Posts

హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక

Image
 హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక హైద్రాబాద్ (గూడాచారి):  హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో తేది. 01-09-2024 ఆదివారం రోజున ఉ॥ 10 గం॥లకు వైశ్య హాస్టల్ ఆడిటోరియం, కాచీగూడ, హైదరాబాద్ నందు ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక నిర్వహించబడునని, అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్త తెలిపారు. వివాహము చేసుకోదలచిన అవివాహిత ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పై వధూవరుల పరిచయ వేదికలో పాల్గొని వారి జీవిత భాగస్వాములను ఎన్నుకోగలరని కోరుచున్నాము. ఈ కరపత్రాన్ని యితర వైశ్య సోదరులకిచ్చి ఎక్కువ మంది ఈ వేదికలో పాల్గొనుటకు దోహదమివ్వగలరని కోరుచున్నామని,  ముఖ్యఅతిధి గా: అమరవాది లక్ష్మీనారాయణ గుప్త తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రానున్నారని తెలిపారు. అధ్యక్షులు: సరాబు లక్ష్మణ్ గుప్త 25.9246575142 ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేషన్ : రేపాక వెంకటేశ్వర్లు 5.9848489118 ప్రధాన కార్యదర్శి : కటకం శివ కుమార్ గుప్త 5. 7396061945 అదనపు ప్రధాన కార్యదర్శి : కొక్కొళ్ళ సత్యం గుప్త సెల్ 9440832239 కోశాధికారి: లింగ ప్రకాష్ 5. 9848131815 సహాయ కోశాధికారి : చింతలఘట్ శ్రీరాం గుప్త సెల్ 98493618

చిన్న పత్రికల సమస్య లను రాష్ట్ర ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకెళ్దాం - టిఎస్ఎంఎన్ ఎం ఏ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు

Image
 చిన్న పత్రికల సమస్య లను రాష్ట్ర ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకెళ్దాం   టిఎస్ఎంఎన్ ఎం ఏ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు    రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో నిర్ణయం  ( హైదరాబాద్ )  చిన్న పత్రికల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మీడియా అకాడమీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేలా సమిష్టిగా కృషి చేద్దామని తెలంగాణ చిన్న మధ్య తరహా అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు అభిప్రాయపడ్డారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలే ఈ ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికల గ్రేడింగ్, పెండింగ్ బిల్లులు, అక్రిడి టేషన్ ల కేటాయింపు అంశాలను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. చిన్న పత్రికల ఎడిటర్లందరూ ఐక్యమత్యంతో ఉంటేనే సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సంద

Bhupathi-Times-e-paper-31-08-2024

Image
 Bhupathi-Times-e-paper-31-08-2024

బఫ్ఫార్ జోన్, FTL అంటే ఏంటి... హైడ్రా అంటే ఏమిటి? అక్కడ ఎందుకు కట్టడాలు కూలుస్తున్నారు*

Image
 *బఫ్ఫార్ జోన్, FTL అంటే ఏంటి... హైడ్రా అంటే ఏమిటి? అక్కడ ఎందుకు కట్టడాలు కూలుస్తున్నారు*  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు,కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగులపై హైడ్రా దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో బఫర్ జోన్, ఫ్టల్, హైడ్రా అనే పదాలు తరుచూ వార్తల్లో వినిపించడం తో పాటుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ బఫర్ జోన్ మరియు FTL అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం! *ఎఫ్‌టీఎల్(FTL) అంటే...* ఎఫ్‌టీఎల్ అనగా ఫుల్ ట్యాంక్ లెవల్. ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసి ఫుల్ ట్యాంక్ లెవల్ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో చెరువులో పూర్తిగా నీళ్లు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో ఎఫ్‌టీఎల్‌ తెలియజేస్తుంది. *బఫర్ జోన్* రెండూ లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. చెరువు లేదా ఏదైనా నీటి వనరు యెక్క పరిధిని బట్టి కొంత దూరం వరకు బఫర్ జోన్ ఉంటంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్‌టీఎల్ మరియు బఫర్ జోన్‌లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. బఫర్ జోన్ యెక్

సెల్ఫీ దిగబోతు జారి వేములపల్లి బ్రిడ్జి వద్ద కాలు జారి సాగర్ ఎడమ కాలువ లో పడిన మహిళ ను కాపాడిన స్థానికులు

Image
 సెల్ఫీ దిగబోతు జారి వేములపల్లి బ్రిడ్జి వద్ద కాలు జారి సాగర్ ఎడమ కాలువ లో పడిన మహిళ ను కాపాడిన స్థానికులు

Bhupathi-Times-e-paper-30-08-2024

Image
 Bhupathi-Times-e-paper-30-08-2024

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ని కో ఆపరేట్ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు

Image
 మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ని కో ఆపరేట్ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాస్ రాజు రూ. లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. దీంతో జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం లోని జిల్లా సహకార అధికారి కార్యాలయానికి అతడిని తరలించి తనిఖీలు నిర్వహిస్తున్నారు