జిల్లా సర్వోత్తముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరం - రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ, (గూఢచారి) 15-8-2024 నల్గొండ జిల్లా సర్వోత్తముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సందేశం ఇస్తూ..... ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటలలోనే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను తమ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కకింద జిల్లాలో రెండు కోట్ల 27 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, ఇందుకు ఆర్టీసీ కి 98 కోట్ల 26 లక్షల రూపాయలు లబ్ధి పొందిందని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని 5 నుండి 10 లక్షల కు పెంచడం జరిగిందని, దీని ద్వార...