Posts

ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కీ.శే. రోశయ్య కు ఘనంగా నివాళులు

Image
 ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కీ.శే. రోశయ్య కు ఘనంగా నివాళులు నల్గొండ, (గూఢచారి): డాక్టర్ కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ భవనంలో జరిగిన కార్యక్రమంలో రోశయ్య చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీశెట్టి శ్రీనివాస్, అదనపు ప్రధాన కార్యదర్శి నాళ్ళ వెంకటేశ్వర్లు. మహిళా విభాగ్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా సంఘ మాజీ అధ్యక్షుడు వీరేల్లి కృష్ణయ్య, మాజీ ప్రధాన కార్యదర్శులు కోటగిరి దైవదీనం, బుక్క ఈశ్వరయ్య, నాయకులు రేపాల భద్రాద్రి రాములు, వీరేల్లి సతీష్, బోనగిరి ప్రభాకర్, నాంపల్లి నర్సిహ్మ, నల్లగొండ అశోక్, నల్లగొండ శ్రీనివాస్, నల్లగొండ సంతోష్, వనమా రమేష్, నల్లగొండ సుమలత, కర్ణాటి వెంకటేశ్వర్లు, లకుమారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

ఈరోజు ఉదయం 7:27 గంటలకు తెలంగాణ లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం

Image
  ఖమ్మం  ఖానాపురం ఈరోజు ఉదయం 7:27 గంటలకు తెలంగాణ లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం *ఈరోజు ఉదయం 7:27 గంటలకు తెలంగాణ లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది: నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ* *EQ of M: 5.3, On: 04/12/2024 07:27:02 IST, Lat: 18.44 N, Long: 80.24 E, Depth: 40 Km, Location: Mulugu, Telangana.* *తెలంగాణ లో ములుగు కేంద్రముగా కంపించిన భూకంపం* *ముఖ్య స్తానం నుండి 225 కిలోమీటర్ల వరకు కనిపించిన ప్రభావం..* హైదరాబాద్, నల్గొండ, కృష్ణా, ఏలూరు, ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, మణుగురు, హన్మకొండ, విజయవాడలో భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిసింది. కొన్నిచోట్ల 2 సెకండ్లపాటూ ప్రకంపనలు రాగా.. కొన్నిచోట్ల 4 సెకండ్లపాటూ భూమి కంపించినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూ-ప్రకంపనలు వచ్చాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ములుగు కేంద్రంగా ఈ భూకంపం వచ్చింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఉదయం 7.27 గంటలకు ఈ భూకంపం వచ్చింది. ములుగులో భూకంప కేంద్రం? ఒక అంచనా ప్రకారం.. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైంది. భూకంప కేంద్రం ముల...

ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్

Image
  * ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ బ్రేకింగ్ పాయింట్స్* * పది రోజుల్లో ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణం * ర్యాంకుల పేరిట విద్యార్ధులను మానసిక ఒత్తిడికి గురిచేసే విధానాలను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మానుకోవాలి * విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న కాలేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. * విద్యార్ధులు అధైర్యపడి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని తల్లితండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని కోరిన మంత్రి * ఇంటర్ విద్యార్ధులకు ఏదైన అత్యవసర సమస్య ఉంటే నా ఆఫీసు మొబైల్ నెంబర్ ను 8688007954 లేదా minister.randbc@gmail.com ఈమెయిల్ కు తెలియజేయండి * చావు సమస్యకు అంతిమ పరిష్కారం కాదు - బ్రతికి సాధించాలని విద్యార్ధులకు మంత్రి పిలుపు

మూసి లో అక్రమంగా వ్యర్థాల పోసిన ఇష్యూ లో రుద్ర టెక్నాలజీస్ మూసివేత ఉత్తర్వును జారీ చేసిన TGPCB

Image
  మూసి లో అక్రమంగా వ్యర్థాల పోసిన ఇష్యూ లో రుద్ర టెక్నాలజీస్ మూసివేత ఉత్తర్వును జారీ చేసిన TGPCB    03.12.202. "ఈ విషయం పై ఓ ప్రకటన విడుదల చేసిన  టీజీపీసిబి  *ప్రకటన వివరాలు:*   26.11.2024 @ 1:30 AM న మూసీ నదిలోకి ట్యాంకర్ ట్యాంకర్ నంబర్ AP 28 TD 4699 ద్వారా అక్రమంగా వ్యర్ధాలను విడుదల చేస్తున్నప్పుడు లంగర్ హౌస్ నివాసితులు మూసీ నదిలో వ్యర్థాలను వదులుతుండగా పట్టుకున్నారు, బాపుఘాట్ బ్రిడ్జి, హైదర్‌గూడ, అత్తాపూర్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ (ఎం), ఎస్‌హెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు.    ఈ విషయమై ఎస్‌హెచ్‌ఓ, పిఎస్ రాజేంద్ర నగర్ సిఆర్.నెం.1157/2024 యు/ఎస్.280, 125 బిఎన్‌ఎస్ ద్వారా కేసు నమోదు చేశారు.   టిజిపిసిబి అధికారులు వ్యర్ధాలు వదిలిన ప్రాంతాన్ని పరిశీలించారు దాంతో బాటు బాపు ఘాట్ వంతెన సమీపంలో మూసీ నది పక్కన ఇసుక & కంకర మెటల్ ట్రేడింగ్ సైట్‌ను పరిశీలించారు ఆ ఆవరణలో లారీల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలం నుండి పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయడం చూశారు. మూసీ నదిలోకి పైప్‌లైన్ తో వ్యర్థాలను ట్యాంకర్లతో దాపరికంగా విడుదల చేస్తున్నారు అ...

ఘనంగా శ్రీకాంతాచారి 15వ వర్ధంతి

Image
 తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతిని ఈరోజు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.  నల్గొండ  పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో శ్రీకాంతాచారి విగ్రహానికి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముస్తాక్ హైమద్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను పెళ్లికి ఆహ్వానించిన ఉప్పల కుటుంబ సభ్యులు

Image
  తెలంగాణ గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ ను పెళ్లికి ఆహ్వానించిన ఉప్పల కుటుంబ సభ్యులు హైద్రాబాద్:  ఉప్పల శ్రీనివాస్ ఆయన పెద్ద కుమారుడు సాయి కిరణ్ వివాహ ఆహ్వాన పత్రికను కుటుంబ సభ్యులతో కలసి తెలంగాణ గౌరవ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి  అందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హిస్ ఎక్సలెన్సీ యొక్క దయతో ఆమోదం, ఆత్మీయ అభినందనలు మరియు ఆశీర్వాదాలకు మేం చాలా కృతజ్ఞులం అని అన్నారు.  

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జాతీయ కాలుష్య వ్యతిరేక దినోత్సవం

Image
 తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జాతీయ కాలుష్య వ్యతిరేక దినోత్సవం  * జాతీయ కాలుష్య నిరోధక దినోత్సవం: థీమ్: “అందరికీ స్వచ్ఛమైన గాలి* హైద్రాబాద్, డిసెంబర్ 2, 2024న, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) డాక్టర్ B.R.K.R. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ఆవరణలో జాతీయ కాలుష్య వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. కాలుష్యం, ఆరోగ్యం మరియు పర్యావరణంపై దాని దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది స్థిరమైన పరిష్కారాల వైపు సమిష్టి చర్యలలో సమాజాన్ని నిమగ్నం చేయడంపై కూడా దృష్టి సారించింది. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మరియు స్థిరమైన పర్యావరణ పద్ధతుల ప్రాముఖ్యతపై దృష్టి సారించే సెమినార్ ఉంది. పర్యావరణ శాస్త్రం, కాలుష్య నియంత్రణ మరియు ఆయుర్వేద రంగంలోని నిపుణులు తెలంగాణలోని ప్రస్తుత కాలుష్యంపై విలువైన అంతర్దృష్టులను పంచుకున్నారు. మరియు మానవ ఆరోగ్యం మరియు ప్రజా పరిశుభ్రతను కాపాడేందుకు కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు నిరోధించడానికి సాధ్యమైన వ్యూహాలను చర్చించారు.  విద్యార్థులు మరియు పర్యావరణ ఔత్సాహికులు కాలుష్య ని...