ఓరుగంటి' ఉద్యమ స్ఫూర్తి మరువలేనిది - త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి
'ఓరుగంటి' ఉద్యమ స్ఫూర్తి మరువలేనిది - త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి నల్లగొండ, గూఢచారి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి బీజేపీ బలోపేతానికి ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన వ్యక్తి ఓరుగంటి రాము లు అని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్ లో నిర్వహించిన దివంగత బీజేపీ నేత ఓరుగంటి రాములు ప్రథమ వర్థంతి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా రాములు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ పాత, కొత్త అనే తేడా లేకుండా ప్రజా సమస్యలపై ఓరు గంటి రాములు ఢిల్లీలో కూడా ఆందోళన చేసిన వ్యక్తి అని కొనియాడారు. తాను ఎమ్మెల్యేగా, ఎంపీ గా పోటీ చేసినప్పుడు తన గెలుపు కోసం రాములు ఎంతగానో కృషి చేశారన్నారు. రాములు సంఘ్ కార్యకర్త నుంచి బీజేపీలో సీనియర్ లీడర్గా ఎదిగారని, ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి సఫలీకృతం కాకున్నా పార్టీని గ్రామగ్రామానికి తీసు కెళ్లాడన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ ఓరుగంటి రాములు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రజలు, ధర్మం, హిందూ సమాజ రక్షణ కోసం పాటుపడ్డారన...