Posts

ఘనంగా గ్లోబల్ రీసైక్లింగ్ దినోత్సవం

Image
ఘనంగా గ్లోబల్ రీసైక్లింగ్ దినోత్సవం హైద్రాబాద్, (గూఢచారి): రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి మరియు వ్యర్థాలను తగ్గించడానికి తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు సహకారంతో విల్లా మేరీ డిగ్రీ కళాశాల ఫర్ ఉమెన్‌లో ఈరోజు గ్లోబల్ రీసైక్లింగ్ దినోత్సవాన్ని జరుపుకున్నారు.  వ్యర్థాలను తగ్గించడంలో, సహజ వనరులను పరిరక్షించడంలో మరియు వాతావరణ మార్పులను తగ్గించడంలో రీసైక్లింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా విద్యార్థులు, అధ్యాపక సభ్యులు మరియు TGPCB అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో M దయానంద్ మాట్లాడుతూ సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ TGPCB వ్యర్థాలను తగ్గించడంలో రీసైక్లింగ్ అవసరాన్ని నొక్కి చెప్పారు. "రీసైక్లింగ్ అనేది వ్యర్థాలను తగ్గించడానికి, సహజ వనరులను పరిరక్షించడానికి మరియు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన పద్ధతి" అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను అవలంబించాలి. ఈ-వ్యర్థాల నిర్వహణపై పవర్ పాయింట్‌ను ప్రదర్శించారు మరియు TGPCB ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. నాగేశ్వరరావు షార్ట్ ఫిల్మ్‌ను కూడా ప్రదర్శించారు. సోమాజిగూడ హైదరా...

ఉప్పల నూతన వధూవరులు సాయికిరణ్ ఉప్పల, మరియు శార్వరి దంపతులను ఆశీర్వదించిన టీజీ వెంకటేష్

Image
  ఉప్పల నూతన వధూవరులు సాయికిరణ్ ఉప్పల, మరియు శార్వరి దంపతులను ఆశీర్వదించిన టీజీ వెంకటేష్ హైద్రాబాద్:  ఐవీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ న్యూఢిల్లీ, తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ప్రభుత్వ టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పిలుపుమేరకు, వారి గృహానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకుడు, వైశ్య జాతి శిఖరం, రాజ్యసభ పూర్వపు సభ్యుడు,శ్రీ టీజీ వెంకటేష్. ఈరోజు ఉదయం విచ్చేసి ఉప్పల నూతన వధూవరులు సాయికిరణ్ ఉప్పల, మరియు శార్వరి దంపతులను ఆశీర్వదించారు. అందుకు ఉప్పల కుటుంబ సభ్యులు చాలా ఆనందించి, కృతజ్ఞతగా శ్రీ టీజీ వెంకటేష్ ని సన్మానించి గౌరవించారు. వెంకటేష్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు ఉప్పల కుటుంబ సభ్యులు తెలిపారు*

పొట్టి శ్రీరాములు పేరు మార్పు పై బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వాయిస్

Image
 

తక్షణమే చేసిన తప్పును సరిదిద్దుకోండి* *దేశభక్తులు ఆర్యవైశ్యలకు క్షమాపణ చెప్పండి - బండి సంజయ్

Image
 *పొట్టిశ్రీరాములు పేరు మార్చాల్సిన అవసరం ఏముంది?* *ఆయన గొప్ప దేశభక్తుడు...స్వాతంత్ర్య సమరయోధుడు* *హరిజనోద్దరణ ఉద్యమం చేశారనే సంగతి మర్చిపోయారా?* *ఆంధ్రా మూలాలుంటే పేర్లు మార్చేస్తారా?* *ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను కూడా మార్చే దమ్ముందా?* *ట్యాంక్ బండ్ పై ఉన్న ఆంధ్రుల విగ్రహాలను తొలగించే దమ్ముందా?* *తక్షణమే చేసిన తప్పును సరిదిద్దుకోండి* *దేశభక్తులు ఆర్యవైశ్యలకు క్షమాపణ చెప్పండి* *కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్...* *కరీంనగర్ లో పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఘన నివాళి అర్పించిన సంజయ్* *పొట్టి శ్రీరామలు పేరును తొలగించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రిని కలిసిన ఆర్యవైశ్య సంఘం* పొట్టి శ్రీరాములు పేరిటనున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరును తొలగిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టిశ్రీరాములు గొప్ప దేశభక్తుడు, గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్యవైశ్యుల ఆరాధ్య నేత అని కొనియాడారు. అట్లాంటి గొప్ప నేత పేరును మార్చాల్సిన అవసరం ...

ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి

Image
 ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నల్గొండ: గూఢచారి:  అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని తేది 16-3-2025 ఆదివారం ఉదయం10:00 గంటలకు తెలంగాణ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం, రామగిరి, ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మిశెట్టి శ్రీనివాస్, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శులు బుక్క ఈశ్వరయ్య, వనమా మనోహర్, ఉపాధ్యక్షులు నల్లగొండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు యమా మురళి, ఓరుగంటి పరమేష్, నల్లగొండ అశోక్, ఓమ్ ప్రసాద్, బోనగిరి కిరణ్, బిక్కుమాళ్ళ రవీందర్, వనమా గోపి, ఉప్పల రవీందర్ కుమార్, వనమా మురళి, కర్నాటి వెంకటేశ్వర్లు, నల్లగొండ సుమలత, తదితరులు పాల్గొన్నారు.

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ

Image
 ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ ఇంటి స్థలం మ్యుటేషన్ లో లంచం డిమాండ్ చేసి బాధితుడి వద్ద నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటూ మెదక్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన మంగళవారం జరిగింది  మెదక్ ( గూఢచారి) : ఇంటి స్థలం మ్యుటేషన్ లో లంచం డిమాండ్ చేసి బాధితుడి వద్ద నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటూ మెదక్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన మంగళవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మెదక్ పట్టణం కు చెందిన శైలజ కు సర్వేనెంబర్ 505/1/2 లో 605 గజాల ఇంటి స్థలం ఉంది. భూమి మ్యుటేషన్ కోసం గత నెలలో దరఖాస్తు చేసింది. కానీ మ్యుటేషన్ కోసం మున్సిపల్ ఆర్ ఐ జానయ్య ను సంప్రదించగా పని చేయలేదు. దీంతో పలు మార్లు అతని వద్దకు వెళ్లిన ప్రయోజనం కలగలేదు. దీంతో విషయం సోదరుడు ధర్మకారి శివకుమార్ కు చెప్పడంతో మున్సిపల్ ఆర్ ఐ వద్దకు వెళ్లి మ్యుటేషన్ చేయాలని కోరగా అందుకు రూ. 20 వేలు ఇవ్వాలని డిమండ్ చేసినట్లు తెలిపారు. ఇందుకు రూ.12 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ప్రభుత్వ అధికారి లంచం అడగడంతో శివకుమార్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు ...

మహాసభ డాక్యుమెంట్ కాపీలు ఇప్పించమని ఆర్టిఐ దరఖాస్తు చేసిన జర్నలిస్ట్ భూపతి రాజు

Image
  మహాసభ డాక్యుమెంట్ కాపీలు ఇప్పించమని ఆర్టిఐ దరఖాస్తు చేసిన జర్నలిస్ట్ భూపతి రాజు   హైద్రాబాద్:   తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియ బై లాకు మరియు రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ యాక్ట్ 2001 కు  విరుద్ధంగా జరుగుతున్నందున,  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ డాక్యుమెంట్లు  అట్టేస్ట్  చేసి ఇవ్వవలసిందిగా సమాచార హక్కు చట్టం క్రింద రిజిస్టర్ ఆఫ్ సొసైటీ హైదరాబాద్ సౌత్ గారి కార్యాలయం ప్రజా సమాచార అధికారి కి దరఖాస్తు చేసిన ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్ట్ భూపతి రాజు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఏర్పడి నుండి ఇప్పటివరకు ప్రజాస్వామ్యబద్ధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ యాక్ట్ 2001 ప్రకారం గా ఇప్పుడున్న పాలకులు వ్యవహరించారా?  లేదా అనే విషయాన్ని సమగ్రంగా పరిశీలించుట కొరకు దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు. బైలా మరి అమెండ్మెంట్లు రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ యాక్ట్ 2001  ప్ర కారం  చేశారా?, రిజిస్టర్ ఆఫ్ సొసైటీ వారికి ప్రతి సంవత్సరం ఇవ్వవలసిన డాక్యుమెంట్లు ఇచ్చారా?  అందులో ఏవైనా అక్రమాలు జరిగాయా?  అన్న విషయాన్...