Posts

కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసి పోయిన చందంగా PCB RTI విభాగం అధికారుల తీరు!.

Image
 కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసి పోయిన చందంగా PCB RTI విభాగం అధికారుల తీరు! హైద్రాబాద్:  తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల తీరు కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసి పోయిన చందంగా ఉంది. పీసీబీ  వెబ్సైట్ లో ఆర్టీఐ మెనూ లో పాత సమాచారాన్ని మార్చకుండా ఉంచారని pio మీద ఫిర్యాదు రావడం తో అసలు సమాచారాన్ని అప్డేట్ చేయకుండా ఆ సమాచారాన్ని తొలగించారు. 2019 లో వర్క్ allocation సమాచారం ఉందని, ఆర్టీఐ ఆక్ట్ సెక్షన్ 4(1)(బి)xvii ప్రకారం ప్రతి ఏడాది అప్డేట్ చేసి పబ్లిష్ చేసి వెబ్సైట్ లో పెట్టించడం లో pio విధి నిర్వహణలో విఫలం చెందారని ఫిర్యాదు రావడం తో కొత్త సమాచారాన్ని అప్డేట్ చేయకుండా వర్క్ allocation సమాచారం డెలీట్ చేసి కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసి పోయిన చందంగా పీసీబీ సమాచార హక్కు విభాగం అధికారుల వ్యవహరించిన తీరు.

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్

Image
  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్ మహబూబ్నగర్:  ఆర్యవైశ్యుల శ్రేయస్సు నా ఆశయం కొత్తవారికి అవకాశం కల్పించడం మా ఉద్యమం అంటూవనపర్తి జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు గద్వాల జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు నారాయణపేట జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు రాష్ట్ర నాయకులు మండల పట్టణ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. ఆమరవాది లక్ష్మీనారాయణ మహాసభ నుండి దిగి కొత్త వారికి అవకాశం కల్పించాలని తీర్మానం చేశారు ఈ సమావేశానికి సుమారు 200 మంది ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ పట్టణం వైశ్య హాస్టల్ ల్లో  ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు ఆధ్వర్యంలో మిడిదొడ్డి శ్యామ్ సమక్షంలో సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంటనే దిగి మరియొక కొత్త వ్యక్తికి అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలని  కోరిన నాయకులు. ఆర్యవైశ్య మ...

దేవాదాయశాఖలో కారణ్య నియామాకాలలో గోల్ మాల్

Image
 ****ఇంత కారుణ్యమేల*  దేవాదాయశాఖలో కారణ్య నియామాకాలలో గోల్ మాల్ - #సర్వీస్ రూల్స్కు విరుద్దంగా పోస్టింగులు #ఆలయ ఉద్యోగ వారసులకు అన్యాయం -కార్యాలయం సిబ్బంది కుటుంబసభ్యులు పెద్దపీట : #ప్రొబేషనరీ పీరియడ్ కాలంలో అర్హత పరీక్షలు ఉతీర్ణత కాకున్నకొనసాగింపు  #విచారణ చేపట్టాలని ఆలయ ఉద్యోగుల డిమాండ్*  * తెలంగాణ దేవాదాయ శాఖలో కారుణ్య నియామాకాలు చర్చనీయాంశంగా మారింది. ఇంటి పెద్ద దిక్కుగా ఉండే ఉద్యోగి చనిపోతే వారిపై ఆధారపడిన అర్హులకు కొలువు ఇవ్వడం పద్దతే. దేవాదాయ శాఖ నిబంధనల్లో ఇదోక భాగమే దీన్ని మానవీయ కోణంలో ఎవ్వరూ వ్యతిరేకించడం లేదు, అయితే ఇందులో వ్యవహరిస్తున్న తీరే అయోమయంగా మారింది. కారుణ్య నియామాకాలలో అనుకూలరుకు ఒక విధంగా... ఇతరులకు మరో విధంగా పోస్టింగ్లు ఇవ్వడం వివాదస్పదంగా మారింది, దేవాలయ ఉద్యోగులు మృతి చెందింతే ఒక తీరుగా, కార్యాలయ సిబ్బంది ఉద్యోగుల వారసులకు మరో విధంగా కారుణ్య నియామాకాలలో పక్షపాత దోరణి అవలంభిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఆలయ ఉద్యోగుల వారసులు ఈఓ గ్రేడ్-3 రావాలంటే సుమారు 20 ఏళ్లుగా పేగా వేచి ఉండాల్సి ఉండగా కార్యాలయ ఉద్యోగులకు మాత్రం నేరుగా కట్టబేడుతున్నారు. ...

కాంగ్రెస్ డిఎన్ఏ లోనే హిందూ వ్యతిరేకత..! - పగుడాకుల బాలస్వామి

Image
 కాంగ్రెస్ డిఎన్ఏ లోనే హిందూ వ్యతిరేకత..! - పగుడాకుల బాలస్వామి రాజ్యాంగాన్ని చేతబట్టి (ప్రదర్శిస్తూ) ఎంపీగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రమాణం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే దాని విలువలను విస్మరించడం రాజ్యాంగం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. "జై సంవిధాన్- జైహింద్" అని చేసిన నినాదాలు హిందూ వ్యతిరేకతను ప్రతిధ్వనించాయి. కులమతాలకు అతీతంగా, సర్వ మానవ శ్రేయస్సు కోసం పనిచేస్తానని జూన్ 25న ప్రమాణం చేసిన రాహుల్ గాంధీ.. జూలై 1న హిందూ సమాజంపై విషం చిమ్మడం రాజ్యాంగ విలువలకే అవమానం. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల "కుటుంబ ప్రతినిధి"గా రాజకీయాల్లో రాణిస్తున్న రాహుల్ గాంధీ.. ఈ దేశ మెజార్టీ ప్రజలపై, వారి విశ్వాసాలపై మాటల తూటాలతో దాడులకు తెగబడడం అప్రజాస్వామికం. "హిందువులు హింసావాదులు.. విధ్వంస కారులు.. కుట్ర దారులు" అంటూ నిరాధార ఆరోపణలు చేయడం అలౌకికం.!  భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్న హిందుత్వంపై హింసవాదులుగా, విధ్వంసకారులుగా ముద్ర వేయడం మూర్ఖత్వం. సాటిలేని దేశ సమగ్రతకు, పరంపరకు రాహుల్ వ్యాఖ...

20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన ఏస్ ఐ, జర్నలిస్టు

Image
 20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన ఏస్ ఐ, జర్నలిస్టు మెదక్ జిల్లా: (గూఢచారి ప్రతినిధి) రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన హవేలి ఘన్ పోలీసు స్టేషన్ ఎస్ ఐ ఆనంద్, జర్నలిస్టు మహ్మద్ మస్తాన్ అరెస్టు. మెదక్ జిల్లా, కొలిగడ్డకు చెందిన పూల గంగాధర్ నుండి కామారెడ్డి జిల్లా కు చెందిన జర్నలిస్టు మహ్మద్ మస్తాన్ ద్వారా 20 వేలు లంచం డిమాండ్ చేసి అంగీకరించిన చిక్కిన హవేలి ఘన్ పోలీసు స్టేషన్ ఎస్ ఐ   ఆనంద్.  ఫిర్యాదు దారు యొక్క టిప్పర్ వాహనము పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేయుట కొరకు లంచం డిమాండ్ చేసి జర్నలిస్టు మహ్మద్ మస్తాన్ ద్వారా 20 వేలు లంచం డిమాండ్ చేసి అంగీకరించంచిన ఎస్ ఆనంద్, లంచం డబ్బులు జర్నలిస్టు మహ్మద్ మస్తాన్ నుండి స్వాధీన పరుచుకొని ఇద్దరని అరెస్టు చేసి ఏసీబీ జడ్జి ముందు హాజరు పరిచామని, కేసు విచారణలో ఉందని తెలిపిన ఏసీబీ అధికారులు.  ఎవరైనా ప్రభుత్వ అధికారి, ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 ద్వారా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని, లంచం డిమాండ్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఘనంగా జడ కొప్పు కోలాట ప్రదర్శన ముగింపు కార్యక్రమం

Image
 *ఘనంగా జడ కొప్పు కోలాట ప్రదర్శన ముగింపు కార్యక్రమం* నల్లగొండ పట్టణం వీటి కాలనీ కాకతీయ కాలేజ్ గ్రౌండ్ ఘనంగా జడ కొప్పు కోలాటం ప్రదర్శన*నిర్వహించడం జరిగింది. గత 40 రోజుల నుండి 50 మంది మహిళలు మాస్టర్ తోగొటీ రమేష్ చారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పూర్తి అయిన తర్వాత, ఆదివారం సాయంత్రం ఘనంగా జడ కొప్పు కోలాట ప్రదర్శన ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మహిళలకు చీరలు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో 33 వ వార్డు కౌన్సిలర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ మహిళలు కోలాటం నేర్చుకోవడం వలన శారీరకంగా మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు, ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా నేర్పించిన రమేష్ మాస్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు, ఇటువంటి శిక్షణా తరగతులు మరిన్ని నిర్వహించాలని వారు కోరారు. స్థానిక నాయకులు రేగట్టే లింగస్వామి సహకారంతో కోలాటం బృందం సభ్యుల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేసుకోకలిగామని తోగోటి రమేష్ చారి అన్నారు. ఈనెల 15వ తేదీ నుండి కాకతీయ కాలేజ్ మైదానంలో మరొక ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు ఈ అవకాశాన్...

యునెస్కో గుర్తింపులో మన గొంగడి ఉండడం గర్వకారణం : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

Image
 యునెస్కో గుర్తింపులో మన గొంగడి ఉండడం గర్వకారణం : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  యునెస్కో గుర్తింపులో మన రాష్ట్రానికి చెందిన మూడు వస్త్రాలు ఉండడం గర్వకారణమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి గొంగడితో సహాయ మంత్రికి సన్మానం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యునెస్కో గుర్తింపు పొందిన గొంగడి నేత కార్మికులకు శుభాకాంక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ద్వారా ఇతర రాష్ట్రాలకు వచ్చే మరమగ్గాలను మన రాష్ట్రానికి వచ్చేలాగా కృషి చేస్తానని గొంగడి నేత కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.మన రాష్ట్రం నుండి పురాతన వస్త్రంగా గొంగడి ఉన్నందుకు KRPS అధ్యక్షులు బింగి స్వామిని శాలువాతో సహాయ మంత్రి సన్మానించారు. నల్లగొర్రెల ఊలుతో నేసే గొంగళ్లు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని కురుమ ఇళ్లలో పురుడు పోసుకునే గొంగడి సామాజికవర్గం వారసత్వ సంప్రదాయంగా, కురుమల జీవితంలో అంతర్భాగంగా మారాయని. యునస్కో మన రాష్ట్రానికి చెందిన వస్త్రాన్ని గుర్తించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్న...