Posts

Bhupathi-Times-e-paper-04-10-2024

Image
 Bhupathi-Times-e-paper-04-10-2024

సిఎంఆర్ కుంభకోణంపై సిబిసిఐడి విచారణ జరిపించాలి-సిపిఐ డిమాండ్

Image
  సిఎంఆర్ కుంభకోణంపై సిబిసిఐడి విచారణ జరిపించాలి-సిపిఐ డిమాండ్  ఖమ్మం, గూఢచారి: సిఎంఆర్ రైస్ కుంభకోణంపై సిబిసిఐడి విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఖమ్మం జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ గురువారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో సిఎంఆర్ రైస్ విషయంలో అధికారులు రైస్ మిల్లర్లు కుమ్మకై రూ. 400 కోట్ల ప్రజా ధనాన్ని మింగేశారని ఆయన ఆరోపించారు. లేవి విషయంలో ప్రతి ఏడాది వందల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకుని -ఎగవేతకు పాల్పడుతున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కవుతున్న ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంభిస్తుందని ప్రసాద్ తెలిపారు. సామాన్యుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించే -అధికార యంత్రాంగం మిల్లర్ల విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తుందని ప్రశ్నించారు. కొందరు మిల్లర్లు సంపన్నుల -విషయంలో ప్రభుత్వం సాగిల పడుతుందని వారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన పట్టించుకునే స్థితిలో లేదని ఆయన ఆరోపించారు. లేవి బియ్యం విషయంలో మిల్లర్లకు సానుకూలంగా పెద్ద మొత్తం ప్రజల ...

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన హీరో నాగార్జున

Image
  మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన హీరో నాగార్జున తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిందంటూ నాంపల్లి కోర్టులో క్రిమినల్ మరియు పరువు నష్టం కేసు వేసిన హీరో నాగార్జున.

సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలకు మహిళా కమిషన్ స్పందన..

Image
  సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలకు మహిళా కమిషన్ స్పందన.. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించాం తెలంగాణ మహిళాకమిషన్ కొండా సురేఖ భేషరతుగా వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు సమంతను కించపరచాలని అనుకోలేదని సురేఖ వివరణ ఇచ్చారు. సురేఖ క్షమాపణలు చెప్పకపోయి ఉంటే కమిషన్ స్పందించేది. ఈ వ్యవహారంలో కమిషన్ పాత్ర అవసరం లేదు. నాగార్జున కుటుంబం లీగల్ నోటీసు ఇచ్చే అంశం..పూర్తిగా వారి వ్యక్తిగతం! - తెలంగాణ మహిళా కమిషన్

ఈ రోజు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Image
  *ఈ రోజు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* నల్గొండ,(గూఢచారి), 3-10-2024  రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఈ రోజు 3 అక్టోబర్ ఉదయం 08.00 గంటలకు హైదరాబాద్, బంజారాహిల్స్ లోని గౌరవ మంత్రిగారి నివాసం నుంచి నల్గొండ బయలుదేరుతారు. * ఉదయం 10 గంటలకు నల్గొండ పట్టణంలోని 16 వ వార్డులో రూ. 75.00 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న చంద్రగిరి విల్లాస్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు.  * 16వ వార్డులోనే 20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న యం.ఎన్.ఆర్ గార్డెన్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. * అనంతరం 10.30 గంటలకు ప్రకాశం బజార్ లో 95 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మటన్ మార్కెట్ భవన ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు. * తదుపరి 35 లక్షల వ్యయంతో ఏ.ఆర్.నగర్ లో  నిర్మిస్తున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. * ఉదయం 11.30 గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. * అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు శ్రీనగర్ కాలనీలోని గౌరవ మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. * సాయంత్రం 05.00 గంటలకు నల్గొ...

పల్లిపాడు యువతికి DSC లో 59 వ ర్యాంక్

Image
  పల్లిపాడు యువతికి DSC లో 59 వ ర్యాంక్ ఖమ్మం, (గూఢచారి): పల్లిపాడు గ్రామానికి చెందిన బక్కా లావణ్య w /o. సురేష్ (పంచాయితీ సెక్రెటరీ), కు ఇటీవల విడుదల చేసిన DSC ఫలితాలలో SGT open కేటగిరిలో జిల్లాలో (59) వ ర్యాంప్ se కేటగిరిలో 6వ ర్యాంక్ సాధించి, పల్లపాడు యువతి ఆదర్శంగా నిలిచారు. ఇట్టి విజయంలో తన తల్లి దండ్రులు, భర్త సహకారం మరువలేనిదని, లావణ్య పేర్కొన్నారు. ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం నాకు దేవుడు ఇచ్చిన వరం అని, ఇట్టి అవకాశాన్ని వినియోగించు కొని విద్యార్థులను భావి, భారత, పౌరులుగా తీర్చి దిద్దడంలో తన వంతు కృషి చేస్తానని ర్యాంకర్ లావణ్య పేర్కొన్నారు.

Bhupathi Times-e-paper--01-10-2024

Image
 Bhupathi Times-e-paper--01-10-2024