Posts

ఆరోగ్య కేంద్రాన్ని & సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

Image
   ఆరోగ్య కేంద్రాన్ని & సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నల్లగొండ జిల్లా:  @ నార్కెట్ పల్లి మండలం, అక్కనపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మకంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. @ ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన మెడికల్ అధికారి డాక్టర్ వరూధినికి సోకాజ్ నోటిస్ జారీ  @ అనుమతి లేకుండా విధులకు గైర్ హాజరైతే చర్యలు తప్పవు. మరోసారి హెచ్చరించిన జిల్లా కలెక్టర్       నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం నార్కెట్ పల్లి మండలం, అక్కనపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది హాజరు రిజిస్టర్ ను,మందుల స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు.  తనిఖీ సందర్భంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వరూధిని ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైనట్లు సిబ్బంది ద్వారా ఆమె నిర్ధారించుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరు విధులకు గైర్ హాజరు కావద్దని జిల్లా యంత్రాంగం...

ACB నెట్ లో హెడ్మాస్టర్

Image
  ACB నెట్ లో హెడ్మాస్టర్ భద్రాద్రి కొత్తగూడెం,  ఫిబ్రవరి 28,  (గూఢచారి): కొత్తగూడెం పట్టణంలోని కూలీ లైన్ హైస్కూల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడినట్లు ఏసీబీ DSP వై.రమేష్ తెలిపారు. కరాటే శిక్షణ పాఠశాలకు రూ.30 వేలు మంజూరు అయ్యాయి. ఇన్ స్ట్రక్చర్ కు కావలసిన రూ.30 వేలలో రూ.20వేలు డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీ ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడిని నిర్వహించినట్లు డి.ఎస్.పి పేర్కొన్నారు

మెట్రో రైల్ ఫేజ్‌-II కు అనుమతించాలని ప్ర‌ధాన‌మంత్రి కి విజ్ఞ‌ప్తి చేసిన సిఎం ఎ. రేవంత్ రెడ్డి

Image
 హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో మెట్రో రైలు సౌక‌ర్యం అన్ని ప్రాంతాల‌కు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్‌-IIకు  అనుమతించాలని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞ‌ప్తి చేశారు. గ‌త ప్ర‌భుత్వం ప‌దేళ్లుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో మెట్రో విస్త‌ర‌ణ‌పై దృష్టి సారించ‌లేద‌ని ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు.  * హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫేజ్‌-II కింద రూ.24,269 కోట్ల అంచ‌నా వ్యయంతో 76.4 కి.మీ పొడ‌వైన 5 కారిడార్ల‌ను ప్ర‌తిపాదించామ‌ని వివ‌రించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గతో కలిసి ముఖ్య‌మంత్రి  న‌రేంద్ర మోదీ ని వారి నివాసంలో స‌మావేశ‌మయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. * రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగంలో ఇప్ప‌టికే 90 శాతం భూ సేక‌ర‌ణ పూర్త‌యినందున ద‌క్షిణ భాగాన్ని వెంట‌నే మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి ని కోరారు. ఉత్త‌ర భాగంతో పాటే ద‌క్షిణ భాగం పూర్త‌యితే ఆర్ఆర్ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగ‌ల‌మ‌న్నారు. ద‌క్షిణ భాగం భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యంలో 50 శాతం భ‌రించేందుకు ...

అనిశా అధికారులకు పట్టుబడిన ప్రోహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్

Image
 అనిశా అధికారులకు పట్టుబడిన ప్రోహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్.. కల్లు అమ్మడానికి లైసెన్స్ గల చోట అక్రమంగా కల్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదు దారుని నుండి రూ.10,000/- రూపాయలు లంచం తీసుకుంటూ 25 ఫిబ్రవరి 2025 నాడు తెలంగాణ అవినీతి నిరోధక శాఖాధికారు లకు పట్టుబడిన నిర్మల్ జిల్లా భైంసా మండలం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ పోలీసు స్టేషన్ లోని సబ్-ఇన్స్పెక్టర్ పాటిల్ నిర్మల మరియు కానిస్టేబుల్ సాలికె సుజాత. “లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

ఆర్య‌వైశ్య మ‌హాస‌భ ఎన్నిక‌ల లో అక్ర‌మాల‌కు ప్ర‌భుత్వం చెక్‌

Image
 ఆర్య‌వైశ్య మ‌హాస‌భ ఎన్నిక‌ల లో అక్ర‌మాల‌కు ప్ర‌భుత్వం చెక్‌* *నిష్పాక్షికంగా ఆర్య‌వైశ్య మ‌హాస‌భ ఎన్నిక‌లు* *ఆర్య‌వైశ్య మ‌హాస‌భ ఎన్నిక‌ల లో అక్ర‌మాల‌కు ప్ర‌భుత్వం చెక్‌* *ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు*  హైద్రాబాద్, గూఢచారి:  తెలంగాణ రాష్ట్ర ఆర్య‌వైశ్య మ‌హాస‌భ ( రిజి. నెం.363/2015) ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని వ‌చ్చిన ఫిర్యాదుల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించింది.    ఎలాంటి అక్ర‌మాల‌కు తావులేకుండా ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ నుంచి ముగ్గురు ఉన్న‌తాధికారుల‌తో ఎన్నిక‌ల క‌మిటీని నియమించింది.   ఎన్నిక‌ల అధికారిగా డిఐజి ఎన్‌. సైదిరెడ్డి, స‌హాయ‌కులుగా ఖ‌మ్మం జిల్లా రిజిస్ట్రార్ ఎం. ర‌వీందర్ రావు, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ ఎం. సంతోష్‌ల‌ను నియ‌మించింది.  ఇందుకు సంబంధించి మెమో నెం. 6395/ ఆర్ ఇ జి ఎన్ 2/ 2025 -2 ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.  ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌పై ఆర్య‌వైశ్యులు సంతోషం వ్య‌క్తం చేశారు....

బైలా ప్రకారం నడువని వారిని పక్కనపెట్టి నూతన అధ్యక్షుని ఎన్నుకొండి - NLG జిల్లా మాజీ తెడ్ల జవహర్ బాబు*

Image
 *బైలా ప్రకారం నడువని వారిని పక్కనపెట్టి నూతన అధ్యక్షుని ఎన్నుకొండి - NLG జిల్లా మాజీ అధ్యక్షలు తెడ్ల జవహర్ బాబు*       నల్గొండ, గూఢచారి: మహాసభ స్టేట్ కౌన్సిల్ సభ్యులు దయచేసి సంఘం యొక్క పటిష్టతకు. సంఘం సంఘటితంకొరకు. సంఘ నియమనిబందనలను అనసరించని, బైలా ప్రకారం నడువని వారిని పక్కనపెట్టా లని కోరుతూ, బై లా అనుసరించే నూతన అధ్యక్షుని ఎన్నుకొనుటకు మీ అమూల్యమైన ఓటువేసి అత్యధిక మెజారిటితో గెలిపించగలరని నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు మాజీ అధ్యక్షలు తెడ్ల జవహర్ బాబు రాష్ట్ర స్టేట్ కౌన్సిల్. సభ్యులను కోరారు. వ్యక్తులపై అభిమనంకన్నా.సంఘంయొక్క పద్దతులుమిన్నా అని, ఆలోచించి ఓటువేయ కుంటే ఐక్యత సున్నా అని,  మనందరం ముందు తరాలకు ఆదర్శంగుండాలని అయన కోరారు.

ఒటరు అయిడెంటిటి కార్డులు ఇచ్చే అధికారం రద్దయిన కార్యవర్గానికి లేదని సోషల్ మీడియా లో చక్కర్లు

Image
 ఒటరు అయిడెంటిటి కార్డులు ఇచ్చే అధికారం రద్దయిన కార్యవర్గానికి లేదని సోషల్ మీడియా లో చక్కర్లు  మేము ఒటరు అయిడెంటిటి కార్డులు ఇస్తామని ఆర్యవైశ్య మహాసభ పాత  కార్యవర్గం లెటర్ హెడ్ తో  ఫోటోలు పంపమని కోరుతూ  సోషల్ మీడియాలో పోస్ట్ లేదు అలా ఇవ్వడానికి వీలుండదని మరో పోస్ట్ ఆర్యవైశ్య మహాసభ  ఎన్నికల నోటిఫికేషన్ జారి అయిన తరువాత రాష్ట్ర కార్యవర్గం రద్దయిపోతుంది అందరూ గమనించండి అంటూ సోషల్  మీడియా లో చక్కర్లు కొడుతున్న మరో పోస్టు. ఎన్నికల నోటిఫికేషన్ జారి అయిన తరువాత రాష్ట్ర కార్యవర్గం రద్దయిపోతుంది. మనందరికి తెలిసిందే, వోటర్ లిస్టు విడుదల అన్నింటిలో ఎన్నికల అధికారికి సర్వాధికారాలుంటయి. అలాంటప్పుడు ఒటరు అయిడెంటిటి కార్డులు ఇచ్చే అధికారం రద్దయిన కార్యవర్గానికి లేదు.  1. వోటర్లను ప్రలభపెట్టే ప్రయత్నం 2. కొత్త చర్చకు తెరలెపడం 3. కౌన్సిల్ సభ్యులు కానివాళ్ళను పూర్తిగ నిరుత్సహ పరచడం కాబట్టి ఇట్టి ప్రకటనమై రేపు చట్టపరమైన చర్యలు తీసుకునే విదంగా సంబదిత అదికారులకు వైశ్య పెద్దలు తెలియజేస్తారని తెలిపారు. కాబట్టి ఈలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను అందరు గమనించగలరని విజ్...