Posts

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కు ఘనంగా నివాళులు

Image
 అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కు ఘనంగా నివాళులు నల్గొండ:  అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం రామగిరి నందు వారికి పలువురు నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు తేలు కుంట్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మి శెట్టి శ్రీనివాస్,అదనపు ప్రధాన కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు,మాజీ అధ్యక్షులు వీరేల్లి కృష్ణయ్య, రేపాలా భద్రాద్రి రాములు, లకుమారపు శ్రీనివాస్, మీడియా చైర్మన్ సోమా చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని నాశనం చేస్తున్నారు - MLC కవిత కల్వకుంట్ల

Image
 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని నాశనం చేస్తున్నారు - MLC కవిత కల్వకుంట్ల *తెలంగాణ గుర్తింపును నిర్వీర్యం చేస్తున్నందుకు కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు,  సోనియా మరియు ప్రియాంక గాంధీ నుండి జవాబుదారీతనం డిమాండ్* *కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ‘కాంగ్రెస్ మాత’గా పిలవాలి: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల* *బతుకమ్మను, బీసీ వర్గాన్ని అవమానించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని BRS నాయకురాలు MLC K. కవిత డిమాండ్* *అసలు తెలంగాణ తల్లి ప్రతి గ్రామానికి చేరాలి: MLC K. కవిత* *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని నాశనం చేస్తున్నారు : MLC కవిత కల్వకుంట్ల* హైదరాబాద్, డిసెంబర్ 14 2024: తెలంగాణ సంప్రదాయాలు, పండుగలు, అస్తిత్వాన్ని అణగదొక్కుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంతోపాటు తెలంగాణ అహంక...

తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చడం పై తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం

Image
తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చడం పై తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం *నేడు తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం* *సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో ఉదయం  ప్రారంభంకానున్న సమావేశం* *రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు & బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమ కారులు మరియు ఎస్సీ , ఎస్టీ మరియు బీసీ సంఘాల నాయకులు* *తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చడం.. తెలంగాణ అధికారిక కార్యక్రమాల్లో విష సంస్కృతి తీసుకురావడం.. తెలంగాణ అస్తిత్వం పై దాడిని ముక్త కంఠంతో ఖండించడానికి ఏకం కానున్న తెలంగాణ సమాజం*

వాయు కాలుష్య నియంత్రణకు సమిష్టిగా ముందుకు పోవాలి - NCAP పై సమీక్ష లో పిలుపునిచ్చిన మంత్రి సురేఖ

Image
  వాయు కాలుష్య నియంత్రణకు సమిష్టిగా ముందుకు పోవాలి - NCAP పై సమీక్ష లో పిలుపునిచ్చిన మంత్రి సురేఖ  హైద్రాబాద్, డిసెంబర్ 13, (గూఢచారి) :  తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణకు చేపట్టే కార్యక్రమాలకు సంబంధిత అన్ని శాఖలు సహాయ, సహకారాలను అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సెక్రటేరియట్ లోని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) పై సుదీర్ఘ సమీక్షా సమావేశం జరిగింది.   ఈ సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, టిజి పిసిబి మెంబర్ సెక్రటరీ రవి, సిఈఈ రఘు, జెసిఈఎస్ సత్యనారాయణ, ఎస్ఈఎస్ డి. ప్రసాద్, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వ ప్రసాద్, నల్గొండ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, సిడిఎమ్ఎ జాయింట్ డైరక్టర్ సంధ్య, టిజిఈఆర్ టిసి ఈడి మునిశేఖర్, అగ్రికల్చర్ జెడి ఆశా కమారి,...

ఖమ్మం జిల్లా, జిల్లా ఖజానా కార్యాలయం, సీనియర్ అకౌంటెంట్ ACB నెట్‌లో

Image
   ఖమ్మం జిల్లా, జిల్లా ఖజానా కార్యాలయం, సీనియర్ అకౌంటెంట్ ACB నెట్‌లో   19-10-2024న, కట్ట నాగేశ్, సీనియర్ అకౌంటెంట్, జిల్లా ఖజానా కార్యాలయం, ఖమ్మం జిల్లా మీద ACB misconduct కేసు నమోదు చేసింది. అధికారిక అనుకూలత చూపించడానికి, అంటే RPS జీతం స్థిరీకరణ, సేవా పెన్షన్, గ్రాచ్యుటీ, పెంచిన కుటుంబ పెన్షన్, సాధారణ కుటుంబ పెన్షన్ బిల్లులు మరియు దాత గడువు మృతుల చెల్లింపులు, మొత్తం రూ. 3,92,960/- సంబంధిత బిల్లుల నుండి రూ. 40,000/- లంచం కోరాడు.బిల్ మొత్తం యొక్క 10% ను కమిషన్‌గా కోరాడు. అందువల్ల, తన విధిని తప్పుగా మరియు అవినీతిపరంగా నిర్వహించి, అన్యాయ ప్రయోజనం పొందాడు. సెక్యూరిటీ కారణాల వల్ల ఫిర్యాదుదారుల వివరాలు వెల్లడించడం లేదు. కట్ట నాగేశ్, సీనియర్ అకౌంటెంట్, జిల్లా ఖజానా కార్యాలయం, ఖమ్మం జిల్లా, అరెస్టు చేయబడ్డాడు. మరియు SPE & ACB కేసుల కోసం గౌరవనీయ III అదనపు సెషన్స్ జడ్జ్ వరంగల్ ముందు ప్రవేశ పెట్టారు., . కేసు విచారణలో ఉంది.   ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరినట్లయితే, ప్రజలు చట్టం ప్రకారం చర్య తీసుకోవడానికి ACB యొక్క టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారు...

సిపిఐ(ఎం) తోనే నగర సమస్యలు పరిష్కారం...

Image
 *సిపిఐ(ఎం) తోనే నగర సమస్యలు పరిష్కారం...*   నగర సమస్యలపై దశల వారి ఆందోళనలు  అర్హులైన వారందరికీ ఇండ్లు ,ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలి విలేకరుల సమావేశంలో సిపిఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్  ఖమ్మం నగరంలోని సమస్యలు సిపిఐ(ఎం) తోనే పరిష్కారాలు అవుతాయని , ప్రజలను భాగస్వాములను చేసి నగరంలో ప్రజా పోరాటాలు ఉదృతం చేస్తామని సిపిఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగర అభివృద్ధిలో సిపిఎం పాత్ర ఎంత ఉందని, చిర్రావూరి లక్ష్మీనరసయ్య దగ్గర నుండి నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది సిపిఎం మాత్రమేనని అన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో నగరంలోని నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పి కేవలం 3500 మందికి మాత్రమే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని, నగరంలో సుమారు 20వేల మంది వరకు అర్హులైన వారు ఉన్నారని, వారికి గత ప్రభుత్వం ఇండ్లు ఇవ్వాలేదని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో అర్హులైన నిరుపేద, మధ్యతరగ కుటుంబాలకు ఇండ్లు ,ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డు...

పుష్ప 2నిర్మాత లకు బెదిరింపులు...

Image
 పుష్ప 2నిర్మాత లకు బెదిరింపులు... పుష్ప సినిమా లో షెకావత్ పేరుతో ఉన్న క్యారెక్టర్ ని నెగిటివ్ గా చూపించి తమ క్షత్రియ వర్గాన్ని అవమానించారు అని క్షత్రియ కర్ణ సేన లీడర్ రాజ్ షేకవత్ ఆగ్రహం వ్యక్తం చేసారు, కర్ణి సైనుకుల్లారా సిద్ధంగా ఉండండి నిర్మాత ల పై దాడి చేద్దాం అని ఆయన పిలుపు ఇచ్చారు