శ్యాంసుందర్ కే నల్లగొండ ఆర్యవైశ్యుల మద్దతు

శ్యాంసుందర్ కే నల్లగొండ ఆర్యవైశ్యుల మద్దతు నల్లగొండ ( గూఢచారి) : తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్య కమిటీ చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్ కు నల్గొండ నాయకులు మద్దతు ప్రకటించారు. మంగళవారం నల్గొండ కు మద్దతు కోరుతూ వచ్చిన సందర్భంగా స్థానిక వాసవి భవన్ లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన, మార్పు కోసం రాబోయే రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనకు జిల్లా ఆర్య వైశ్యులతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను కలిసి మద్దతు కోరారు. దీనికి ప్రతిస్పందనగా, నాయకులు, కౌన్సిల్ సభ్యులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ, రాష్ట్ర మహాసభలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని, బైలాను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర మహాసభలో మెరుగైన పరిపాలన కోసం మార్పు అవసరమన్నారు. ఈ సందర్భంగా మిడిదొడ్డి శ్యాంసుందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారం, మెరుగైన ఆరోగ్య, విద్యా అవకాశాల కోసం తన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. మహాసభ అధ్యక్షునిగా పోటీ చేయడంలో తన ఉద్దేశం సమాజ సేవేనని, ఆర్యవైశ్య...