలేదు. ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం అయ్యే సమయానికి పలు అంతరాలు

నల్గొండ ప్రజల కోసం టీం వర్క్ చేద్దాం - నూతన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపు

Image
  @ నల్గొండ ప్రజల కోసం టీం వర్క్ చేద్దాం  @ వచ్చే సోమవారం నుండి జిల్లా స్థాయిలో నిర్వహించినట్లుగానే మండల స్థాయిలో ప్రజావాణి  @ మండల స్థాయిలో పాలనను పటిష్టం చేద్దాం  @ ప్రజల అన్ని రకాల సమస్యలను తీర్చేందుకు ముందు ఉందాం- నూతన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపు          ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, సిబ్బంది అందరూ కలిసి ఒక బృందంగా పనిచేద్దామని నూతన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.          మంగళవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారుల తో సమావేశం అయ్యారు        రెవెన్యూ అంశాలతో పాటు, ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు చొరవ చూపించాలని అన్నారు .ప్రజల సమస్యల పరిష్కారంలో వారికి నమ్మకాన్ని, భరోసాను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేకించి పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులన్నింటిని రానున్న 15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకుగాను మండల స్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి వరకు అధికారులు సిబ్బంది ఒక బృందంగా పని చేద్దామని చెప్పారు.           ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో

నల్గొండ ఎస్పీ గా శరత్ చంద్ర పవార్

Image
నల్గొండ ఎస్పీ గా శరత్  చంద్ర పవార్ తెలంగాణా IPS బదిలీలు ఈ లింక్ ఓపెన్ చేసి  ఎవరు ఎక్కడ పోస్టింగ్ చూడొచ్చు https://drive.google.com/file/d/14mrlqgRvwITqgJdASEzfKa7oyFb_Abjv/view?usp=drivesdk

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఓ మహిళ ఆత్మహత్యాయత్నం

Image
 Women tried to jump from Cable Bridge... Madhapur Police Saved her.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఓ మహిళ ఆత్మహత్యాయత్నం కేబుల్ బ్రిడ్జి పై నుండి దుర్గం చెరువులోకి దూకడానికి యత్నించిన మహిళను కాపాడిన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు. పోలీస్ వాహనంలో స్థానిక హాస్పిటల్ కు తరలింపు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గారెంటీలు వెంటనే అమలు చేయాలి పాలడుగు ప్రభావతి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.

Image
  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గారెంటీలు వెంటనే అమలు చేయాలి పాలడుగు ప్రభావతి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.     ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలైనా 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి అన్నారు ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అయిదువ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బస్సు గ్యాస్ వరకే పరిమితిని కాకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. ప్రజలకు అవసరమైన విద్యా వైద్యం ఉచితంగా అందించుటకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సమగ్రంగా సర్వేలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కార్యక్రమం రూపొందించినట్లు తెలియజేశారు. సమ భావన సంఘాల మహిళలకు అందాల్సిన పావలా వడ్డీ నేటికీ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు సమభావన సంఘాల మహిళలకు ప్రతి ఒక్కరికి ప

నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన సి.నారాయణరెడ్డి

Image
       నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా సి.నారాయణరెడ్డి ఆదివారం బాధ్యతలను స్వీకరించారు.      శనివారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేయగా నల్గొండ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న దాసరి హరిచందన బదిలీ ఆయ్యారు.ఆమె స్థానంలో నూతన జిల్లా కలెక్టర్ గా సి. నారాయణరెడ్డి నియమితులైన విషయం తెలిసిందే.        వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న ఆయన ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలను చేపట్టారు .      ముందుగా నల్గొండ జిల్లాకు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కి స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, నల్గొండ ఆర్డీవో రవి, స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.      అనంతరం నూతన కలెక్టర్ నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయనికి చేరుకోగానే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర,కలెక్టరేట్ ఏ ఓ మోతిలాల్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు .     నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలను స్వీకరించిన సంద