భద్రతా కమీషన్ & పోలీసు కంప్లయింట్ అథారిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కి లేఖ వ్రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
రాష్ట్ర భద్రతా కమీషన్ & పోలీసు కంప్లయింట్ అథారిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కి లేఖ వ్రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ యధాతధంగా చదవండి గౌ// ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు అయ్యా ! పోలీసుశాఖలో సంస్కరణలు కావాలని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నో కమిటీలు సిఫారసు చేయగా చివరకు 2006 సంవత్సరంలో సుప్రీమ్‌కోర్టు వారు తీర్పు వెలువరిస్తూ ఆరు మార్గదర్శకాలు సూచించినారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర భద్రతా కమీషన్ ఏర్పాటు అలాగే పోలీసు కంప్లయింట్ అథారిటీ ఏర్పాటు . భద్రతా కమీషన్ పోలీసుశాఖ పనితీరును నిశితంగా సమీక్షించడమే కాక వారికి సరియైన సూచనలు, సలహాలు ఇస్తూ పోలీసుశాఖ వారు చట్ట ప్రకారము పనిచేసే విధంగా సహకరిస్తుంది. ఇక పోలీసు కంప్లయింట్ అథారిటీ, రాష్ట్ర మరియు జిల్లాలో పనిచేస్తుంది. రాష్ట్ర కంప్లయింట్ అథారిటీ విశ్రాంత హైకోర్టు జడ్జి ఆద్వర్యంలో ఐ.పి.ఎస్. అధికారులపై వచ్చిన ఆరోపణలను విచారిస్తుంది. అలాగే జిల్లా అథారిటీ విశ్రాంత జిల్లా జడ్జి ఆద్వర్యంలో డి.ఎస్.పి. మరియు క్రిందిస్థాయి అధికారులపై వచ్చే ఫిర్యాదులను...