Posts

అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Image
అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ:   అర్హత కలిగిన పేద జర్నలిస్టులందరికీ ఇల్లు స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక టీఎన్జీవోస్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా ఫోటోలు క్రీడా పోటీల్లో గెలుపొందిన జర్నలిస్టులకు బహుమతు ప్రధానం చేయడంతో పాటు, అర్హులైన జర్నలిస్టులకు ఐకాన్ ఆస్పత్రి సౌజన్యంతో 50 శాతం రాయితీతో కూడిన హెల్త్ కార్డులను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకాన్ ఆస్పత్రి సౌజన్యంతో 50% రాయితో కూడిన ఉచిత వైద్య సేవలను అందించడం అభినందనీయం అన్నారు. నల్లగొండ పట్టణంలో అర్హత కలిగిన జర్నలిస్టులకు గతంలో దివంగము దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాని సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు పట్టాల పంపిణీ ఆలస్యం జరుగుతుందన్నారు. ఇప్పటికే పట్టణంలో పేదలందరికీ ఇండ్లను ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని పేద విలే...

15 వేల లంచం తో దోరికిన అసిస్టెంట్ వెటరినరీ సర్జన్

Image
  15 వేల లంచం తో దోరికిన అసిస్టెంట్ వెటరినరీ సర్జన్ అదిలాబాద్:  డాక్టర్ రాథోడ్ రమేష్, అసిస్టెంట్ వెటరినరీ సర్జన్, వెటరినరీ హాస్పిటల్, ష్యాంపూర్, ఉత్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లాలోని ఫిర్యాదుదారు నుండి రూ.15,000/- లంచం డిమాండ్ చేసి, స్వీకరించినందుకు పట్టుబడ్డాడు ఫిర్యాదు దారుని తండ్రిఅదే హాస్పిటల్‌లో వెటరినరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నందున అక్టోబర్ & నవంబర్ -2023 నెలల Non-payment సర్టిఫికేట్లు జారీ చేయడానికి". లంచం డిమాండ్ చేశారు. గతం లో ఫిర్యాదుదారుని తండ్రి బదిలీకి సంబంధించిన LPC (లాస్ట్ పే సర్టిఫికేట్) జారీ చేయడానికి రూ.3000/- డిమాండ్ చేసి నిందిత అధికారి స్వీకరించాడు.

దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులర్పించిన TGPCB ఉద్యోగులు

Image
  దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులర్పించిన TGPCB ఉద్యోగులు హైద్రాబాద్:  అమరవీరుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) ఉద్యోగులు దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. గౌరవ సూచకంగా, జనవరి 30, 2025న ఉదయం 11:00 గంటలకు సనత్‌నగర్ ప్రధాన కార్యాలయంలో 2 నిమిషాల మౌనం పాటించారు. సభ్య కార్యదర్శి జి రవి ఉద్యోగులు మరియు సిబ్బంది సమావేశమై దేశం కోసం ప్రాణాలను అర్పించిన ధైర్య అమరవీరులకు నివాళులర్పించా రు.  

తెలంగాణ , ఏపీల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్

Image
  తెలంగాణ , ఏపీల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కానుంది.

ఇందిర‌మ్మ ఇళ్ళ నిర్మాణంలో 2004-14 వ‌ర‌కు జ‌రిగిన అవినీతిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించండి - ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వర్నెన్స్‌

Image
ఇందిర‌మ్మ ఇళ్ళ నిర్మాణంలో 2004-14 వ‌ర‌కు జ‌రిగిన అవినీతిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించండి - ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వర్నెన్స్‌ లేఖ యధాతధంగా గౌ// ముఖ్య‌మంత్రి గారు తెలంగాణ రాష్ట్రం హైద‌రాబాదు అయ్యా ! పేద‌ల‌కు ఇళ్ళు క‌ట్టించి ఇవ్వ‌డానికి 2004 సంవ‌త్స‌ర‌ములో పెద్ద ఎత్తున ఇందిర‌మ్మ ఇళ్ళు కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం జ‌రిగింది. అందులో భాగంగా 2004 నుంచి 2014 వ‌ర‌కు 33.4 ల‌క్ష‌ల ఇళ్ళ‌ను మంజూరు చేసినారు. అయితే ఈ కార్య‌క్ర‌మం మంచి ఉద్ద్యేశ్యంతో చేప‌ట్టిన అధికారులు, రాజ‌కీయ నాయ‌కులు చివ‌ర‌కు ల‌బ్ధిదారులు కుమ్మ‌క్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డారు. మొత్త‌ము 33.4 ల‌క్ష‌ల ఇళ్ళు మంజూరు అవ్వ‌గా దానిలో 20.49 ల‌క్ష‌లు పూర్తి అయిన‌ట్లు చూపించినారు, కాని అందులో కూడ‌ కొన్ని ప‌నులు మొద‌లుపెట్ట‌లేదు. ఇంకా కొన్ని స‌గ‌ము వ‌ర‌కు ప‌ని జ‌రిగి ఆగిపోయినాయి. ఇంకా కొన్ని ఇళ్ళు నిర్మాణ‌ము జ‌ర‌గ‌కున్నానిర్మాణ‌ము జ‌రిగిన‌ట్లు, కొన్ని సంద‌ర్భాల‌లో ఎప్పుడో క‌ట్టిన ఇల్లు కూడ కొత్త‌గా క‌ట్టిన‌ట్లు చూపించి డబ్బులు చెల్లించినారు. దీనికి స్థానిక రాజ‌కీయ‌నాయ‌కులు స‌హాయ స‌హ‌కారాలు ఇవ్వ‌డం జ‌రిగింది. ఈవి...

తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిచే PCB ఉద్యోగుల సంఘం డైరీ విడుదల

Image
 తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిచే PCB ఉద్యోగుల సంఘం డైరీ విడుదల   హైద్రాబాద్:  ఈ రోజు 28.01.2025 (మంగళవారం) తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీమతి A. శాంతి కుమారి, తన కార్యాలయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (TGPCB) ఉద్యోగుల సంఘం డైరీ 2025 ను అధికారికంగా విడుదల చేశారు.  TGPCB ఉద్యోగుల సంఘం డైరీ 2025 ఉద్యోగులకు ముఖ్యమైన వనరు గా పనిచేస్తుంది, ఇందులో ముఖ్యమైన తేదీలు, అంతర్గత సంఘటనలు, విధాన నవీకరణలు మరియు రాష్ట్ర పర్యావరణ రక్షణ మరియు కాలుష్య నియంత్రణ చర్యలలో వారి పాత్రలకు సంబంధించి కీలక సమాచారం ఉన్నాయి. TGPCB ఉద్యోగుల సంఘం డైరీ 2025 సంస్థ యొక్క విజయాలను, ముఖ్యమైన మైలురాళ్లను మరియు తెలంగాణలో కాలుష్య సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉద్యోగులను మార్గనిర్దేశం చేసే కొనసాగుతున్న కార్యక్రమాలను హైలైట్ చేస్తుంది. సంఘం అధ్యక్షుడు శ్రీవత్సవ్ TGPCB సంఘం డైరీని విడుదల చేసినందుకు ముఖ్య కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సంఘం అధ్యక్షుడు శ్రీవత్సవ్, ప్రధాన కార్యదర్శి డి.కృపానంద్, సంయుక్త కార్యదర్శి కుమారి సుమతి జగన్నాధ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి స్వప్న, సాంస్కృ...

మందకృష్ణ ధర్మ పోరాటానికి KRPS సంపూర్ణ మద్దతు : బింగి స్వామి కురుమ

Image
 మందకృష్ణ ధర్మ పోరాటానికి KRPS సంపూర్ణ మద్దతు : బింగి స్వామి కురుమ  కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు  కురుమలు అధిక సంఖ్యలో ఉన్న సమాజంలో నష్టపోయాం  కురుమల పోరాటానికి కే ఆర్ పి ఎస్ మద్దతు కావాలి  కురుమ ఎమ్మెల్యే కురుమ ఎమ్మెల్సీ కూడా గొల్ల కురుమనే అంటున్నారు ఇంకా గుర్తింపు రాకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి స్వయంకృతాభిరాధం జర్నలిస్టులు కళాకారులు రాజకీయ నాయకులు గొల్ల కురుమ అనడం వల్లనే నష్టాన్ని పూడ్చలేకపోతున్నామని  ఫిబ్రవరి 7న జరిగే వెయ్యి గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమానికి కురుమ డొల్ల గొంతుల మద్దతు ఉంటుందని కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసా జహంగీర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి గొంగడితో సన్మానం చేసి డోల్ల చప్పుడుతో మద్దతు తెలిపారు. మాదిగలకు జరిగిన అన్యాయమే తిరుమలకు జరుగుతుందని గొల్ల కురుమల మధ్య ఇలాంటి వివాదం నడుస్తుందన్నారు రాజకీయాలకు చెందుతున్నది కురుమల పేరు చెప్పుకొని గొల్లలు నడుపుతున్నరన్నారు. మందకృష్ణ చేస్తున్న పోరాటానికి మద్దతుడుతున్నట్టు సమాజ హితం క...