కోర్టు ఉత్తర్వులు ప్రకారం మహాసభ ఎన్నికల ప్రక్రియను యథాతథ స్థితిలో ఉంచినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి

కోర్టు ఉత్తర్వులు ప్రకారం మహాసభ ఎన్నికల ప్రక్రియను యథాతథ స్థితిలో ఉంచినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి హైద్రాబాద్: ప్రణవ్ మునిగెల, అడ్వొకేట్ తేది 17-2-2025 రోజున ఎ.వెంకటేశం, s/0. లక్ష్మీనారాయణ, షాద్ నగర్ వారు 3 వ అడీషనల్ చీఫ్ జడ్జ్, సిటి సివిల్ కోర్టు, హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియ గురించి కేసు I.A.253 of 2025 In O.O.P. No.6 of 2025 వేసినాడని, అట్టి కేసులో కోర్టు స్టేటస్కో ఉత్తర్వులు జారీ చేసినదని, ఆ ఉత్తర్వులు కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఉన్నాయని, సదరు ఉత్తర్వుల కాపీని మాకు ఈరోజు అందజేసి, ఇట్టి ఎన్నికల ప్రక్రియను యథాతథ స్థితిలో ఉంచాలని కోరినందున, మేము ఇట్టి ఎన్నికల ప్రక్రియను యథాతథ స్థితిలో ఉంచినాము. తదుపరి ప్రక్రియ తెలియజేయగలమని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల తోడుపునూరి చంద్రపాల్ ప్రకటించారు.