Posts

తెలంగాణ సంసృతి ప్రతీక బతుకమ్మ పండుగ - IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న

Image
 తెలంగాణ సంసృతి ప్రతీక బతుకమ్మ పండుగ - IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న  తెలంగాణ సంసృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భగా నాగోల్ లోని తన నివాసంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ మన బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం అని ఆయన అన్నారు. పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి, నిండు మనస్సుతో గౌరమ్మను కొలిచే నిండైన వేడుక మన బతుకమ్మ పండుగ సందర్భంగా ఆమె మహిళ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.

లడ్డు వివాదం లో విమర్శలకు కేంద్ర బిందువుగా నిలిచిన TTD EX EO ధర్మారెడ్డిని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు సత్కరించడంపై విమర్శల వెల్లువ

Image
  లడ్డు  వివాదం లో విమర్శలకు  కేంద్ర బిందువుగా నిలిచిన  TTD EX EO ధర్మారెడ్డిని  స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి  దేవస్థానం ధర్మకర్తలు సత్కరించడంపై విమర్శల వెల్లువ భువనగిరి, (గూఢచారి) ఇటీవల   తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం లో కేంద్ర  బిందువుగా నిలిచిన  తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి  యాదాద్రి జిల్లాలోని భువనగిరి  పరిధి లోని మానేపల్లి  హిల్స్ నిర్మించిన స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంనకు విచ్చేసిన సందర్భంగా  తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్   ఆఫీసర్  ధర్మారెడ్డి స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ కర్తలు,  ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి జ్యువెలర్స్ అధినేత మానేపల్లి రామారావు దంపతులతో  పాటు వారి కుమారుడు మానేపల్లి మురళీకృష్ణ వీరిని సాదరంగా  ఆహ్వానించి  ధర్మారెడ్డి నీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా  పలువురు ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు   మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విభాగంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  అప్పటి మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి ని  ఈ విధంగా సత్కరించడం   పై   విమర్శలు చేస్తున్

నా భార్య లంచగొండి.. వీడియో బయటపెట్టిన భర్త

Image
  *నా భార్య లంచగొండి.. వీడియో బయటపెట్టిన భర్త* హైద్రాబాద్, (గూఢచారి): లంచం డబ్బైనా సరే భార్య సంపాదించి తెస్తే దాంతో ఎంజాయ్ చేసేవారుంటారు... కానీ రంగారెడ్డి జిల్లా మణికొండలో మున్సిపల్ DEE దివ్య జ్యోతి భర్త మాత్రం అలా చేయలేదు... భార్య ప్రతి రోజూ లంచం తీసుకొని డబ్బు ఇంటికి తెస్తోందంటూ ఓ వీడియోను బయటపెట్టారు...  కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న రూ.80లక్షలు ఎక్కడెక్కడ దాచిందో చూపించాడు...  తొలుత లంచం మంచిది కాదంటూ చెప్పినా ఆమె తీరు మార్చుకోకపోవడంతో ఈ వ్యవహారాన్ని పబ్లిక్లో పెట్టాడు.

ACB News:: ఏసీబీ వలలో చిక్కిన పోలీస్ అధికారి

Image
ACB News:: ఏసీబీ వలలో చిక్కిన పోలీస్ అధికారి హైదరాబాద్, (గూఢచారి) : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరి ధిలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో (Medchal Police Station) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. మధు సూదన్ రావును (K. Madhu Sudan Rao)అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) (ACB) సోమవారం అరెస్టు చేసింది. ఫిర్యాదుదారు నుండి రూ. 50 వేలు బలవంతపు చర్య తీసు కోకుండా ఉండటానికి మరియు ఫిర్యాదు దారు మరియు అతని కస్టమర్ల మధ్య చెల్లింపు వివాదాన్ని పరి ష్కరించేందుకు లంచం కోరి నట్లు నివేదించబడింది.ఏసీబీకి చెందిన హైదరాబాద్ సిటీ రేంజ్-2 యూనిట్ (City Range-2 Unit) అతని నుంచి లంచం మొత్తా న్ని రికవరీ చేస్తూ ఆ అధికారిని పట్టుకుంది. రసాయన పరీక్షలో లంచం జాడలు ఉన్నట్లు నిర్ధారించారు, రావు కుడి చేతి వేళ్లు మరియు అతని ప్యాంటు వెనుక జేబులో రసాయన అవశేషాలు ఉన్నాయని పరీక్షించారు.

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం-ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Image
రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిల్మ్  పోటీలకు ఆహ్వానం -ఖమ్మం  పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని ఖమ్మం  పోలీస్ కమిషనరేట్ పరిధిలో  ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ మరియు అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ (పోలీస్ ఫ్లాగ్ డే) పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈనెల 21 న వారోత్సవాలు నిర్వహించబడుతాయని అన్నారు. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవల కాలంలో తీసిన (3) ఫోటోలు మరియు తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 20వ తేదీలోపు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను పోలీస్  పి ఆర్ వో  కు అందజేయాలన్నారు. ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు  అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన. ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల స

*భారత ఆహార సంస్థ లో స్వచ్చత కై ప్రత్యేక ప్రచార ఉద్యమం - 4.O*

Image
  *భారత ఆహార సంస్థ లో స్వచ్చత కై ప్రత్యేక ప్రచార ఉద్యమం - 4.O* నల్గొండ, (గూఢచారి):  ప్రభుత్వ కార్యాలయాలలో వ్యవస్థాపరంగా ‘స్వచ్ఛత’ను పాటించే కార్యక్రమంతో పాటు చాలా కాలంగా పెండింగు పడ్డ వ్యవహారాలను కనీస స్థాయికి పరిమితం చేయడానికి భారత ఆహార సంస్థ, ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ వారి ఆదేశాల మేరకు సంస్థ నల్గొండ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో ‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0’ అక్టోబర్ 31 వ తేదీ వరకు నిర్వహించబడుతుందని సంస్థ నల్గొండ ఇన్చార్జి డివిజనల్ మేనేజర్ హీరా సింగ్ రావత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0 ను రెండు దశల్లో ఆచరిస్తున్నారనీ, మొదటి దశ సన్నాహక దశ ను సెప్టెంబర్ 16 నుండి ప్రారంభించి అదే నెల 30న ముగించామనీ, రెండో దశ అయిన అమలు దశను మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ఈనెల 2న ప్రారంభించి ఈ నెల 31వరకు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.  అంతేకాక, ఈ కార్యక్రమంలో ముఖ్య అంశాలైన ఫైళ్ళ వర్గీకరణ, ఏరివేత, చరిత్రాత్మక రికార్డుల సంరక్షణ వంటి విషయాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంస్థాగత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులందరూ భాగ

bhupathitimes@epaper-06-10-2024

Image
 bhupathitimes@epaper-06-10-2024 https://drive.google.com/file/d/14R0JYNN1UoDWzUNHtXqYgZ2WD8e2jaDH/view?usp=drivesdk