కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ ) లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయండి - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ ) లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయండి - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ నల్గొండ. 12. 9. 2024 కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ ) లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కోరారు. గురువారం అయన తన చాంబర్లో 2023- 24 కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) పై రైస్ మిల్లర్లు ,పౌరసరఫరాలు, ఎఫ్ సి ఐ అధికారులతో సమీక్షించారు. 2023 -24 ఖరీఫ్ ,రబికి సంబంధించిన సీఎంఆర్ ను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు గడువు విధించిందని, అయితే గడువు చేరుకునేందుకు 18 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ఈ వారం, వచ్చేవారం సెలవులు ఉన్నందున సెలవు రోజుల్లో సైతం మిల్లర్లు, సిబ్బంది పనిచేసి సిఎంఆర్ లక్ష్యాన్ని సాధించాలని కోరారు. ముఖ్యంగా 2023 ఖరీఫ్ సి ఎం ఆర్ ఏ ఒక్క రేక్ పెండింగ్ లో లేకుండా ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని, రబి సీఎంఆర్ ను 30వ తేదీలోగా చెల్లించాలని కోరారు .ఇందుకు పౌరసరఫరాల అధికారులు ,సిబ్బంద...