Posts

చెక్కులు పంపిణీ చేసిన కాశి అన్నపూర్ణ సత్రం కార్యవర్గం & తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత

Image
 చెక్కులు పంపిణీ చేసిన కాశి అన్నపూర్ణ సత్రం కార్యవర్గం & తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత  హైద్రాబాద్: (గూఢచారి):  ఈరోజు హైదరాబాద్ కాశీ అన్నపూర్ణ సత్రం కార్యాలయంలో మెరిట్ స్టూడెంట్స్ కి పై చదువుల కోసం చెక్కులు పంపిణీ చేసిన కాశి అన్నపూర్ణ సత్రం కార్యవర్గం మరియు. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత. 

ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీస్‌లో నాగార్జున సందడి

Image
  ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీస్‌లో నాగార్జున సందడి హైదరాబాద్‌: ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) సందడి చేశారు. తన కొత్త కారు టయోటా లెక్సస్ (Toyota Lexus) రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేశారు.

మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
  మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త హైద్రాబాద్, (గూఢచారి): మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒకటే అని TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. అందరికీ విద్యను అందించేలా కృషిచేసిన మహానీయుడు, తత్వవేత్త, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా LB Nagar చౌరస్తా లో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది పూలే. సామాజిక ఉద్యమాల మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫూలే చదువు లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేనిదే పురోగతి లేదు అనే సత్యాన్ని గ్రహించి 19వ శతాబ్దపు తొలినాళ్లలో నిమ్న జాతుల కోసం, మహిళల కోసం దేశంలో మొదటిసారిగా పాఠశాలలను ఏర్పరిచిన మహనీయుడు జ్యోతి రావు ఫూలే. విద్యావ్యాప్తి ద్వారా కుల వివక్షతను, సాంఘిక దురాచారాలను, మూడనమ్మకాలను నిర్మూలించేందుకు కృషి చేశారు. కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా ...

కొత్తగూడెం జిల్లా అధికారులకు మంత్రి పొంగులేటి స్వీట్ వార్నింగ్ ...!

Image
 కొత్తగూడెం జిల్లా అధికారులకు మంత్రి పొంగులేటి స్వీట్ వార్నింగ్ ...! ఆఫీసర్స్ బీ అలర్ట్...! •⁠ ⁠విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు •⁠ ⁠కొత్తగూడెం జిల్లా అధికారులకు మంత్రి పొంగులేటి స్వీట్ వార్నింగ్ ...! •⁠ ⁠పలు శాఖల అధికారుల పనితీరు పై ఫిర్యాదులొస్తున్నాయ్ - పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరిక - సీఎస్ఆర్ నిధులు నిర్వీర్యం కాకుండా సీపీవో బాధ్యతయుతంగా వ్యవహరించాలి •⁠ ⁠పంచాయతీ సెక్రటరీలపై డీపీవో, ఎమ్మార్వోలపై ఆర్డీవో పర్యవేక్షణ తప్పనిసరి  •⁠ ⁠అన్ని శాఖల అధికారులను అడిషనల్ కలెక్టర్ సమన్వయం చేసుకోవాలి •⁠ ⁠కొత్తగూడెం జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావే శం

CM Revanth Reddy: కుల సర్వేలోభాగంగా వివరాలు నమోదు చేయించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Image
 CM Revanth Reddy: సర్వేలోభాగంగా వివరాలు నమోదు చేయించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైద్రాబాద్, (గూఢచారి):  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న ఎన్యుమరేటర్, అధికారులు.హాజరైన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, తదితరులు.  సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అధికారులను ఆరా తీసిన సీఎం.హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.వీలయినంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించిన సీఎం.

భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు -

Image
 భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు  హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుడిమాల్కాపూర్ లోని ఓ ఫర్నీచర్ గోదాములో గురువారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Revanth Reddy: విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాలి

Image
  Revanth Reddy: విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాలి * ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు*  *లేనివి ప్ర‌చారం చేస్తూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్న* వారిపై కఠిన చర్యలు Hydrabad, gudachari: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాల‌ని, వారికి ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అల‌క్ష్యానికి తావు ఇయ్యరాదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. * బడి పిల్లలకు అందించే ఆహారానికి సంబంధించి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఆగ్రహం వ్య‌క్తం చేసిన ముఖ్యమంత్రి ఈ విషయంలో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చ‌రించారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొల‌గించేందుకు కూడా వెనుకాడ‌బోమని స్ప‌ష్టం చేశారు. క‌లెక్ట‌ర్లు త‌ర‌చూ పాఠశాలలు, వ‌స‌తిగృహాలు, గురుకులాలను త‌నిఖీ చేసి, నివేదిక‌ల‌ను సమ‌ర్పించాల్సిందే అని ఆదేశిం...